pizza

You’ll witness mind-blowing action and amazing visuals in Thammudu: Varsha Bollamma
"తమ్ముడు" మూవీలో మైండ్ బ్లోయింగ్ యాక్షన్, అమేజింగ్ విజువల్స్ ఎంజాయ్ చేస్తారు - హీరోయిన్ వర్ష బొల్లమ్మ

You are at idlebrain.com > news today >

03 July 2025
Hyderabad

After the blockbuster hit Sankranthiki Vasthunnam, renowned production house Sri Venkateswara Creations is back with another superhit, Thammudu. Produced by Dil Raju and Sirish, and directed by Sriram Venu, the film features Laya, Varsha Bollamma, and Saptami Gowda in pivotal roles. Thammudu is set for a grand worldwide theatrical release on July 4th. As the release approaches, actress Varsha Bollamma opened up about the film’s highlights and her experience playing a key character.

"I had previously worked with SVC in Jaanu. When I was called in for Thammudu, I gave an audition and was selected immediately after a look test. Director Sriram Venu explained that parts of the movie would be shot in dense forests and asked me if that would be a problem. I saw it as a challenge and accepted it and that’s how I was cast in the role of Chitra."

"Chitra, my character, is the driving force in hero Nithiin’s journey as Jay. She unconditionally supports him, and their relationship is portrayed beautifully. For this role, I learned martial arts. I had always wanted to train in martial arts in real life, and this film gave me that opportunity. I thoroughly enjoyed learning it. Chitra is the kind of person who doesn’t hesitate to step forward and take action. I’m not like that in real life, so it was a unique experience for me."

"Thammudu is the perfect title for this story. We also feel happy that it shares its name with a previous blockbuster starring Pawan Kalyan. My role holds strong significance in the storyline. This is the most physically demanding film I’ve done since Bigil. Veteran actress Laya plays another key role. Her journey is truly inspiring - from a successful career as a heroine to taking a break for personal life and now making a comeback. She would often share her experiences with us on set."

"We could’ve shot the forest scenes in a studio with artificial sets, but we chose the real location of Maredumilli. It’s a dense forest - during the monsoon, we’d see snakes and scorpions. At night, we filmed scenes holding just torches for light. There were elders and children on set who also had to endure the tough conditions. Laya garu came all the way from the U.S. and shot scenes barefoot despite being used to comfort. Every day, someone would get injured, but everyone stayed enthusiastic. Luckily, my character had shoes.

"I’m very happy to be working with SVC once more. When I did Jaanu, I was new to the industry, but they treated me with great respect. They still do. Over the years, I’ve done multiple films as a heroine, and I don’t believe in drawing a line between lead roles and character roles. If people say ‘Varsha performed really well,’ that’s enough for me. When I heard the story of Thammudu, I felt it was fresh and challenging, which is why I took it up. Nithya Menon is a great example - she has a strong reputation as a performer. I hope to earn a name like that too."

"People usually assume Nithiin is a calm and quiet person, but he’s actually a lot of fun! Since we were shooting in the forest, there were no phones or distractions. We used to talk and joke around a lot. He respects everyone on set, regardless of seniority. I used to tease him with jokes constantly. I tend to express myself a lot through social media, and during scenes, I would sometimes improvise my lines spontaneously. But our director insisted on delivering the dialogues exactly as written, with no changes. That was a shift from my experience in Middle Class Melodies, where we were encouraged to improvise - but it suited that film."

"Thammudu centers around a brother-sister sentiment, but the film also explores many emotional layers. My character is involved in intense action sequences. The action in this film is absolutely mind-blowing. Some films are meant to be experienced only in theatres, Thammudu is one of them. It’s a complete visual treat, backed by powerful sound. Audiences will thoroughly enjoy watching it on the big screen."

"I’m currently acting in a web series titled Constable Kanakam, and there’s another series in the works. I’ve also signed two films - I’ll share details about them soon. One of my biggest dreams is to play a psycho killer. People might wonder why, but in crime thrillers, the most unpredictable characters often commit the most shocking crimes. If I get a chance to play such a role, I’d definitely take it."

"తమ్ముడు" మూవీలో మైండ్ బ్లోయింగ్ యాక్షన్, అమేజింగ్ విజువల్స్ ఎంజాయ్ చేస్తారు - హీరోయిన్ వర్ష బొల్లమ్మ

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. "తమ్ముడు" సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు చిత్ర క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరోయిన్ వర్ష బొల్లమ్మ.

నేను గతంలో ఎస్వీసీ సంస్థలో "జాను" అనే మూవీలో నటించాను. "తమ్ముడు" కోసం పిలవగానే వచ్చి ఆడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో వెంటనే ఓకే అయ్యాను. దర్శకుడు వేణు గారు ఈ మూవీ గురించి చెబుతూ అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నారు. నేను ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తాను అని చెప్పాను. అలా చిత్ర క్యారెక్టర్ కు నేను సెలెక్ట్ అయ్యాను.

హీరో నితిన్ క్యారెక్టర్ జై కు చిత్ర డ్రైవింగ్ ఫోర్స్ లా ఉంటుంది. జై కు అన్ కండిషనల్ గా సపోర్ట్ చేస్తుంది చిత్ర. వారి మధ్య ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. రియల్ లైఫ్ లో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉండేది. అది ఈ సినిమాతో కుదిరింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేశాను. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే అడుగువేసే క్యారెక్టర్ చిత్రది. నా రియల్ లైఫ్ లో నేను అలా కాదు.

తమ్ముడు మూవీ టైటిల్ ఈ కథకు యాప్ట్. పవన్ గారి ఒక సూపర్ హిట్ మూవీ ఈ టైటిల్ తో ఉండటం మేము హ్యాపీగా ఫీలయ్యే విషయం. నా క్యారెక్టర్ కు "తమ్ముడు" కథలో మంచి ప్రాధాన్యత ఉంటుంది. బిగిల్ మూవీ తర్వాత ఫిజికల్ గా శ్రమించిన చిత్రమిదే. ఈ చిత్రంలో లయ గారు మరో కీ రోల్ చేస్తున్నారు. ఆమె జర్నీ మా అందరికీ ఇన్సిపిరేషన్. హీరోయిన్ గా ఒక కెరీర్ చూసిన ఆమె పర్సనల్ లైఫ్ లోకి వెళ్లడం, మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆమె కెరీర్ లో జరిగిన విశేషాలు మాతో షేర్ చేసుకునే వారు.

"తమ్ముడు" మూవీని ఏదైనా స్టూడియోలో ఉన్న చిన్న అడవిలో కూడా షూట్ చేయొచ్చు కానీ సహజంగా ఉండేలా మారేడుమిల్లి అడవిలో చిత్రీకరించాం. అది దట్టమైన అడవి. వర్షాకాలంలో పాములు, తేళ్లు కనిపించేవి. రాత్రిపూట షూటింగ్ లో కేవలం కాగడాలు పట్టుకుని నటించాం. షూటింగ్ లో పెద్దవాళ్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా ఇబ్బందిపడ్డారు. లయగారు అమెరికా నుంచి వచ్చారు. అక్కడ సుకుమారంగా ఉండి ఈ అడవిలో చెప్పులు లేకుండా నటించారు. రోజూ ఏదో ఒక గాయం అయ్యేది. అయినా ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొనేవారు. నాకు నితిన్ క్యారెక్టర్స్ కు షూస్ ఉంటాయి.

ఎస్వీసీ సంస్థలో మరోసారి నటించడం హ్యాపీగా ఉంది. జాను మూవీ చేసినప్పుడు నేను కొత్త నటిని. అయినా నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలా గౌరవంగానే చూసుకున్నారు. నేను హీరోయిన్ గా పలు చిత్రాలు చేశా. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు... ఇలాంటి తేడాలు చూడాలని అనుకోవడం లేదు. వర్ష బాగా పర్ ఫార్మ్ చేసింది అనే పేరు తెచ్చుకుంటే చాలు. "తమ్ముడు" కథ విన్నప్పుడు ఇది కొత్తగా ఉంది ఛాలెంజింగ్ గా ఉంది అనిపించింది. అందుకే నటించాను. నిత్యామీనన్ ను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే తనకు పర్ ఫార్మర్ గా పేరుంది. నేనూ అలాగే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా.

హీరో నితిన్ చాలా కామ్ గా ఉంటారని ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ ఆయన చాలా ఫన్ పర్సన్. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్స్ అవీ ఏమీ లేవు. మేము సరదాగా మాట్లాడుకునేవాళ్లం. చిన్నా, పెద్దా ప్రతి ఆర్టిస్టుకు ఆయన గౌరవం ఇచ్చేవారు. నేను జోక్స్ చెప్పి ఆయనను విసిగించా. నాకు అనిపించింది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటా. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేసేప్పుడు అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే చెప్పాను. కానీ డైరెక్టర్ గారు డైలాగ్ లో ఉన్నది ఉన్నట్లు స్ట్రిక్ట్ గా చెప్పమనేవారు. నేను మిడిల్ క్లాస్ మెలొడీస్ చేసినప్పుడు స్పాంటేనియస్ గా చాలా ఇంప్రూవ్ చేసి డైలాగ్స్ చెప్పాం. ఆ మూవీకి అలా కుదిరింది.

"తమ్ముడు" మూవీ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. అయితే ఇందులో అనేక లేయర్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ కు సంబంధించి సాలిడ్ యాక్షన్ ఉంటుంది. మొత్తంగా మూవీలో యాక్షన్ సీక్వెన్సులు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లోనే ఎక్సిపీరియన్స్ చేయాలి. "తమ్ముడు" అలాంటి సినిమా. విజువల్ ట్రీట్ లా ఉంటుంది. మంచి సౌండింగ్ తో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

ప్రస్తుతం కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. దీంతో పాటు మరో సిరీస్ చేస్తున్నా. రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. వాటి డీటెయిల్స్ త్వరలో చెబుతా. సైకో కిల్లర్ క్యారెక్టర్ లో కనిపించాలనేది నా కోరిక. నేను సైకో కిల్లర్ ఏంటి అనుకుంటారు. కానీ మనం ఆ జానర్ మూవీస్ చూస్తే ఎవరూ ఊహించని పాత్రలే క్రైమ్స్ చేస్తుంటాయి. అలాంటి అవకాశం వస్తే నటిస్తా.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved