Telusu Kada starring Siddhu Jonnalagadda, Raashii Khanna and Srnidhi Shetty has become one of the highly anticipated films in recent times. With Mallika Gandha song becoming a huge chartbuster and intriguing teaser, the movie buzz has been high.
Now, the makers have released Sogasu Chudatarama Song, composed by S Thaman. The famous music director is delivering melodious bangers for the film. He brought in the highly popular singer Karthik to croon this melody and it is a masterstroke.
While the melody is like sweet nectar to the ear, sizzling chemistry between Siddhu and Srinidhi is eye-catching. The way they both fill up the frame radiating charm and beauty is enchanting. Siddhu's trendy dance moves are icing on the cake.
Neerraja Kona is directing this love triangle and it features a twist in the tale with two friends falling for same man. TG Vishwa Prasad and Krithi Prasad, who are on a high with blockbuster success of Mirai are producing this trendy youthful romantic entertainer. Telusu Kada is releasing on 17th October in multiple languages.
నయనతార లాంచ్ చేసిన స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, ఎస్ థమన్, నీరజా కోన, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుసు కదా పెప్పీ రొమాంటిక్ నంబర్ సొగసు చూడతరమా
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెలుసు కదా ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇది సిద్దూ, రాశీ ఖన్నా అలరించిన క్లాసిక్ లవ్ నంబర్. ఈ రోజు సిద్దు, శ్రీనిధి శెట్టి నటించిన సెకండ్ సింగిల్ సొగసు చూడతరమా సాంగ్ ను హీరోయిన్ నయనతార లాంచ్ చేశారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి S థమన్ సంగీతం అందించారు.
సాయంత్రం ముగిసే సమయానికి సిద్ధూ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, శ్రీనిధి తన వాచ్ సమయాన్ని రీసెట్ చేస్తుంది, ఆమె ఇంకా వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా లేదని చూపించే సైన్ ఇది. ఈ ట్రాక్‌తో థమన్ మరో అద్భుతమైన కంపోజిషన్ అందించాడు. బాస్‌లైన్, డ్రమ్‌బీట్, ట్రంపెట్ పాటకు రెట్రో వైబ్‌ను ఇచ్చింది.
కార్తీక్ వోకల్స్ పాటకు డెప్త్, ఎమోషన్ ని యాడ్ చేసింది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ అమ్మాయి పట్ల సిద్ధు ఎమోషన్స్ ని అందంగా ప్రజెంట్ చేస్తోంది.
విజువల్స్ సాంగ్ కు మరింత బ్యూటీ యాడ్ చేశాయి. సిద్ధు, శ్రీనిధి మధ్య మెరిసే కెమిస్ట్రీ అదిరిపోయింది. సిద్ధు స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ ఆకట్టకున్నాయి. వైరల్ ట్యూన్, అద్భుతమైన విజువల్స్‌తో, ఈ పాట నేరుగా మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లోకి వెళ్ళింది.
ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పాటల చార్ట్ బస్టర్ హిట్స్ కావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.
అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డిఓపి: జ్ఞాన శేఖర్ వి.ఎస్.
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ