29 November 2016
Hyderabad
Presented by RD Raja under his 24 AM Productions banner, and released by Dil Raju under Sri Venkateswara Creations banner, Remo is actor Sivakarthikeyan’s first release in Telugu. Starring Keerthy Suresh as the female lead, the film is helmed by Bhagiyaraj Kannan and had a grand release on 25th November in both the Telugu speaking states.
And now, the film has not just opened to rave reviews but has also got a superhit talk right from the day of release. While the openings have been great, even the audiences have been appreciating the film big time.
Speaking on the same, Dil Raju said, “I am really glad the love entertainer Remo has opened very well and has been getting great collections since three days. The film released on 25th. And even after the three days, the collections have been steady without a drop and the film is successfully running in the theatres. Despite the demonetization, the collections are impressive and I am very happy about it. So much that it has proved to be a great debut for Sivakarthikeyan and I want to thank the Telugu audiences for making this a success.”
RD Raja shares, “Remo was a big hit in Tamil thanks to the entertaining subject. A good story, and new approach proved to be a great advantage and it looks like the Telugu audiences have embraced it too. We had the belief that the audiences here would like it but the openings exceeded our expectations. Before the release, we had expected that Remo would be a good entry for Sivakarthikeyan into Telugu cinema, just like we expected, the Telugu audience have shown him so much of love. I thank each and everyone who is part of the success."
`రెమో` చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్‌రాజు
24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేసిన చిత్రం `రెమో`.
శివకార్తీకేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్యరాజ్ కన్ననన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్‌టైనర్ నవంబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదల రోజు నుండి సూపర్‌హిట్ టాక్‌తో భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్‌తో ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. ఈ సందర్భంగా...
దిల్ రాజు మాట్లాడుతూ - ``లవ్, కామెడి ఎంటర్‌టైనర్‌గా నవంబర్ 25న విడుదలైన రెమో చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది. మొదటి మూడు రోజులు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత మంచి కలెక్షన్స్‌తో స్టడీగా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడం చూస్తుంటే చాలా హ్యపీగా ఉంది. శివకార్తీకేయన్‌కు తెలుగులో రెమో మంచి డెబ్యూ మూవీ అయ్యింది. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
చిత్ర సమర్పకుడు ఆర్.డి.రాజా మాట్లాడుతూ - ``తమిళంలో రెమో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. మంచి ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్. మంచి కథ, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తానే నమ్మకంతో తెలుగులో నవంబర్ 25న దిల్‌రాజుగారి సహకారంతో సినిమాను తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేశాం. తెలుగులో మేం ఊహించిన దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. శివకార్తీకేయన్‌కు రెమో తెలుగులో మంచి ఎంట్రీ అవుతుందని విడుదలకు ముందు భావించాం. మేం అనుకున్నట్టుగానే సినిమాను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.