pizza

First Single Vegam From King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost On Sep 16th
కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌ టైన్‌మెంట్స్ 'ది ఘోస్ట్' ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

14 September 2022
Hyderabad

The theatrical trailer of King Akkineni Nagarjuna and creative director Praveen Sattaru’s highly anticipated action thriller The Ghost got overwhelming response from all the corner. Of course, the movie will have adequate action. But the trailer disclosed the family drama and emotions are going to be other major attraction.

Now, it’s time for audio promotions. The film’s first single Vegam will be out on September 16th. As the poster suggests it’s a Romantic song in the movie. Bharath and Saurab duo scored the song. Kapil Kapilan and Ramya Behara crooned the song for which lyrics are by Krishna Madineni.

In this picture, Nagarjuna and Sonal Chauhan can be seen enjoying time together in the cruise. Nagarjuna holds Sonal from back to plant a kiss on her cheek and she feels the warmth of his hug and kiss. Sonal appears in a revealing and glamorous outfit.

With blessings of Narayan Das Narang, Suniel Narang, in association with Puskur Ram Mohan Rao, and Sharrath Marar is producing The Ghost on lavish budget under Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.

Cinematography of the movie is by Mukesh G. Brahma Kadali is the art director, whereas Dinesh Subbarayan and Kaecha choreographed the stunts.

The movie that also features Gul Panag and Anikha Surendran among others.

The Ghost’s hunt will begin in cinemas from October 5th (Dasara release).

Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran and others.

Technical Crew:
Director: Praveen Sattaru
Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar
Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment
Cinematography: Mukesh G.
Music: Mark K Robin (Songs by Bharath and Saurab)
Action: Dinesh Subbarayan, Kaecha
Art Director: Brahma Kadali

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌ టైన్‌మెంట్స్ 'ది ఘోస్ట్' ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల భారీ యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.

ఇప్పుడు ది ఘోస్ట్ ఆడియో ప్రమోషన్‌ లకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్

భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటను స్కోర్ చేశారు. కపిల్ కపిలన్, రమ్య బెహరా పాడిన ఈ పాటకు కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు.

సాంగ్ రిలీజ్ పోస్టర్ లో నాగార్జున, సోనాల్ చౌహాన్ క్రూయిజ్‌లో కలిసి సమయాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు. నాగార్జున, సోనాల్ ని ప్రేమగా దగ్గరగా తీసుకొని చెంపపై ప్రేమగా ముద్దు పెడుతుండగా, ఆమె అతని కౌగిలింత ముద్దులోని వెచ్చదనాన్ని అనుభవిస్తున్నట్లు పోస్టర్ లవ్లీగా వుంది. సోనాల్ గ్లామరస్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved