pizza

“I already said that 'Thangalaan' will be loved by the Telugu audience. We will soon make a sequel, 'Thangalaan 2,'” said Hero Chiyaan Vikram at the success meet.
"తంగలాన్"ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని ముందే చెప్పాను, త్వరలోనే సీక్వెల్ "తంగలాన్ 2" చేస్తాం - సక్సెస్ మీట్ లో హీరో చియాన్ విక్రమ్

You are at idlebrain.com > news today >

17 August 2024
Hyderabad

The period action movie Thangalaan, starring Chiyaan Vikram, hit theaters on August 15th and has achieved blockbuster success. Produced by director Pa Ranjith and renowned producer KE Gnanavel Raja under the banner of Studio Green Films in association with Neelam Productions, the film features Parvathy Thiruvothu and Malavika Mohanan as the lead actresses. The success meet for Thangalaan was organized in Hyderabad. During the event:

Lyricist Bhaskarabhatla Ravikumar said, “I felt that if I hadn't written a song for Thangalaan, I would have missed out on something significant. Pa Ranjith is a powerful voice for the weaker sections, and Chiyaan Vikram is an exceptional actor who can adapt to any role. It was a pleasure to write a song for such a great film alongside a talented team like GV Prakash Kumar.”

Producer Dhanunjayan commented, “Thangalaan has achieved great success with the Telugu audience. The collections have exceeded our expectations. Thanks to your support, we organized a successful meet in Telugu before Chennai. The entire team worked hard to make Thangalaan, and we appreciate the Telugu audience and media for their support.”

Producer Madhura Sreedhar Reddy said, “Watching Thangalaan moved me deeply. Pa Ranjith made a tremendous effort, depicting the struggle of previous generations for freedom. It takes immense courage for a producer to back a film like this, and I admire my brother Gnanavel Raja's bravery. The collections are very good, and even with Varalakshmi Vrat today, the matinee shows are packed. Thangalaan has been well received, and we plan to promote the film until the 28th of this month to reach even more viewers. Thanks for the support, Vikram garu.”

Writer Rakendu Mouli stated, “Thangalaan was released amidst strong competition, but it has proven that a good film will always be appreciated by the audience. We are pleased that our pre-release promises about the film’s impact have come true.”

Music director GV Prakash Kumar said, “Thank you to all the Telugu audience for supporting Thangalaan. You’ve made it feel like your own story and contributed to its success. Thanks to director Pa Ranjith and producer Gnanavel for giving me the opportunity to compose music for such a great film. I appreciate my entire music team. Watch Thangalaan in theaters—we will also be watching it with you.”

Heroine Malavika Mohanan said: “The Telugu audience has given Thangalaan great success. My friends here speak highly of our film. Such success is possible because of our amazing team. I want to thank Mr. Ranjith, Gnanavel, and Vikram. I am thrilled to have had the chance to portray Aarti in this movie. Appreciation is also coming in for GV Prakash Kumar's music. When I saw the movie in the theater, I realized how much his music elevated our characters. Thanks to my personal team for the makeover I received for the role of Aarti. Regarding my role in Prabhas' movie Raja Saab, it seems that success has followed me there as well.”

Producer KE Gnanavel Raja said: “Media friends have once again proven that they always support good movies like Thangalaan. The Telugu audience has given our film, released amidst strong competition, significant success. I want to thank them for their support, even after the release of Telugu straight movies. All our distributors have been very supportive in securing theaters for our film, and more screens are being added. My friend Mathura Sridhar handled all the pressure, and he is very happy with the film's openings. Dhanunjayan garu has also worked hard for the film. Although I did not visit the sets often, the making videos showed me how hard Vikram worked on this film, which greatly increased my respect for him. Directors fill the pen with ink and write stories, but our director Pa Ranjith writes stories filled with passion. He never compromises on filmmaking. Thanks to Pa Ranjith for giving us an epic movie. GV Prakash Kumar truly made the film his own with his music. I hope he receives National and Oscar Awards. Every artist, whether big or small, worked hard on this film. Thanks to all of them.”

Director Pa. Ranjith said: “Thangalaan is being well received by the Telugu audience. I’ve read the reviews and listened to the feedback, and everyone is very pleased. Thangalaan has sparked a lot of discussion. Before the film began, I heard rumors about Vikram, but when he arrived on the first day of shooting and transformed into the character, I realized that all the rumors were completely false. Chiyaan Vikram is a great actor. He performs as directed, and his acting made me feel a greater responsibility to create a better film. Malavika performed exceptionally well as Aarti, and her energy enhanced the character. Every artist gave their all. I cannot express enough gratitude for the support from my friend Gnanavel Raja, who has a deep passion for filmmaking. That’s why Thangalaan was released as expected despite the pressures. GV Prakash Kumar's music has become a cornerstone of our film’s success. Thanks to all my writers and the rest of the team.”

Hero Chiyaan Vikram said: “Producer Madhura Sreedhar, writers Rakendu Mouli, Bhaskarabhatla, and everyone—your heartfelt praise for Thangalaan mirrors the affection you have for your own films. Your deep appreciation for the movie is evident in how passionately you speak about it. I also want to thank RCM Raju for dubbing my character. Watching your response videos makes me want to see the film again and again. I’m so happy. I told Pa Ranjith and Gnanavel before the release of Thangalaan that it would be well received by the Telugu audience because it tells the story of ordinary people. Content-driven films like this are sure to resonate with the Telugu audience. When I made Sivaputrudu, there were doubts about its appeal in Telugu, but it turned out to be a big hit. As I anticipated, Thangalaan is loved across both Telugu states. I’m grateful to director Pa Ranjith for creating such a special movie with me. Pa Ranjith had immense faith in me, which made this film possible. We all believe that Thangalaan deserves a sequel, and we plan to make many more. Thangalaan has been a huge hit for producer Gnanavel, and I’m confident that his next film, Kanguva, will break records. I hope his other upcoming projects also achieve great success. During my promotional tour in the Telugu states, the audience mentioned they had seen all my films, including those released on OTT platforms, which was very gratifying. Malavika delivered a remarkable performance as Aarti. GV Prakash Kumar’s contributions to the film have been exceptional, and his music has been widely praised. It’s been an amazing journey for him as a hero, producer, and music director. I heard two pieces of great news today: Thangalaan is doing well at the box office, and Ponniyin Selvan has won four national awards. These two achievements bring me immense joy.”

"తంగలాన్"ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని ముందే చెప్పాను, త్వరలోనే సీక్వెల్ "తంగలాన్ 2" చేస్తాం - సక్సెస్ మీట్ లో హీరో చియాన్ విక్రమ్

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్" ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. "తంగలాన్" సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

లిరిక్ రైటర్ భాస్కరభట్ల రవికుమార్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాలో మనకి మనకి పాట రాయకుంటే ఎంతో మిస్ అయ్యేవాడిని అనిపించింది. బలహీన వర్గాలకు బలమైన గొంతు పా రంజిత్. ఏ పాత్రలోకైనా మారిపోయే గొప్ప నటుడు చియాన్ విక్రమ్. తారాజువ్వ లాంటి సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. ఇలాంటి వారితో "తంగలాన్" లాంటి గొప్ప సినిమాకు పాట రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

ప్రొడ్యూసర్ ధనుంజయన్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. మీ ఆదరణ వల్లే చెన్నై కంటే ముందు తెలుగులో సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. ఎంతో హార్డ్ వర్క్ చేసి టీమ్ అంతా "తంగలాన్" సినిమాను రూపొందించారు. మా టీమ్ కు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్ కు, సపోర్ట్ చేసిన మీడియా వారికీ థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - "తంగలాన్" సినిమా చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో భావోద్వేగానికి గురయ్యాను. పా రంజిత్ గారు ఒక గొప్ప ప్రయత్నం చేశారు. మన ముందు తరాలు స్వేచ్ఛ కోసం ఎంత పోరాటం చేశాయో ఆయన ఈ కథలో చూపించారు. ఇలాంటి సినిమా నిర్మించాలంటే నిర్మాతకు ఎంతో ధైర్యం ఉండాలి. నా సోదరుడు జ్ఞానవేల్ రాజా ఎంత ధైర్యం చేశాడో ఒక నిర్మాతగా ఊహించగలను. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈరోజు వరలక్ష్మీ వ్రతం అయినా మ్యాట్నీ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ప్రేక్షకులు "తంగలాన్"ను బాగా ఆదరిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు బాగా ప్రమోట్ చేసి మూవీని మరింతగా ప్రేక్షకులకు రీచ్ చేయాలని అనుకుంటున్నాం. విక్రమ్ గారు ఇస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. అన్నారు.

రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ - "తంగలాన్" సినిమా మంచి కాంపిటేషన్ లో రిలీజైంది. అయినా మంచి సినిమా ఎప్పుడు రిలీజైన ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ చేసింది. ఈ సినిమా మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుందని రిలీజ్ ముందే మేము చెప్పిన మాటలు ఇవాళ నిజం కావడం సంతోషంగా ఉంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. ఇది మీ కథగా మీరు భావించారు కాబట్టే విజయాన్ని అందించారు. ఇలాంటి మంచి సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పా రంజిత్, ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. "తంగలాన్" మూవీని థియేటర్స్ లో చూడండి. మేము కూడా మీతో కలిసి థియేటర్ లో సినిమా చూడబోతున్నాం. అన్నారు.

హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాకు తెలుగు ఆడియెన్స్ బిగ్ సక్సెస్ ఇచ్చారు. ఇక్కడున్న నా ఫ్రెండ్స్ మా సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. మా అమేజింగ్ టీమ్ వల్లే ఇంత ఘన విజయం సాధ్యమైంది. పా రంజిత్ గారు, జ్ఞానవేల్ గారు, విక్రమ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో ఆరతి పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కు ప్రశంసలు వస్తున్నాయి. ఆయన మ్యూజిక్ వల్ల మా పాత్రలు ఎంతగా ఎలివేట్ అయ్యాయో నేను థియేటర్ లో సినిమా చూసినప్పుడు అర్థమైంది. ఆరతి పాత్రకు నన్ను బాగా మేకోవర్ చేసిన నా పర్సనల్ టీమ్ కు థ్యాంక్స్. నేను ప్రభాస్ గారి రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నా. ఈ సక్సెస్ లో ఆయన లక్ కూడా కలిసొచ్చిందని అనిపిస్తోంది. అన్నారు.

నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - "తంగలాన్" వంటి మంచి సినిమాకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మీడియా మిత్రులు మరోసారి ప్రూవ్ చేశారు. ఎంతో కాంపిటేషన్ లో రిలీజైన మా సినిమాకు మంచి సక్సెస్ అందించారు తెలుగు ప్రేక్షకులు. తెలుగు స్ట్రైట్ సినిమాలు రిలీజైనా మా మూవీని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. మా మూవీకి నెంబరాఫ్ థియేటర్స్ ఇప్పించడంలో మా డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. మరిన్ని స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. నా ప్రెజర్ అంతా నా ఫ్రెండ్ మధుర శ్రీధర్ తీసుకున్నారు. ఆయన మూవీకి వస్తున్న ఓపెనింగ్స్ తో ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. అలాగే మా ధనుంజయన్ గారు సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేను ఈ సినిమా సెట్ కు ఎక్కువగా వెళ్లలేదు. కానీ మేకింగ్ వీడియోస్ నాకు పంపినప్పుడు విక్రమ్ గారు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమైంది. ఆయన మీద నాకున్న గౌరవం వంద రెట్లు పెరిగింది. దర్శకులు పెన్ లో ఇంక్ నింపి కథ రాస్తారు. మా దర్శకుడు పా రంజిత్ రక్తాన్ని నింపి కథ రాస్తారు. సినిమా మేకింగ్ లో ఆయన రాజీ పడరు. మాకు ఒక ఎపిక్ మూవీని ఇచ్చిన పా రంజిత్ బ్రదర్ కు థ్యాంక్స్. జీవీ ప్రకాష్ కుమార్ సినిమాను ఓన్ చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు జాతీయ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నా. మాళవిక, పార్వతీ, పశుపతి, డేనియల్..ఇలా పెద్దా చిన్నా ప్రతి ఆర్టిస్టు సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మీ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను రివ్యూస్ చదివాను, మా మూవీ గురించి మాట్లాడిన వారి మాటలు విన్నాను. అవన్నీ ఎంతో సంతోషాన్నిస్తున్నాయి. "తంగలాన్" ఒక డిస్కషన్ మొదలయ్యేలా చేసింది. సినిమా బిగినింగ్ ముందు విక్రమ్ గారి గురించి ఏవో రూమర్స్ నాకు చెప్పేవారు. కానీ ఆయన ఫస్ట్ డే షూట్ లోకి వచ్చినప్పుడు క్యారెక్టర్ కు కావాల్సినట్లు మారినప్పుడు నాకు చెప్పిన రూమర్స్ అన్నీ పూర్తిగా అబద్ధాలను తెలిసింది. చియాన్ విక్రమ్ గొప్ప నటుడు. దర్శకుడు కోరుకున్నట్లు నటిస్తాడు. ఆయన నటిస్తున్నప్పుడు మరింత బాగా మూవీ చేయాలనే బాధ్యత ఒత్తిడి దర్శకుడిగా నాపై పెరిగాయి. మాళవిక ఆరతి పాత్రలో ఎంతో బాగా నటించింది. ఆమె ఎనర్జీ ఆరతి పాత్రను మరింత అందంగా తయారు చేసింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మనసు పెట్టి నటించారు. నా స్నేహితుడు జ్ఞానవేల్ రాజా మాకు అందించిన సపోర్ట్ ను మాటల్లో చెప్పలేను. ఆయనకు మూవీ మేకింగ్ పట్ల ప్యాషన్ ఉంది. అందుకే తంగలాన్ లాంటి బిగ్ మూవీని ఎంతో ప్రెషర్ తీసుకుని అనుకున్నట్లుగా రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మా సినిమాకు బలంగా మారింది. నా రైటర్స్, ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ - ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు, రైటర్స్ రాకేందు మౌళి, భాస్కరభట్ల గారు..మీరంతా మీ సొంత సినిమా గురించి మాట్లాడినంత ప్రేమగా "తంగలాన్" గురించి మాట్లాడారు. మీరు సినిమాను అంతగా ప్రేమించారు కాబట్టే అలా హార్ట్ ఫుల్ గా మాట్లాడగలిగారు. నా పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆర్సీఎం రాజు గారికి థ్యాంక్స్. సినిమాకు మీరు ఇస్తున్న రెస్పాన్స్ వీడియోలు చూస్తున్నప్పుడు మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తున్నాయి. అంత సంతోషాన్ని కలిగిస్తున్నాయి. "తంగలాన్" రిలీజ్ కు ముందే నేను పా రంజిత్, జ్ఞానవేల్ గారికి చెప్పాను. ఇది తెలుగు ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకునే సినిమా అవుతుందని ఎందుకంటే ఇది మట్టి మనుషుల కథ. ఇలాంటి కంటెంట్ డ్రివెన్ మూవీస్ ను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. నేను శివపుత్రుడు చేసినప్పుడు ఈ సినిమా తెలుగులో ఆదరణ పొందుతుందా అని సందేహం వెలిబుచ్చారు కానీ తెలుగులో శివపుత్రుడు ఘన విజయాన్ని అందుకుంది. నేను చెప్పినట్లే "తంగలాన్"కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతంలో ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. నాతో ఇలాంటి స్పెషల్ మూవీ చేసినందుకు దర్శకుడు పా రంజిత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. పా రంజిత్ కు నాపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన నమ్మకం వల్లే నేను తంగలాన్ చేయగలిగాను. తంగలాన్ కు పార్ 2 చేయాలని నేను పా రంజిత్, జ్ఞానవేల్ గారు అనుకున్నాం. తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది. ఒక్కటి కాదు వంద సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ కు తంగలాన్ పెద్ద హిట్ ఇచ్చింది. నెక్ట్ వచ్చే కంగువ రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీ అవుతుంది. ఆయన మరో సినిమా కూడా రాబోతోంది. అది కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. నేను తెలుగు స్టేట్స్ లో ప్రమోషన్ కు వెళ్లినప్పుడు నా సినిమాలన్నీ చూశామని ఆడియెన్స్ చెప్పారు. ఓటీటీలో రిలీజైన నా సినిమాల గురించి కూడా వారు చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మాళవిక ఆరతి పాత్రలో చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ మా సినిమాకు వస్తున్న ప్రతి ప్రశంసలో ఉన్నారు. ఆయన హీరోగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఫెంటాస్టిక్ జర్నీ చేస్తున్నారు. తంగలాన్ కు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ రోజు రెండు గొప్ప వార్తలు విన్నాను ఒకటి తంగలాన్ కు వస్తున్న మంచి కలెక్షన్స్, రెండవది పొన్నియన్ సెల్వన్ కు నాలుగు జాతీయ అవార్డ్స్ వచ్చాయని. ఈ రెండు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved