pizza

Family Star Vijay Deverakonda, Dil Raju, Narayana Murthy, Sreenivas Reddy distributes Telugu Film Journalist Association (TFJA) Health and ID Cards
రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకున్న తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌.. హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ - ఈవెంట్‌లో పాల్గొన్న తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, ఆర్‌.నారాయ‌ణమూర్తి

You are at idlebrain.com > news today >

23 March 2024
Hyderabad

The Telugu Film Journalists Association (TFJA) orchestrated a significant event today at Prasad Labs, Hyderabad, where they distributed Health and ID Cards to journalists, marking yet another milestone in their series of impactful initiatives. The event exuded grandeur, with prominent figures from the industry gracing the occasion, including esteemed actors Vijay Devarakonda, R. Narayanamurthy, and Sreenivas Reddy, along with distinguished personalities such as Chairman of Telangana Media Academy, Srinivas Reddy, and renowned producer Dil Raju, among others.

Amidst the jubilant atmosphere, TFJAC shed light on its past endeavors, particularly emphasizing its commitment to providing insurance to accredited journalists over the years. Mr. Surendra Kumar Naidu, the association's treasurer, elucidated on the meticulous efforts behind raising the insurance fund, extending heartfelt gratitude to the entire film fraternity for their unwavering support in turning this vision into reality. He also hinted at forthcoming details regarding certain journalists who were unable to avail the insurance, promising transparency under the guidance of General Secretary Mr. YJ Rambabu, while expressing gratitude to all attendees for their presence and support.

Mr. Naidu Surendra Kumar, Treasurer of TFJA, reaffirmed TFJA's dedication to assisting journalists in accessing health cards and insurance, assuring them of round-the-clock availability during emergencies. He articulated his commitment to fostering accountability within the realm of film journalism, emphasizing the forthcoming integration of digital media systems onto a unified platform aimed at cultivating a healthier societal discourse.

Virahat Ali, General Secretary of Telangana State Union of Working Journalists (TUWJ), extended felicitations to the Film Journalists Association for their proactive stance, acknowledging the pivotal role of film news and content in media circulation. He pledged unwavering support to TFJAC's noble endeavors, recognizing the symbiotic relationship between journalism and societal welfare.

In a resolute address, Lakshminarayana, President of TFJA, underscored the association's core values of unity and reliability, articulating its overarching mission to provide assurance through insurance. He envisioned a future where the association would champion the distribution of housing plots for journalists, extending heartfelt gratitude to all benefactors who rallied behind their cause.

Srinivas Reddy, Chairman of Telangana Media Academy, echoed the sentiment of housing as a paramount concern for journalists, citing instances of health-related adversities faced by many in the profession. He elucidated on past governmental policies regarding journalist welfare, lamenting their discontinuation over time. However, he expressed optimism under the leadership of Revanth Reddy, highlighting imminent resolutions to accreditation card issues and the provision of housing plots for eligible journalists.

The event culminated with the launch of a Diary, symbolizing a new chapter in journalist welfare, with producer Dil Raju receiving the first copy. Representatives from Tata AIG South, led by Ramakrishna, facilitated the distribution of insurance and health cards, underscoring the industry-wide collaboration towards journalist welfare. Vijay Devarakonda, in his characteristic charm, advocated for journalist housing and emphasized the importance of health and happiness, citing personal experiences and urging responsible journalism.

Dil Raju commended the efforts of TFJAC, stressing the significance of credible journalism in today's media landscape, while also shedding light on the underlying message of his upcoming film "Family Star." R. Naraynamurthy delivered an impassioned speech, advocating for further support towards economically disadvantaged journalists and urging against character assassination.

In retrospect, TFJAC acknowledged the altruism of Dil Raju in advancing their insurance agenda, reflecting on the collective resolve to uplift the journalistic community—a testament to the industry's solidarity and commitment to social welfare.

రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకున్న తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌.. హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ - ఈవెంట్‌లో పాల్గొన్న తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, ఆర్‌.నారాయ‌ణమూర్తి

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. ఈ ఏడాదిలో అసోషియేష‌న్ రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంది. అసోషియేష‌న్ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో, కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 లక్ష‌లు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది. అలాగే టర్మ్ పాలసీ విష‌యానికి వ‌స్తే స‌భ్యుడికి రూ.15 ల‌క్ష‌లు, యాక్సిడెంటల్ పాలసీ స‌భ్యుడికి రూ.25 ల‌క్ష‌ల‌ను అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. ఈ యేడాది (2024-25) వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించడం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఎఫ్‌జెఎ అధ్య‌క్షుడు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు, ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు స‌హా అసోసియేష‌న్ స‌భ్యులు.. జ‌ర్న‌లిస్ట్‌లు పాల్గొన్నారు.

TFJA ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ``20 ఏళ్లు స‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. ఇది మ‌న యూనిటీ. మ‌నం క‌లిసిమెలిసి ఇంత‌దాకా రాగ‌లిగాం. మ‌నం సాధించాల్సిన విష‌యాలు ఇంకా చాలా ఉన్నాయి. మెడిక‌ల్ మాత్ర‌మే కాదు, హౌసింగ్ ఉంది... ఇంకా చాలా ఉంది. టీఎఫ్‌జేఏకి వెన్నంటు ఉంటూ మ‌న‌ల్ని న‌డిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారికి ధ‌న్య‌వాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు 181 మంది స‌భ్యులం ఉన్నాం. ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ క‌లిపి 481 మంది ఉన్నాం. ఇదీ మ‌న కెపాసిటీ ఇవాళ‌. 2004లోప్రింట్‌, చానెల్స్ ఉన్నాం. ఇవాళ డిజిట‌ల్ మీడియా కూడా క‌లిపి ఉన్నాం. కోవిడ్ టైమ్‌లో చిరంజీవిగారు మ‌న అసోసియేష‌న్‌కి యోధా డ‌యోగ్న‌స్టిక్స్ ద్వారా 50 శాతం వెసులుబాటు క‌ల్పించారు. త‌ల్లిదండ్రుల‌కు కూడా ఈ స‌దుపాయాన్ని అంద‌జేశారు. కోవిడ్ టైమ్‌లో అసోసియేష‌న్ ద్వారా రెండు సార్లు గ్రాస‌రీస్ అంద‌జేశాం. ఇవాళ మెడిక‌ల్ ఇన్య్సూరెన్స్ ప్ర‌తి వ్య‌క్తికీ 10 ల‌క్ష‌ల‌ను అందిస్తున్నాం. అందులో 5 ల‌క్ష‌లు మెంబ‌ర్‌కి, 5 ల‌క్ష‌లు ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇందులో స‌గం మెంబ‌ర్ క‌ట్టుకుంటే, స‌గం అసోసియేష‌న్ భ‌రిస్తోంది. అలాగే ట‌ర్మ్ పాల‌సీ ప్ర‌తి స‌భ్యుడికీ 15 ల‌క్ష‌లు ప్ర‌తి ఏడాదీ ఇస్తున్నాం. ఎవ‌రికీ ఏమీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుందాం. ఒక‌వేళ జ‌రిగితే వాళ్ల కుటుంబాల‌కు ఇస్తున్నాం. బి.ఎ.రాజు, ట్రేడ్ గైడ్ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అందించాం. 25 ల‌క్ష‌ల రూపాయ‌లు యాక్సిడెంట‌ల్ పాల‌సీని అందిస్తున్నాం. జ‌ర‌గ‌రానిది జ‌రిగితే, వారి కుటుంబానికి 25 ల‌క్ష‌లు వెళ్తుంది. ఆఫీసుల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే వారి శాల‌రీ నుంచి 70 శాతం 16 నెల‌లు అందిస్తాం. ఇలా ఈ మ‌ధ్య‌న మేం కిశోర్‌కి అంద‌జేశాం. అయితే అత‌ను ఆ డ‌బ్బును తీసుకోకుండా, పాల‌సీ క‌ట్ట‌లేని ప‌రిస్థితిలో ఉన్న‌వారికి త‌న త‌ర‌ఫున క‌ట్ట‌మ‌ని చెప్పాడు. 2023-24లో మైత్రీమూవీ న‌వీన్‌,ర‌వి, ఫెస్టివ్‌ ఆఫ్ జాయ్ త‌ర‌ఫున సుమ క‌న‌కాల‌గారు రూ.5ల‌క్ష‌లు, సాయిధ‌ర‌మ్‌తేజ్ రూ.4ల‌క్ష‌లు ఇచ్చారు. మ‌న అసోసియేష‌న్ త‌ర‌ఫున పావ‌లా శ్యామ‌ల‌కు రూ.ల‌క్ష ఆయ‌నే ఇచ్చారు. అలాగే మిత్ర శ‌ర్మ‌ 2 ల‌క్ష‌లు, కిర‌ణ్ అబ్బ‌వ‌రం 2 ల‌క్ష‌లు, శివ‌కంఠంనేని ల‌క్ష‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ మ‌హేష్‌రెడ్డి ల‌క్ష‌, హాస్యం మూవీస్ ల‌క్ష‌, అనుశ్రీ ప్రొడ‌క్ష‌న్స్ ఒక‌టిన్న‌ర ల‌క్ష ఇచ్చారు. మ‌న‌కి ఈ ఏడాది 27 ల‌క్ష‌ల 61 వేల 114 రూపాయ‌లు అలా వ‌చ్చాయి. మెంబ‌ర్‌షిప్‌, ఇన్స్యూరెన్స్ ద్వారా 22 ల‌క్ష‌ల 20 వేల రూపాయ‌లు వ‌చ్చాయి. వీటితో పాటు మ‌నం ఎంత ఖ‌ర్చుపెట్టామ‌నే విష‌యాన్ని కూడా మెంబ‌ర్స్ కి ఓపెన్‌గా ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాం. మ‌నం కార్ప‌స్ ఫండ్ ఎలాగైనా ఏర్పాటు చేసుకోవాలి`` అని అన్నారు.

TFJA జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు మాట్లాడుతూ 20 ఏళ్ల అసోసియేష‌న్‌లో హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. శ్రీనివాస‌రెడ్డిగారి స‌ల‌హాలు మేం బాగా తీసుకుంటాం. ఎల‌క్ట్రానిక్ మీడియా వ‌చ్చిన కొత్త‌లో పెట్టిన అసోసియేష‌న్ ఇది. ఇప్పుడు డిజిట‌ల్ మీడియా కూడా ఎల‌క్ట్రానిక్ మీడియాలో భాగం. అందుకే 2019లో డిజిట‌ల్ మీడియాను కూడా క‌లుపుకుని ఐదేళ్లు ఫీల్డ్ లో ప‌నిచేసిన వారంద‌రికీ స‌భ్య‌త్వం ఇచ్చాం. మ‌న‌ది చిన్న ఫ్యామిలీ. పొలిటిక‌ల్ జ‌ర్న‌లిస్టుల‌కి ఆ ప్ర‌యారిటీ వేరుగా ఉంటుంది. సినిమా ఇండ‌స్ట్రీలో నెగ‌టివిటీని త‌ట్టుకోలేం. సోష‌ల్ మీడియా పెరిగాక యూట్యూబ్‌లో వ‌చ్చేవాళ్లు కూడా జ‌ర్న‌లిస్టుల‌నే అంటున్నారు. సొంత వ్యూస్ చెప్ప‌డానికి జ‌ర్న‌లిస్టుగా ట్యాగ్ వేసుకోవ‌డం బాధ‌గా అనిపిస్తుంది. దిల్‌రాజుతోనూ దీని గురించి మాట్లాడాం. జ‌ర్న‌లిస్టుల‌కు అకౌంట‌బిలిటీ తీసుకొస్తున్నాం. కంటెంట్‌ని క‌ట్ చేయ‌డం లేదు. కాక‌పోతే ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు దాన్ని ప‌రిష్క‌రించ‌డానికి కృషి చేస్తున్నాం. 2021లో డిజిట‌ల్ మీడియా అని ఓ సంస్థ పెట్టాం. దాన్ని యాక్టివ్ చేసే ప‌నిలో ఉన్నాం. దాన్ని కూడా యాక్టివ్ చేస్తాం. ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్లు ఎవ‌రు? సోష‌ల్ మీడియా ఎవ‌రు? వ‌ంటివాటిని పీఆర్వో ఆసోసియేష‌న్‌తో మాట్లాడుతున్నాం. పొల్యూష‌న్ లేని సొసైటీ కోసం కృషి చేస్తున్నాం. సినిమా ఇండ‌స్ట్రీ బావుంటే అంద‌రూ బావుంటారు. కాబ‌ట్టి సినిమా ఇండ‌స్ట్రీ బావుండాల‌ని కోరుకోండి అని అన్నారు.

TFJA ప్రెసిడెంట్‌ వార‌ణాసి ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ అంటే ఓ యూనిటీ, ఓ భ‌రోసా. ఈ సంస్థ ఏర్ప‌డ‌టానికి ముఖ్య‌కార‌ణం హెల్త్ కి సంబంధించి అంద‌రికీ ఓ భ‌రోసా క‌ల్పించాల‌న్న‌దే. నెక్స్ట్ మన ఎయిమ్ హౌసింగ్‌. త్వ‌ర‌లో హౌసింగ్ మెంబ‌ర్‌షిప్‌కి అంద‌రికీ ఆహ్వానం అందుతుంది. స‌భ్యులంద‌రికీ ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్‌గారి ఆధ్వ‌ర్యంలో ప్లాట్లు వ‌చ్చే విధంగా కృషి చేస్తాం. ఇన్నేళ్లుగా మ‌న అసోసియేష‌న్‌కి ఆర్థికంగా సాయ‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. జ‌ర్న‌లిస్ట్ అంటే ఓ క్రెడిబిలిటీ, ఓ హుందాత‌నం ఉండాలి. అంద‌రిలో అది పెంపొందాలి. అంద‌రూ ముందుండాలి. ఒక‌రికి ఏదైనా ఇబ్బంది క‌లిగితే, ఇంకొక‌రు సాయం ప‌డేలా ఉండాలి. సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌క్క‌వారికి ఏదోలా సాయం చేసేలా ఉండేలా మీ న‌డ‌వ‌డిక ఉండాల‌ని కోరుకుంటున్నా అని అన్నారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ `మ‌నం ప్ర‌జ‌ల ప‌క్షాన ప‌నిచేస్తున్నామ‌నే భావ‌న జ‌నాల‌కు క‌ల‌గ‌జేయాలి. తెలంగాణ‌లో 23వేల మంది అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. ప్ర‌తి సంస్థ‌లోనూ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేకంగా అక్రిడేష‌న్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఇళ్ల స్థ‌లాలను ఇస్తామ‌ని గ‌త ప్ర‌భుత్వం ఆశ‌పెట్టింది. నెర‌వేర‌లేదు. ఇప్పుడు ఈ ప్ర‌భుత్వం ఇస్తార‌న్న ఆశ ఉంది. ఎలిజెబుల్ పీపుల్‌కి క‌చ్చితంగా అక్రిడేష‌న్ ఇప్పిస్తాం. 40 ఏళ్ల‌ అక్రిడేష‌న్‌కి క్రితం రూల్స్ పెట్టిన‌ప్పుడు, ఆ త‌ర్వాత మార్పు చేసిన‌ప్పుడు కూడా నాకు తెలుసు. ప్ర‌భుత్వాల నుంచి ఏ సౌక‌ర్యాలు పొందాల‌న్నా అంద‌రిలోనూ యూనిటీ ఉండాలి. అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేసేది ఒక‌టే. మ‌న ప్రొఫెష‌న్ విలువ‌, స్టాండ‌ర్డ్ ఆఫ్ జ‌ర్న‌లిజం, ఎథిక్స్ ని ఇంకా పెంచుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. ప్ర‌భుత్వం మీద నాకు న‌మ్మ‌కం ఉంది. జూన్ 6 త‌ర్వాత ఎలిజిబుల్ జ‌ర్న‌లిస్టుల‌కు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థ‌లాలు, అక్రిడేష‌న్ కార్డులు అందించే ప్ర‌య‌త్నం చేస్తాం. ఈ అసోసియేష‌న్ ఇంత క‌లిసిక‌ట్టుగా ఉండ‌టం చూస్తుంటే ముచ్చ‌టేస్తోంది. కానీ ప్ర‌భుత్వాల నుంచి కూడా ఏదీ ఫ్రీగా ఎక్స్ పెక్ట్ చేయొద్దు. భూముల‌నో, ఫ్లాట్‌ల‌నో మార్కెట్ రేటు కాకుండా, మ‌న‌కంటూ ఓ రేటుకి ఇస్తే దాన్ని కట్టుకుందాం ` అని అన్నారు.

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల‌కు శ్రీనివాస‌రెడ్డిగారు ల్యాండ్‌లు ఇప్పిస్తే, అంద‌రూ ఆనందంగా ఉంటారు. జ‌ర్న‌లిస్టుల హెల్త్ కార్డుల సెల‌బ్రేష‌న్‌లో నేను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస‌రెడ్డిగారు ఇన్ని మాట్లాడుతుంటే నాకు చాలా విష‌యాలు తెలిశాయి. ఆయ‌న చాలా స్ట్రాంగ్ గైడ్ అనిపిస్తోంది. నా కెరీర్ మొద‌టి నుంచీ జ‌ర్న‌లిస్టులు నాతోనే ఉన్నారు. నేను కాలేజ్‌లో ఉన్న‌ప్పుడు మెడిక‌ల్ బిల్లులు ఎక్కువ వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువ‌ల్‌కి డ‌బ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వ‌దిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేష‌న్ ద్వారా అంద‌రూ యుటిలైజ్ చేసుకుంటున్నార‌ని తెలిసి ఆనందంగా అనిపించింది. జీవితంలో ఎవ‌రికైనా మూడే ముఖ్యం. ఒక‌టి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డ‌బ్బు. ఈ మూడిటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. ఉండి తీరుతుంది. జీవితంలో ఈ మూడు ఉంటాయి. అంద‌రూ ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోండి. నేను మీతో సుదీర్ఘ ప్ర‌యాణం చేస్తాను అని అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ `యూనియ‌న్‌కి పిల‌వ‌డం చాలా ఆనందంగా ఉంది. చాలా టైట్‌లో ఉన్నా. ఇవాళ ఉద‌యం 4 గంట‌ల‌కు ప‌డుకున్నా. మీ ఇన్‌స్యూరెన్స్ మొద‌టడుగు వేయించింది నేనేన‌ట‌. హెల్త్ కోసం ఇవాళ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం చూస్తుంటే ఆనందంగా ఉంది. అంద‌రికీ శుభాకాంక్ష‌లు. మీలో ఎక్కువ‌మంది 40 ఏళ్లు దాటిన‌వారే. కొన్ని సినిమాల్లో సొసైటీలో అత్యంత గౌర‌వ‌మున్న పాత్ర‌ల‌ను చూపించేవారు. అందులో జ‌ర్న‌లిస్ట్ కేర‌క్ట‌ర్ ఉంటుంది. ఎన్నో సినిమాల్లో జ‌ర్న‌లిస్టుల‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది. ఇందాక శ్రీనివాస‌రెడ్డిగారు నిజాయ‌తీగా ఓ మాట చెప్పారు. జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న‌ప్పుడు మ‌నం చేసేది, రాసేది సొసైటీకి ఉప‌యోగ‌ప‌డాల‌ని అన్నారు. కాల‌క్ర‌మేణ జ‌ర్న‌లిజం కూడా మారిపోతూ వ్యాపార‌మైపోయింది. అంద‌రూ బావుండాలి. వ్యాపారం చేయాలి. కానీ జ‌ర్న‌లిస్టుగా రాసే ప‌దం చాలా ముఖ్యం. సెల్‌ఫోన్ల‌ను నొక్కుతున్నారు కాబ‌ట్టి, కాస్త జాగ్ర‌త్త‌గా చూసి నొక్కితే పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఫ్యామిలీస్టార్ అని టైటిల్ పెట్టిన‌ప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ని స్టార్‌గా చూపించ‌డానికి పెట్టుకున్నాన‌ని అనుకున్నారు. ఎక్క‌డో ఉన్న మీ కుటుంబాల‌ను పైకి తీసుకురావ‌డం కోసం కృషి చేసే మీలాంటి స్టార్ గురించి చూపిస్తున్నాం. ఎక్క‌డి నుంచో వ‌చ్చి, సొసైటీలో ఫ్యామిలీస్‌కి మ‌ర్యాద‌ను తెచ్చిపెట్టే ప్ర‌తి ఒక్క‌రూ ఫ్యామిలీస్టారే. అదే మా సినిమా కాన్సెప్ట్ ` అని అన్నారు.

పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌ను ఫ్రీగా ఇప్పించండి. స్థ‌లాల‌ను రేవంత్‌రెడ్డిగారిని అడ‌గండి. ఇళ్లు మీరు క‌ట్టుకోండి. శ్రీనివాస‌రెడ్డిగారు స్థ‌లాల‌ను ఇప్పించి పుణ్యం క‌ట్టుకోవాలి. తుపాకి క‌న్నా క‌లానికి భ‌య‌ప‌డ‌తాన‌ని అన్నారు నెపోలియ‌న్‌. ఎంతో మంది జ‌ర్న‌లిస్టులను క‌న్న‌ది సినిమా త‌ల్లి. ఆ రోజుల్లో వారం రోజుల‌కు త‌ర్వాతే రివ్యూలు రాసేవారు. కానీ ఇప్పుడు మార్నింగ్ షోకే రాస్తున్నారు. ఇవాళ సినిమా మూడు రోజులే బ‌తుకుతోంది. సినిమా గురించి రాస్తున్నప్పుడు ద‌య‌చేసి సినిమాను చంపేయ‌కండి. కేర‌క్ట‌ర్ అసాసినేష‌న్ చేయ‌కండి. న‌న్న‌ని కాదు.. ఎవ‌రి గురించైనా రాసేట‌ప్పుడు ఆలోచించి రాయండి. ద‌య ఉంచి త‌ప్పుడు రాత‌లు రాయకండి. సినిమా ఇవాళ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది. సినిమా ఇండ‌స్ట్రీలో 90 శాతం స‌గ‌టు నిర్మాత‌లున్నారు. కానీ 10 శాత‌మే విజ‌యం ఉంది. మిగ‌లిన 90 శాతం ఎలా ఉంది? మీడియాలో భారీ సినిమాల‌నే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మిగిలిన సినిమాల ప‌రిస్థితి ఏంటి? అన్నీ చూడండి.. అంద‌రినీ ప్రోత్స‌హించండి అని అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved