pizza

"Happy that 'Thangalaan' has achieved the highest opening in Chiyaan Vikram's career" - Producer KE Gnanavel Raja
హీరో చియాన్ విక్రమ్ కెరీర్ లో "తంగలాన్" హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం సంతోషంగా ఉంది - నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా

You are at idlebrain.com > news today >

16 August 2024
Hyderabad

Chiyaan Vikram's period action film Thangalaan hit theaters on the 15th of this month and has received a blockbuster response. Produced by Pa Ranjith and famous producer KE Gnanavel Raja under the banner of Studio Green Films in association with Neelam Productions, the film features Parvathy Thiruvothu and Malavika Mohanan as the lead actresses. Producer KE Gnanavel Raja expressed his delight at the overwhelming response to Thangalaan. He emphasized that the film has reinforced the belief that audiences appreciate a well-made movie. In a recent interview, KE Gnanavel Raja discussed the success of Thangalaan.

- Thangalaan is seeing excellent openings, particularly in Telugu, where the response has exceeded our expectations. The collections are double what we anticipated, and we are amazed by the results. Both A, B, and C centers are performing well. These are the highest openings in Chiyaan Vikram's career. We hope to reach a total of 200 crore rupees. To connect more with the audience, the team is planning a theatrical visit. Vikram is also actively promoting the film in Telugu, including visits to Vijayawada and Hyderabad. Alongside Thangalaan, Demonte Colony 2 was released in Tamil, and it is also performing well.

- I wish success for all films released on the 15th alongside us in Telugu. Theaters are increasing for Thangalaan, with screens being added in various locations. Although three major films were released in Hindi, Thangalaan will be released in all other languages on the 30th.

- Both Buddy and Thangalaan are distinct films from our company. As a producer, I always trust the director and the script. I have confidence in Pa Ranjith’s filmmaking skills. I had long dreamed of working with Chiyaan Vikram, and I was thrilled when he agreed to star in Thangalaan. After the film's success, I sent a bouquet to Vikram's house, and he called to discuss the collections.

- Our first period film, Paruthiveeran, was made under Studio Green. Making a movie like Thangalaan is a significant undertaking that takes years of effort. For Thangalaan, Pa Ranjith handled the script entirely on his own, and Chiyaan Vikram focused solely on his performance.

- My set experience was minimal until Thangalaan. Out of 108 shooting days, I only visited the set four times and spent two hours there. We gave Pa Ranjith and his team full freedom, trusting their vision.

- We believe that some force guides us—whether it's faith in God or karma. If we do something wrong, we feel that consequences will follow. Director Pa Ranjith created Malavika Mohanan's Aarti character based on this concept. My approach to filmmaking is to trust the audience’s taste.

- The budgets for films like Kanguva and Thangalaan are hard to predict precisely due to their unique nature. Unlike other projects where budgets can be estimated, these films require flexibility. The final product will determine the necessary investment.

- In Thangalaan, Chiyaan Vikram, Parvathy, Malavika, and Pashupati delivered performances so natural that they truly embodied their characters. Many actors were injured during shooting, but we accommodated their needs and rescheduled accordingly.

- The trailer for Kanguva is receiving a tremendous response, and a new trailer will be released before the film's debut. Today, more grounded movies are gaining popularity. For instance, Kantara became a pan-India hit despite its unfamiliarity. Similarly, Rangasthalam and Pushpa were unexpected successes, influencing trends. Our company also produces commercial films and will continue to do so if we secure projects with star heroes in Telugu.

- Speaking the truth can sometimes lead to controversy. I share my honest thoughts and am pleased that Ponniyin Selvan received National Awards. Congratulations to all the winners.

హీరో చియాన్ విక్రమ్ కెరీర్ లో "తంగలాన్" హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం సంతోషంగా ఉంది - నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్" ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల నుంచీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. "తంగలాన్" సినిమాకు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని "తంగలాన్" నిలబెట్టిందని ఆయన అన్నారు. తాజా ఇంటర్వ్యూలో "తంగలాన్" సినిమా సక్సెస్ గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు.

- "తంగలాన్" సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. మేము ఇంత భారీ ఓపెనింగ్స్ తెలుగులో ఎక్స్ పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ తో మేము ఆశ్చర్యపోతున్నాం. ఏ, బీ, సీ సెంటర్స్ అన్నింటా మంచి వసూళ్లు వస్తున్నాయి. చియాన్ విక్రమ్ గారి కెరీర్ లో ఇవే హయ్యెస్ట్ ఓపెనింగ్స్. 200 కోట్ల రూపాయల వరకు రాబడుతుందని ఆశిస్తున్నాం. అందుకే టీమ్ థియేట్రికల్ విజిట్ కు వెళ్తున్నారు. ఆడియెన్స్ కు తంగలాన్ ను మరింత చేరువచేయాలని ప్రయత్నిస్తున్నాం. విక్రమ్ గారు కూడా తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ కూడా వెళ్లారు. తమిళంలో తంగలాన్ తో పాటు డీమాంటీ కాలనీ 2 కూడా రిలీజైంది. తంగలాన్ కు బిగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. డీమాంటీ కాలనీ 2 కూడా బాగానే ఆడుతోంది.

- తెలుగులో మాతో పాటు 15న రిలీజైన అన్ని సినిమాలూ బాగా ఆడాలని కోరుకున్నాను. ఇప్పుడూ అదే మాట చెబుతున్నా. తంగలాన్ కు థియేటర్స్ పెరుగుతున్నాయి. అన్ని ఏరియాల్లో స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారు. హిందీలో మూడు బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అందుకే అక్కడ రిలీజ్ 30వ తేదీన చేస్తున్నాం. మిగతా అన్ని భాషల్లోనూ 30న తంగలాన్ రిలీజ్ కు రాబోతోంది.

- మా సంస్థ నుంచి బడ్డీ, తంగలాన్ రెండూ భిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిర్మాతగా నేనెప్పుడూ దర్శకుడినే నమ్ముతాను. ఆ తర్వాత స్క్రిప్ట్. పా రంజిత్ గారు ఎంత బాగా మూవీ చేయగలరో నాకు తెలుసు. నాకు చియాన్ విక్రమ్ గారితో మూవీ చేయాలనే డ్రీమ్ ఉండేది. విక్రమ్ గారు తంగలాన్ చేసేందుకు ముందుకు రావడం ఇంకా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ సక్సెస్ తర్వాత విక్రమ్ గారి ఇంటికి బొకే పంపాను. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కనుక్కున్నారు.

- మా స్టూడియో గ్రీన్ సంస్థలో చేసిన మొదటి సినిమా పరుత్తి వీరన్ పీరియాడిక్ మూవీ. ఇలాంటి ప్రయత్నాలు మేము గతంలోనే చేశాం. అయితే తంగలాన్ లాంటి మూవీ చేయాలంటే కనీసం పదీ పదిహేనేళ్ల టైమ్ పడుతుంది. తంగలాన్ స్క్రిప్ట్ విషయంలో పా రంజిత్ గారు తప్ప మిగతా ఎవరూ ఇన్వాల్వ్ కాలేదు. చియాన్ విక్రమ్ గారు తన యాక్టింగ్ మీద మాత్రమే ఫోకస్ చేశారు.

- తంగలాన్ వరకు నాకు సెట్ ఎక్స్ పీరియన్స్ చాలా తక్కువ. మొత్తం 108 రోజుల షూటింగ్ జరిగితే నేను కేవలం 4 రోజులు వెళ్లాను. 2 గంటల చొప్పున సెట్ లో గడిపాను. పా రంజిత్ గారి మీద నమ్మకంతోనే ఆయన, ఆయన టీమ్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం.

- మనల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని మనమంతా నమ్ముతాం. కొందరు దేవుడిని విశ్వసిస్తారు. మరికొందరు కర్మను నమ్ముతారు. మనం తప్పు చేస్తే ఏదో చెడు జరుగుతుందనే ఫీల్ కలుగుతుంటుంది. నేచర్ కూడా అలాగే తప్పు చేస్తే నేచర్ కూడా శిక్షిస్తుంది. మాళవిక మోహనన్ ఆరతి క్యారెక్టర్ ఆ భావనతో క్రియేట్ చేశారు దర్శకుడు పా.రంజిత్. సినిమాల మేకింగ్ విషయంలో నా నమ్మకం ఏంటంటే ప్రేక్షకుల అభిరుచిని విశ్వసించడమే.

- కంగువ, తంగలాన్ సినిమాలను బడ్జెట్ పరంగా ఖచ్చితంగా ప్లాన్ చేయలేం. ఇవి రెండూ డిఫరెంట్ మూవీస్. వీటిని ఇలా స్టార్ట్ చేసి ఆ టైమ్ కు ముగించుదాం అని కన్ఫర్మ్ గా చెప్పలేం. మిగతా సినిమాలకు కాస్త బడ్జెట్ అటూ ఇటూగా అంచనా వేయొచ్చు. కానీ కంగువ, తంగలాన్ కు అలా చేయలేం. సినిమాకు కావాల్సింది ఇవ్వాల్సిందే.

- తంగలాన్ లో చియాన్ విక్రమ్ గారితో పాటు పార్వతీ, మాళవిక, పశుపతి..ఇంకా ప్రతి ఒక్కరి పాత్రల నటనకు ప్రశంసలు వస్తున్నాయి. వారు ఆ పాత్రలుగా మారిపోయారు. బయట చూస్తే మీరు వారిని గుర్తుపట్టలేరు. అంత సహజంగా పర్ ఫార్మ్ చేశారు. షూటింగ్ టైమ్ లో చాలా మందికి గాయాలు అయ్యాయి. వారికి టైమ్ ఇచ్చి మళ్లీ షెడ్యూల్ చేసుకుంటూ వచ్చాం.

- కంగువ ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మరో కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ ముందు విడుదల చేస్తాం. ఆ ట్రైలర్ కంప్లీట్ గా ఫ్రెష్ కట్ తో ఉంటుంది. ఇవాళ మోర్ రూటెడ్ మూవీస్ ఆదరణ పొందుతున్నాయి. కాంతార కన్నడ వారికి కూడా పెద్దగా పరిచయం లేని కథే. అలాంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందింది. తెలుగులో రంగస్థలం లాంటి సినిమాను అంతకముందు ఊహించలేం. హీరోకు ఫిజికల్ ప్రాబ్లమ్ ఉందంటే మన వాళ్లు గతంలో ఊహించలేకపోయేవారు. పుష్ప కూడా అంతే. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ ట్రెండ్ అయ్యింది. మా సంస్థలో పక్కా కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాం. తెలుగులో స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ కుదిరితే అలాంటి మూవీ నిర్మిస్తాం.

- ఏదైనా నిజం మాట్లాడితే అది కాంట్రవర్సీ అవుతుంటుంది. నేను మనసులో ఉన్నది చెబుతుంటా. నేషనల్ అవార్డ్స్ లో పొన్నియన్ సెల్వన్ కు అవార్డ్ లు రావడం సంతోషంగా ఉంది. అలాగే మిగతా విన్నర్స్ కు కూడా కంగ్రాట్స్ చెబుతున్నాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved