pizza

TFJA health camp held
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ఈరోజు ఫిలిం ఛాంబర్ లో నిర్వహించడం జరిగింది.

You are at idlebrain.com > news today >

01 February 2025
Hyderabad

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు గారు, మరియు ప్రముఖ హీరో విశ్వక్ సేన్ గారి చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభించడం జరిగింది.

దిల్ రాజు గారు మాట్లాడుతూ నిత్యం బిజీగా ఉండే ఫిలిం జర్నలిస్టులు ఆరోగ్యంపై అవగాహన , శ్రద్ధ అవసరం కాబట్టి ఇలాంటి క్యాంపులు వల్ల మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయని చెప్పారు..

ప్రముఖ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ మా అందరితో సరదాగా ఉండే జర్నలిస్టులు ఎప్పుడు అదే విధంగా ఉండాలి అంటే దానికి హెల్త్ క్యాంపులు మరింత ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సి.ఓ.ఓ భాస్కర్ రెడ్డి గారు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో ఒక ఏం.ఓ.యు కుదుర్చుకున్నారు..


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved