pizza

My Dream is to Build a World-Class Music School: Music Sensation Thaman
వరల్డ్ క్లాస్ మ్యూజిక్ స్కూల్ కట్టాలనేది నా కల : మ్యూజిక్ సెన్సేషన్ తమన్

You are at idlebrain.com > news today >

16 November 2024
Hyderabad

Q: How do you manage so many projects and handle them efficiently?
At one time, films were more routine. Now, we’re seeing different kinds of stories and unique concepts, which allows me to create diverse music. I’m thoroughly enjoying this phase. Projects like Telusu Kada, OG, Game Changer, and Daku Maharaj are each distinct in their own way. For instance, Daku Maharaj will have only three songs, while Game Changer has seven. Director Shankar is returning to a proper commercial film after a long time. It will feature everything, from family-friendly moments to fights. Game Changer is a film that the whole family can enjoy together.

Q: What precautions do you take when composing background scores?
If there’s no emotion in the movie, no matter how much effort I put into the score, it’s useless. I align my music with the story and the director’s vision. For example, I cannot replicate Akhanda's style for Bhagavanth Kesari. When it comes to background music, after Mani Sharma, I’m trying to set a new trend. For some films, the focus should be on the voices; for others, it’s about instrumental sounds. When working on Akhanda, it felt like Lord Shiva was guiding me. I’m unsure if I can create background music of that caliber again.

Q: How has it been working on Pushpa 2?
When I watched Pushpa 2, I was blown away. It’s extraordinary. After this film, awards will chase Bunny (Allu Arjun). I was initially asked to complete the entire score in 15 days, which wasn’t feasible. So, I focused on completing the first half with the available time.

Q: Do you feel there’s anything left for you to achieve?
I haven’t achieved anything yet. My real journey starts now. Our industry is growing. Earlier, we used to bring in artists from other states or languages. Now, globally renowned artists are willing to act in our films. For OG, we’re in talks with Korean and Japanese talents. As the industry’s span widens, I need to learn and evolve to match global standards.

Q: Who inspires you in music?
My dream is to reach A.R. Rahman’s level. During Boys, director Shankar saw me as an actor, but it took years for him to recognize me as a good music director. Working on Shankar’s film was my dream, but I always felt I didn’t fit his or Sukumar’s style. That’s why I didn’t even have their contact numbers. During the lockdown, Shankar reportedly watched Ala Vaikunthapurramuloo multiple times. When Dil Raju mentioned the Game Changer project and asked me to meet Shankar, I was nervous. But the album was completed within six months.

Q: What can we expect from Game Changer’s songs? How has Shankar created his magic?
On the 20th of this month, we’ll release a duet song from Game Changer. Later, we plan a grand event in the U.S. to launch the song Dope, which will also have an English version. The song picturizations are mind-blowing; you’ll feel like two eyes aren’t enough to take it all in. After a long time, audiences will experience perfectly commercial songs. These six songs alone are worth the ticket price. Shankar filmed the six songs first before shooting the scenes

Q: When can we expect updates about The Raja Saab?
Raja Saheb will have six songs, including a remix. The songs will suit a proper commercial film. We plan to share updates from January.

Q: What do you have to say about the criticism you face?
I’ve composed music for many routine films, and during that time, I was trolled as a "copycat" or "copy goat." However, I no longer select routine projects. Smart individuals can copy music so carefully that it’s hard to trace, but I lack that skill. If I copied, I’d get caught instantly (laughs).

Q: When can we expect updates about OG?
If I share anything about OG, it becomes DC (Damage Control), so I speak cautiously. We initially planned to release a song and poster on September 2, but the floods made everyone reconsider. Updates will start in January. Nearly 80% of the shoot is complete. OG will have an opening like never before in India.

Q: On a personal note, what do your wife and children do?
My wife handles all my accounts and music affairs. If I need money, I ask her, and she provides it. My son is in his first year at IIT. My family is slowly relocating to Hyderabad.

Q: How do you manage everything? How supportive is your team?
My first paycheck was ₹30. As a keyboard player, my maximum earning was ₹40,000 per day, which was the highest in India back then. After a day’s work, bringing home that money felt incredibly satisfying. My 25-year-old team is my strength; they’re always with me.

Q: Are you scoring music for Allu Arjun and Trivikram’s next project?
Yes, I’m composing for Bunny and Trivikram’s next film. With this project, Trivikram will move to the next league, where he rightfully belongs. He’s crafting a new world for this project, which you’ll soon see.

Q: It’s been a while since we saw a complete love story album from you. Any updates?
Telusu Kada is a beautiful love story written by Neeraja Kona. Vishwaprasad from People Media Factory is supporting her. The film has six amazing songs, and Siddhu got a fantastic role. The movie is shaping up beautifully. After Tholi Prema, this will be another great love story album from me.

Q: What’s your life’s dream or ambition?
I want to build a music school to teach underprivileged individuals for free. Places with music see lower crime rates. I also enjoy playing cricket, it refreshes my mind and inspires new tunes. In the next two to three years, I plan to build a world-class studio here. I may even approach the government for support, though I won’t ask for land.

Q: Will your son follow in your footsteps as a music director?
By observing how my son plays the piano, I can tell what emotions he’s feeling. However, I don’t give him advice or guide him on which path to take. I believe he will learn through experience and return stronger.

Q: Are you collaborating with Akira Nandan for OG?
For OG, I’m planning to include a song by Ramana Gogula. Akira is a fantastic pianist, and I’d love to involve him. Akira worked with me for two months, and his long fingers make him a perfect pianist.

వరల్డ్ క్లాస్ మ్యూజిక్ స్కూల్ కట్టాలనేది నా కల : మ్యూజిక్ సెన్సేషన్ తమన్

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఓజీ, రాజా సాబ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో తమన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తమన్ తన పుట్టిన రోజు (నవంబర్ 16)ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలో మీడియాతో తమన్ ముచ్చట్లు పెట్టారు. ఆయన చెప్పిన విశేషాలివే..

* తమన్ గారు.. మీరు ఇన్ని ప్రాజెక్టుల్ని ఎలా ఒప్పుకుంటున్నారు? ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి. రకరకాల కాన్సెప్టులు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ‘తెలుసు కదా’, ‘ఓజీ’, ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ ఇలా దేనికదే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘డాకు మహారాజ్’ చిత్రంలో మూడు పాటలే ఉంటాయి. గేమ్ చేంజర్‌లో ఏడు పాటలుంటాయి. శంకర్ గారు చాలా ఏళ్ల తరువాత ఓ ప్రాపర్ కమర్షియల్ సినిమాను చేస్తున్నారు. సాంగ్స్, ఫైట్స్ ఇలా ఏది కావాలంటే అది ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా గేమ్ చేంజర్ ఉంటుంది.

* సంక్రాంతికి మీతో మీకే పోటీ ఉండేలా కనిపిస్తోంది?
బాలయ్య గారిది సంక్రాంతికి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిసెంబర్‌కి వస్తుందనేది ముందుగా ఉన్న ప్లాన్. కానీ చివరకు గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చింది. దాని కోసం దిల్ రాజు ఎన్నో అడ్జస్ట్మెంట్లు చేశారు. ఎంతో కష్టపడ్డారు. సంక్రాంతికి ఆయన చిత్రమే మరోకటి ఉంది. అందరితో మాట్లాడుకుని అందరికీ సర్ది చెప్పి గేమ్ చేంజర్‌ను జనవరి 10న ఫిక్స్ చేశారు.

* ఆర్ఆర్ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి?
సినిమాలో ఎమోషన్ లేకపోతే నేను ఎంత కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా నేను మ్యూజిక్ ఇస్తాను. అఖండకు ఇచ్చినట్టుగా భగవంత్ కేసరికి ఇవ్వలేను. బీజీఎం అనే దానికి మణి గారి తరువాత ట్రెండ్‌ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి.. ఇంకొన్ని చిత్రాలకు పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి. అఖండకు చేసే టైంలో శివుడే నాలోకి వచ్చి చేయించినట్టుగా అనిపిస్తుంది. మళ్లీ ఆ రేంజ్ బీజీఎం ఇస్తానో లేదో నాకు తెలీదు.

* పుష్ప 2 కోసం పని చేయడం ఎలా అనిపిస్తోంది?
పుష్ప 2 చూసి భయపడ్డాను. అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ తరువాత అవార్డులన్నీ కూడా బన్నీకి గారి కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. పది హేను రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైంలో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా కంప్లీట్ చేసి ఇచ్చాను.

* మీరు ఇంకా సాధించాల్సింది ఏమైనా ఉందని అనుకుంటున్నారా?
నేను ఇప్పటి వరకు ఏమీ సాధించలేదు. ఇకపై సాధించాల్సింది ఉంది. ప్రస్తుతం మన ఇండస్ట్రీ ఎదుగుతూ వస్తోంది. ఒకప్పుడు పక్క భాషలు, రాష్ట్రాల నుంచి ఆర్టిస్టుల్ని తీసుకొచ్చుకునే వాళ్లం. ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా ఫేమస్ ఆర్టిస్టులు మన చిత్రాల్లో నటిస్తామని వస్తున్నారు. ఓజీ కోసం కొరియన్, జపాన్ వాళ్లతో చర్చిస్తున్నాం. మన స్పాన్ పెరుగుతోంది. ఇంకా నేను కొత్తగా నేర్చుకుని గ్లోబల్ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాల్సి ఉంటుంది.

* మ్యూజిక్‌లో మీకు స్పూర్తి ఎవరు?
ఏఆర్ రెహమాన్ స్థాయికి వెళ్లాలి అనేది నా కల. బాయ్స్ టైంలో శంకర్ గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని అని గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్ గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. కానీ శంకర్ గారు, సుకుమార్ గారు వంటి వారి స్టైల్‌కి నేను సరిపోను అనుకునేవాడ్ని. అందుకే వాళ్ల నంబర్లు కూడా నా దగ్గర ఉండవు. లాక్డౌన్ టైంలో శంకర్ గారు అల వైకుంఠపురములో సినిమాను కొన్ని వందల సార్లు చూశారట. దిల్ రాజు గారు నాకు ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు, శంకర్ గారిని వెళ్లి కలవమని చెప్పినప్పుడు భయం వేసింది. ఆరు నెలల్లోనే ఆల్బమ్ కంప్లీట్ అయింది.

* గేమ్ చేంజర్ సాంగ్స్ ఎలా ఉండబోతోన్నాయి? శంకర్ గారు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశారు?
గేమ్ చేంజర్ నుంచి నెక్ట్స్ 20వ తేదీన ఒక డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేస్తాం. ఆ తరువాత అమెరికాలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి డోప్ అనే పాటను రిలీజ్ చేస్తాం. ఆ పాట ఇంగ్లీష్ వర్షెన్ కూడా ఉంటుంది. గేమ్ చేంజర్ సాంగ్ పిక్చరైజేషన్ చూసి మైండ్ బ్లాక్ అయింది. వాటిని చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ కమర్షియల్ సాంగ్‌‌లను చూడబోతోన్నాం. అసలు ఆ ఆరు పాటలకే టికెట్ డబ్బులు ఇచ్చేయొచ్చు. శంకర్ గారు గేమ్ చేంజర్‌లో ముందుగా ఆరు పాటల్ని షూట్ చేశారు. ఆ తరువాతే సీన్లను షూట్ చేశారు.

* రాజా సాబ్ నుంచి అప్డేట్లు ఎప్పుడు ఉండబోతోన్నాయి?
రాజా సాబ్‌లో ఆరు పాటలుంటయి. ఓ రీమేక్ సాంగ్ కూడా ఉంటుంది. ప్రాపర్ కమర్షియల్ సినిమాకు ఉన్నట్టే సాంగ్స్ ఉంటాయి. జనవరి నుంచి పాటల అప్డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నాం.

* మీపై వచ్చే విమర్శల గురించి ఏం చెబుతారు?
ఒకప్పుడు మూసధోరణిలో ఉన్న సినిమాలకు కంటిన్యూగా మ్యూజిక్ ఇస్తూ వచ్చాను. ఆ టైంలో కాపీ క్యాట్, కాపీ గోట్ అని ట్రోల్ చేశారు. మళ్లీ అలాంటి రొటీన్ చిత్రాలను సెలెక్ట్ చేసుకోవడం లేదు. తెలివైన వాళ్లు చాలా జాగ్రత్తగా కాపీ కొడతారు. ఎక్కడి నుంచి కొట్టారో కనిపెట్టలేం. కానీ నాకు అంత తెలివి లేదు. కాపీ కొట్టడం రాదు. అందుకే వెంటనే దొరికిపోతాను(నవ్వులు)

* పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి అప్డేట్లు ఎప్పుడు ఉంటాయి?
ఓజీ గురించి నేను ఏం మాట్లాడినా డీసీఎంకి చేరుతుంది. అందుకే నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. సెప్టెంబర్ 2న పాట, పోస్టర్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆయన వరదల ప్రభావంతో అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయొద్దని అన్నారు. జనవరి నుంచి అప్డేట్లు ఇస్తాం. దాదాపు 80 శాతం షూటింగ్ అయిపోయింది. ఇంత వరకు ఇండియాలో రానటువంటి ఓపెనింగ్స్ ఓజీకి వస్తాయి. ఆయన్ను మీట్ అయ్యేందుకే కష్టపడుతున్నాం. ఇంకా పాటలు పాడించడం ఏంటి? (నవ్వులు)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved