Yuva Samrat Naga Chaitanya’s latest sensation Thandel has made a remarkable impact at the box office, marking a noteworthy breakthrough as his first film to enter the 100 Cr club. Directed by Chandoo Mondeti and featuring Sai Pallavi in the female lead, Thandel is the biggest hit for Naga Chaitanya.
The film's opening was strong, despite its off-season release in February, with no major holidays to boost footfalls, except for Sundays. Additionally, piracy concerns loomed large when an HD version of the film was leaked on the very first day of its release. However, the film has managed to bounce back, with collections picking up again in the Telugu states, and it is now enjoying a resurgence in its second weekend.
Despite these hurdles, Thandel has crossed big milestones, including surpassing $1 million in overseas earnings and grossing 100 crore+ worldwide, even before its second weekend wraps up.
The film has not only performed well in the domestic market but has also been a profitable venture for distributors in the Telugu states, already crossing the breakeven point.
Naga Chaitanya has poured his heart and soul into this project, thoroughly preparing for the role. The success of Thandel has brought immense joy to Akkineni fans, who are elated to see their beloved actor achieve this monumental success.
BookMyShow is buzzing with excitement over the movie, as Sunday bookings are reaching impressive levels.
100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్ మైల్ స్టోన్ దాటిన నాగ చైతన్య తండేల్
యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ 'తండేల్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన అతని మొదటి చిత్రంగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించి, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన 'తండేల్' నాగ చైతన్యకు బిగ్గెస్ట్ హిట్.
ఫిబ్రవరిలో ఆఫ్-సీజన్ విడుదలైనప్పటికీ, ఆదివారాలు తప్ప, పెద్ద సెలవులు లేనప్పటికీ, ఈ చిత్రం ఫుట్ ఫాల్స్ అద్భుతంగా వున్నాయి. అలాగే ఈ చిత్రం HD వెర్షన్ విడుదలైన మొదటి రోజే లీక్ అయినప్పుడు పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్ లో చేరడం మామూలు విషయం కాదు.
తండేల్ ఇప్పుడు బిగ్ మైల్ స్టోన్ ని దాటింది, సెకండ్ వీక్ ముగియకముందే, ఓవర్సిసిస్ ఎర్నింగ్ లో $1 మిలియన్ దాటింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది.
ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ కు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్‌ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.
నాగ చైతన్య ఈ ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కష్టపడ్డారు, పాత్ర కోసం కంప్లీట్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. తండేల్ విజయం అక్కినేని అభిమానులకు గొప్ప ఆనందాన్ని తెచ్చిపెట్టింది, తమ అభిమాన హీరో ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం చూసి వారు సంతోషిస్తున్నారు.
నిర్మాత బన్నీవాసు ఈ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరుందని ముందే నమ్మకంగా చెప్పారు. చెప్పినట్లే సినిమా వందకోట్ల క్లబ్ లో చేరింది. మూవీ ప్రజెంటర్ అల్లు అరవింద్ మొదటి నుంచి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పారు. ఆ మాటని ఆడియన్స్ కూడా ప్రూవ్ చేశారు. గీతా ఆర్ట్స్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది తండేల్.
ఆదివారం అదిరిపోయే బుకింగ్స్ తో బుక్‌మైషో లో ట్రెండింగ్ లో వుంది తండేల్.