07 February 2025
Hyderabad
storm. Directed by Chandoo Mondeti and presented by mega producer Allu Aravind, the film was prestigiously produced by passionate filmmaker Bunny Vasu under the Geetha Arts banner. Released worldwide on February 7 with high expectations, Thandel has received an overwhelming response, turning into a blockbuster success. Audiences, fans, and critics alike have showered immense praise on the film, which continues to run to packed houses. In celebration of this success, the film’s team held a grand event.
Speaking at the success celebrations, Naga Chaitanya expressed his gratitude:
"A huge thank you to the Telugu audience! The immense positive response to the film has brought me so much happiness. I had been missing this feeling for a long time, and now, finally, it has returned. From the very first morning show, the super hit talk has only been growing stronger. I hope more families come to the theatres to watch the film because it carries many emotions that will connect deeply with them, especially women. If more families watch it, the film will gain even more appreciation. I must also thank Devi Sri Prasad. If I am receiving compliments for my performance, half of the credit goes to Devi for his incredible music.
I also want to express my gratitude to our Thandel, Aravind sir, as well as Vasu and Chandu. No matter how many times I say ‘thank you,’ it won’t be enough. They have all supported me tremendously. This success is the result of teamwork. Thank you to everyone! I urge everyone to go to theatres and enjoy Thandel."*
Producer Allu Aravind also expressed his heartfelt gratitude:
"Greetings to all! A big thank you to the audience for making Thandel a grand success. We had said earlier that this film has many surprises, and the best surprise is our hero. Naga Chaitanya has delivered a phenomenal performance. Another hero of our film is Devi Sri Prasad, whose music is extraordinary. Our Thandel is director Chandoo Mondeti, who has crafted this film brilliantly. Cinematographer Shamdat’s visuals have captivated the audience, while art director Nagendra has delivered stunning work.
Congratulations to Vasu as well! From today, it’s a festival for all of us. Thanks to everyone who supported this film. A special thanks to the media for taking Thandel to the next level."
Director Chandoo Mondeti shared his excitement:
"Greetings to everyone! While making the film, I had imagined the audience’s reactions for every scene in the theatres. Watching those exact reactions play out in real-time is a great feeling. Thandel started its journey here and is now soaring high. It’s a truly amazing experience."
Producer Bunny Vasu also thanked the audience:
"Greetings to all! A big thank you to everyone who supported our film. There are so many people behind this story, and we will soon hold an event to honor them. We understand the immense effort that went into making this film. I hope audiences continue to shower their love on Thandel."
Music director Devi Sri Prasad also shared his thoughts:
"A huge thank you to everyone! The response to Thandel has been phenomenal. Chaitanya delivered an outstanding performance, and his acting brought so much depth to the background score. From the moment I heard the story, I felt it had a magical essence, and Chandoo Mondeti brought that magic to life. Chaitanya’s transformation was incredible, and Sai Pallavi was exceptional as well.
I feel truly blessed to have composed the music for this film. Our ‘big Thandel’ Aravind uncle and my dear friend Vasu have been instrumental in this journey. This success is the result of pure teamwork. A huge thank you to the audience for making Thandel such a massive hit!"
'తండేల్’ ని సూపర్ హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ సో మచ్: సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో అక్కినేని నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్' హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది.
సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రేక్షకులకు థాంక్ యూ సో మచ్. సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా కాలంగా ఇది మిస్ అయ్యాను. ఫైనల్ గా మళ్ళీ నాకు తిరిగివచ్చింది. మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళుతోంది. ఇంకా ఫ్యామిలీస్ థియేటర్స్ కి రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ కి నచ్చే ఎన్నో ఎమోషన్స్ వున్నాయి. వాళ్ళంతా వస్తే సినిమాకి ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. దేవిశ్రీ కి థాంక్ యూ చెప్పాలి. నా పెర్ఫార్మెన్స్ కి కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే సగం క్రెడిట్ దేవికి ఇవ్వాలి. మా ‘తండేల్’ అరవింద్ గారు. ఆయనకి, వాసుకి, చందుకి ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇదంతా టీం వర్క్. అందరికీ థాంక్ యూ. అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమాని ఎంజాయ్ చేయండి' అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘తండేల్’ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని ముందే చెప్పాం. ఇందులో బెస్ట్ సర్ ప్రైజ్ మా హీరో. దుల్లగొట్టేశాడు. మాకు ఇంకో హీరో దేవిశ్రీ ప్రసాద్. తన మ్యూజిక్ అదిరిపోయింది. మా అందరికీ ‘తండేల్’ డైరెక్టర్ చందూ.శ్యాం దత్ గారి విజువల్స్ ఆడియన్స్ ని హత్తుకున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇచ్చారు. కంగ్రాట్స్ వాసు. ఈ రోజు నుంచి పండగ మొదలౌతుంది. సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యూ. సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్ళిన మీడియాకి ధన్యవాదాలు' అన్నారు.
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. సినిమా చేస్తున్నప్పుడు ప్రతి సీన్ కి థియేటర్ లో ఎలాంటి రియాక్షన్ ఉంటుందని అనుకున్నానో యాజ్ టీజ్ గా అదే రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆనందంగా వుంది. సినిమా ఇక్కడ నుంచి మొదలైయింది. అద్భుతంగా ముందుకు వెళుతుంది' అన్నారు.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యూ. ఈ కథ వెనుక చాలా మంది వున్నారు. వారందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం పెడతాం. వారి కష్టం మాకు తెలుసు. ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చై అద్భుతంగా పెర్ఫామ్ చేశారు, ఆయన నటన వలనే ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కథ విన్నప్పుడే మ్యాజికల్ గా అనిపించింది. చందు గారు అంతే అద్భుతంగా తీశారు. చై ట్రాన్స్ ఫర్మేషన్ మ్యాజికల్ గా వుంది. సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా వుంది. మా పెద్ద ‘తండేల్’ అరవింద్ అంకుల్. వాసు మై డియర్ ఫ్రెండ్. ఇదంతా టీం వర్క్. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ సో మచ్' అన్నారు
|