pizza

Thangalaan is a Good Movie with All Emotions - Hero Chiyaan Vikram
"తంగలాన్" అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక గుడ్ మూవీ - హీరో చియాన్ విక్రమ్

You are at idlebrain.com > news today >

12 August 2024
Hyderabad

"Thangalaan" is a period action film starring Chiyan Vikram. Directed by Pa Ranjith, the movie is produced by prominent producer KE Gnanavel Raja under the Studio Green Films banner, in association with Neelam Productions. Parvathy Thiruvothu and Malavika Mohanan play the lead roles. Set against the backdrop of the Kolar Gold Fields, "Thangalaan" is based on real events. The film is scheduled for a grand worldwide theatrical release on August 15, coinciding with Independence Day. Mythri Movie Distribution will handle the Telugu release. A press meet for "Thangalaan" was held today in Vijayawada. At the event,

Hero Vikram said: "We are delighted to be in Vijayawada for the promotion of 'Thangalaan.' The food at Babai Hotel is excellent, and we enjoyed our visit to VVIT College, where the students' enthusiasm was a pleasant surprise. I am aware of the Telugu audience's support for good films. My movie 'Aparichitudu' had the longest run in Vijayawada. Thank you all. 'Thangalaan' is a beautiful adventure film, and Director Ranjith has crafted it beautifully. I am eager to see your response after watching it. I collaborated with my favorite director Pa Ranjith on this movie, which is filled with emotions to engage the audience. 'Thangalaan' will transport you to a new world. Watch it in theaters on August 15."

Hollywood actor Daniel said: "I play an important role in 'Thangalaan,' portraying a character with shades of gray. I am thrilled to act alongside Vikram and work with the amazing director Pa Ranjith. I am grateful to producer Gnanavel Raja for including me in this film. Please watch it in theaters."

Heroine Malavika Mohanan said: "I am happy to be in Vijayawada for the promotion of 'Thangalaan.' The food tasting at Babai Hotel was excellent. Thank you all for your support of our movie team. I portray the character of 'Aarti' in 'Thangalan,' which is the best role of my career. I worked very hard on this role and am excited to be part of such a great movie."

Producer Dhanunjayan said: "The teaser and trailer of 'Thangalaan' that you have seen so far are just glimpses of what the film has to offer. The movie is filled with captivating content, and Chiyan Vikram’s performance will impress you. His dedication to the role is remarkable. 'Thangalaan' will be a memorable film for both our team and the audience. I hope you will enjoy it in theaters."

Cast:
- Chiyaan Vikram
- Malavika Mohanan
- Parvathy Thiruvothu
- Pashupathi
- Harikrishnan
- Anbu Durai

Technical Team:
- Music: GV Prakash Kumar
- Art: SS Murthy
- Editing: RK Selva
- Stunts: Stunner Sam
- Banners: Studio Green, Neelam Productions
- Producer: KE Gnanavel Raja
- Directed by: Pa Ranjith

"తంగలాన్" అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక గుడ్ మూవీ - హీరో చియాన్ విక్రమ్

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. ఈ రోజు విజయవాడలో "తంగలాన్" చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో విక్రమ్‌ మాట్లాడుతూ - మా "తంగలాన్" మూవీ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం హ్యాపీగా ఉంది. బాబాయ్ హోటల్ లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. వీవీఐటీ కాలేజ్ విజిట్ చేశాం. అక్కడ స్టూడెంట్స్ ఎనర్జీ సర్ ప్రైజ్ చేసింది. తెలుగు ఆడియెన్స్ మంచి సినిమాకు ఎంతగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. నా 'అపరిచితుడు' సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడింది. మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఇదొక బ్యూటిఫుల్‌ అడ్వెంచరస్‌ మూవీ. డైరెక్టర్‌ రంజిత్‌ ఈ సినిమాను అందంగా రూపొందించాడు. తంగలాన్‌ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసి మీ రెస్పాన్స్ ఇస్తారా అని వెయిట్‌ చేస్తున్నాను. నా ఫేవరేట్ డైరెక్టర్ పా రంజిత్ గారితో ఈ మూవీ చేశాను. ప్రేక్షకులందరికీ నచ్చేలా అన్ని ఎమోషన్స్ తో రంజిత్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక కొత్త వరల్డ్ లోకి మిమ్మల్ని "తంగలాన్" సినిమా తీసుకెళ్తుంది. ఆగస్టు 15న తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.

హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ మాట్లాడుతూ - 'తంగలాన్‌' మూవీలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ నాది. ఈ చిత్రంలో విక్రమ్‌ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. పా రంజిత్‌ అమేజింగ్ డైరెక్టర్. నన్ను ఈ మూవీలోకి తీసుకొచ్చిన నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకు థ్యాంక్స్‌. థియేటర్స్ లో తప్పుకుండా చూడండి. అన్నారు.

హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ - 'తంగలాన్‌' ప్రమోషన్ కోసం విజయవాడ రావడం సంతోషంగా ఉంది. బ్యూటిఫుల్ ఫ్లేస్ ఇది. ఇక్కడ బాబాయ్ హోటల్ లో ఫుడ్ టేస్ట్ చేశాం. చాలా బాగుంది. మీ అందరు మా మూవీ టీమ్ పై చూపిస్తున్న లవ్ కు థ్యాంక్స్. 'తంగలాన్‌' లో 'ఆరతి' అనే క్యారెక్టర్‌ చేశాను. నా కెరీర్ లో చేసిన ది బెస్ట్ రోల్ ఇది. ఈ పాత్రలో నటించేందుకు చాలా కష్టపడ్డాను. ఇలాంటి ఒక గొప్ప మూవీలో నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.

నిర్మాత ధనుంజయన్‌ మాట్లాడుతూ 'తంగలాన్‌' సినిమా నుంచి మీరు ఇప్పటిదాకా చూసిన టీజర్‌, ట్రైలర్‌ కొంత మాత్రమే. సినిమాలో చాలా మెస్మరైజింగ్‌ కంటెంట్‌ ఉంది. ఛియాన్‌ విక్రమ్‌ అద్భుతమైన పర్‌ ఫార్మెన్స్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆయన ఈ క్యారెక్టర్‌ లో ఎలా నటించారని మీరు ఆశ్చర్యపోతారు. అంత డెడికేషన్‌తో విక్రమ్‌ నటించారు.'తంగలాన్‌' సినిమాను మా టీమ్‌ తో పాటు ప్రేక్షకులకు మెమొరబుల్‌ మూవీ అవుతుంది. తప్పకుండా థియేటర్‌లో చూసి ఎంజారు చేస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు.

నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

టెక్నికల్ టీమ్
సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్
ఆర్ట్ - ఎస్ ఎస్ మూర్తి
ఎడిటింగ్ - ఆర్కే సెల్వ
స్టంట్స్ - స్టన్నర్ సామ్
బ్యానర్స్ - స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్
నిర్మాత - కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం - పా రంజిత్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved