01 February 2025
Hyderabad
Presenter Muthyala Subbaiah expressed his delight at the overwhelming response received on the first day of release for the film Thalli Manasu. Featuring Rachitha Mahalakshmi, Kamal Kamaraju, Satvik, and Sahitya in key roles, the film is produced under the Muthyala Movie Makers banner. Senior director Muthyala Subbaiah has presented the film, while his son, Muthyala Anantha Kishore, makes his debut as a producer. Director V. Srinivas (Sippy), who has previously worked in the direction department with several renowned filmmakers, makes his directorial debut with this project.
Speaking about the film, which released in theaters on Friday, Muthyala Subbaiah shared his happiness, stating that audiences in both Telugu states were moved by its subject centered around motherhood. He mentioned that after a long time, viewers have appreciated a heartfelt film that deeply explores the emotions and struggles of a mother while also offering engaging entertainment.
He further emphasized that while people often complain about the lack of good films, supporting movies like Thalli Manasu would inspire filmmakers to create more meaningful content. He encouraged families, especially women, to watch and support the film, as it carries a strong emotional core. With positive word-of-mouth, the team is confident that the film’s collections will continue to grow.
Muthyala Anantha Kishore, the film’s producer, stated that the strong talk from the very first show is increasing audience interest. He urged viewers not to miss Thalli Manasu, emphasizing that it is not just their film but a meaningful story with an important message that deserves to be experienced on the big screen.
"తల్లి మనసు"ను మిస్ కావద్దు
"తల్లి మనసు" చిత్రానికి విడుదలైన తొలిరోజునే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించడం ఆనందదాయకమని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య స్పష్టం చేశారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది. పూర్వాశ్రమంలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమయ్యారు.
శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం గురించి చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన అన్ని సెంటర్స్ లో తల్లికి సంబందించిన సబ్జెక్టుతో చాలాకాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూశామంటూ ప్రేక్షకులు చెబుతుండటం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తల్లి తపన, భావోద్వేగాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రంలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉందని అన్నారు. మంచి చిత్రాలు రావడం లేదని కొందరు అంటుంటారని, అయితే ఇలాంటి మంచి చిత్రాలు చూసి, ఆదరించినప్పుడు మరిన్ని ఇలాంటి చిత్రాలు తీసేందుకు స్ఫూర్తిదాయకం అవుతుందని అన్నారు. తమ తమ కుటుంబ సభ్యులతో కలసి మహిళలు మరింతగా ఆదరించాల్సిన చిత్రమిదని అన్నారు. చిత్రానికి వచ్చిన మంచి టాక్ తో కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని తాము భావిస్తున్నామని చెప్పారు. నటీనటులంతా తమ పాత్రలలో ఒదిగిపోయారని, దర్శకుడు సిప్పీతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల పనితనం చిత్రానికి ఊపిరి పోసిందని అన్నారు. అలాగే నిర్మాతగా ఓ మంచి చిత్రం తీయాలన్న మా పెద్ద అబ్బాయి అనంత కిశోర్ సంకల్పం, అభిరుచే ఈ చిత్ర నిర్మాణానికి దోహదం చేసిందని అన్నారు.
చిత్ర నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ , తొలి రోజు, మార్నింగ్ షోతోనే చూసి తీరాల్సిన చిత్రమన్న టాక్ రావడంతో ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూ వస్తోందని, ఇది మేము తీసిన చిత్రమని చెప్పడం కాకుండా మంచి పాయింట్ తో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మిస్ కావద్దని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
|