A Small Film, A Big Heart – The Great Pre-Wedding Show Wins Audience Love!
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు.. బ్లాక్ బస్టర్ ఫన్ షోలో హీరో తిరువీర్
After opening to glowing reviews and strong word-of-mouth, The Great Pre-Wedding Show is being celebrated by audiences across Telugu states for its honesty, humour, and emotional depth. To thank the audience and media for the overwhelming response, the team gathered in Hyderabad for a lively Blockbuster Fun Show (Success Meet), an evening filled with laughter, reflection, and heartfelt gratitude.
The hall buzzed with warmth as the film’s cast and crew reminisced about their journey from a small idea born in a modest apartment to a film that’s now finding its place in people’s hearts.
Editor Naresh Adupa opened the event by speaking about the dedication behind the scenes. “The two people who have been deeply invested in this project are producer Sandeep and executive producer Prajnay. Yesterday, after two weeks, I finally saw smiles on their faces — that said everything,” he said, recalling the satisfaction of seeing the film connect with audiences. “A special thanks to Thiruveer for bringing such sensible stories and to director Rahul, who’s brilliant, adaptive, and gave me this opportunity."
Music Director Suresh Bobbili followed, clearly emotional about the film’s reception. “This film is very special to me — it’s the success I’ve been waiting for over the past five years,” he shared. “My heartfelt thanks to the Telugu audience and to the media for carrying the good word everywhere. I finally had a fulfilling sleep last night! This film brought me peace after years of waiting. My special thanks to BVS Ravi garu for encouraging new talent like us and for attending this event. His presence means a lot.”
The energy in the room remained high as actor Vinay added his own excitement. “Thanks to every actor and every media person for being so positive about our film.Vizag boys, it’s a smash, go and watch it."
Actress Yamini spoke next, and her words carried both emotion and gratitude. “During my first audition, I struggled with my accent even though I’m from Vizag. Many thought I wouldn’t fit in, but Rahul sir and Thiruveer believed in me. They stood by me when it mattered most. I want to thank my mother too, without her, I wouldn’t be standing here today. Regardless of what anyone said, you stood by me and supported me, Amma. I promise I won’t let you down. Please keep supporting me.”
Actor Narendra’s words drew some of the loudest applause of the evening. Fighting back emotion, he said, “Thanks to the media and everyone saying good things about the film. This is a very emotional moment for me. I’m an introvert, but I wanted to speak today. Since 2017, I’ve been trying to become an actor. My mom used to ask what I was doing with my life. Mom, are you watching this? I became an actor today! “Thanks to Rahul anna who trusted me, to Thiruveer for supporting me on set and during promotions, and to Prajnay anna, without him, this film wouldn’t exist. Special thanks to Sandeep anna, who was scrolling through Reels when he found me and called me to audition. That changed my life."
The tone shifted to heartfelt humour as actor Joga Rao took the mic, beginning with a short poem about the Telugu language. “People might wonder why I recited that poem, it’s because this film is as great as the Telugu language itself — clean, emotional, and a complete family entertainer. Actors are great, directors are greater, and the 24 crafts are greater still. But above all that, Cinéma is greater than us all, audience is greater than Cinéma, and media is greater than audience because without media, a film can’t reach people. If anyone watches this film and doesn’t laugh even once, I’ll personally return their money. I guarantee it! I’ve done 20 films and countless theatre plays, but this is the only one that gave me true satisfaction. Even before my death, I’ll remember Rahul Srinivas. I spoke to my daughter that night after the premiere, and it was one of the most emotional conversations I’ve had in years. Thank you, Rahul, for giving me a role that made me feel alive.”
Rohan Roy followed with his trademark energy and charm. “First, thanks to BVS Ravi garu for attending,” he said. “I’ve been thanking everyone since day one, now it’s time to thank the audience. Our film worked because of everyone’s effort. I also want to thank Vijay Deverakonda anna Mmmwaah! I’m so happy for this Friday. Our film worked, and everything went in our favour. Thanks Rahul anna and Prajnay anna, because everything we did was possible only because of your support"
Producer Sandeep, speaking straight from the heart. “I actually came very prepared,” he smiled, “but after listening to everyone, I forgot everything! Looks like they came more prepared than me. Like everyone, I used to thank the media as a formality, but this time I mean it. The bookings picked up from 4 PM yesterday — that’s because of media support. So, thank you all.” He then made a thoughtful gesture by donating to the Telangana Film Journalists Association (TFJA). “It’s a small amount,” he said humbly, “but it’s my way of thanking those who stood by a new producer with no background. I’ll do more if I earn more. This is just the beginning.”
TFJA Executive Venu appreciated the gesture, saying, “It’s not the amount that matters, it’s the intent and initiative.”
Journalist Tarak drew parallels between The Great Pre-Wedding Show and Pelli Choopulu, saying, “What Pelli Choopulu was for Vijay Deverakonda, The Great Pre-Wedding Show is for Thiruveer. If this film were made in Malayalam, everyone would call it a must-watch.”
Journalist Raja Babu added, “This film connected with every character and scene. Usually, journalists sneak out after bad screenings, but this time everyone stayed back to congratulate the team. That says everything.”
When Sandeep returned to the mic, he said, “Like I said before, I didn’t make this film as a producer — the film made me one. Coming from a middle-class background, my parents were worried when I said I’d make a film. Now, they’re calling me with pride. The reason behind all this is Rahul Srinivas. I want him to make another film with me before a big production house grabs him away. And to Nani and Charan, you’ll both be directors next year!”
Actress Teena Sravya kept her words short but heartfelt. “A big thanks to the media for supporting our film right from day one, and to the direction department for always being there. I came prepared to say a lot, but after hearing everyone, I just want to say thank you so much,” she said with a smile.
BVS Ravi, who was the guest of honour, praised the entire team, calling The Great Pre-Wedding Show “a perfect example of how media and genuine storytelling can make a film succeed.” He said, “Because of media, the film reached producers and audiences alike. Rohan will be the next star, and Teena Sravya is such a pure Telugu girl, she deserves all support. Thiruveer is an inspiration. From Zee to here, handling everything with maturity it’s not easy. And Suresh Bobbili is a blaster! Rahul Srinivas has made a beautiful film. To the audience, I’ll just say this film is media-approved, and that’s the biggest quality stamp.”
Director Rahul Srinivas was visibly moved as he took the mic. “Thank you, Ravi sir, for everything you said,” he began. “I can’t speak without my ADs Nani and Charan beside me. They’ve been my backbone since day one. My biggest thanks to the media without you, the film wouldn’t have reached here. When I started this film, I just wanted one more chance to make another movie. But for the last six months, I’ve been praying for a hit not for myself, but for two people Thiruveer and Sandeep. Thiruveer didn’t have to do this film with me, but he trusted me completely. Sandeep supported me unconditionally, through every decision. Thanks also to Naresh, Suresh Bobbili, and lyricist Sanare. There’s one scene where I wasn’t confident emotionally, and it was Suresh’s music that lifted it. And my guru Gurukiran garu, when the producers first approached him, he told them I was the right one for the film. Who does that now? And lastly, Prajnay, he’s the true captain of this ship.”
Lyricist Sanare spoke about his contribution to the film. “This is my first film where I’ve written all the songs,” he said proudly. “Thanks to Suresh anna for recommending me and to Rahul and Sandeep for making my job easy. I’m very satisfied with my work, and I thank the audience for their appreciation.”
Wrapping up the evening, hero Thiruveer shared the story behind the making and it captured the film’s spirit perfectly. “We made this movie from a small penthouse that had a single bathroom. We extended it and turned it into our office, edit suite, and even our preview theatre,” he said, smiling. “Despite facing financial struggles, everyone worked with faith. Rohan even reached out to influencers on Instagram, asking them to help promote the film. That’s how much we believed in it. And today, I realized the true power of the media. I bow my head to them. For all my films, word-of-mouth has always been my strength, and this time too, it became our biggest weapon. My heartfelt thanks to the audience, my team, and everyone who made this possible.”
As the evening ended, it was clear that The Great Pre-Wedding Show wasn’t just a small film that found its way, it was a story of persistence, teamwork, and genuine love for Cinéma. The event wasn’t just a celebration of success, but of everything that made the film possible.
The Great Pre-Wedding Show is now playing in theatres, a film made with sincerity, laughter, and soul, and it’s already winning hearts everywhere.
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు.. బ్లాక్ బస్టర్ ఫన్ షోలో హీరో తిరువీర్
వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
దర్శకుడు, రచయిత, నటుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అనేది మీడియా సినిమా. చిన్న చిత్రాలు బతకాలి అని అంతా అంటుంటారు. మంచి చిత్రాన్ని అందరూ ముందుండి నడిపిస్తుంటారు. పెద్ద బ్యానర్స్ చిన్న చిత్రాల్ని సులభంగానే రిలీజ్ చేస్తారు. కానీ కొత్త, చిన్న నిర్మాతలు తీసే చిన్న సినిమాల్ని రిలీజ్ చేయడం కష్టం. ఇలా అభిరుచి ఉన్న నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. చిన్న చిత్రాలు ఆడితే కొత్త హీరోలు, దర్శకులకు అవకాశాలు వస్తాయి. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ అందరూ అద్బుతంగా చేశారు. తిరువీర్ ఎంతో క్రమశిక్షణ ఉన్న నటుడు. ఎన్నో కష్టాలు పడి ఇంత స్థాయికి వచ్చాడు. సినిమాకు వెళ్లినట్టుగా కాకుండా.. ఊర్లోకి వెళ్లినట్టు చూసినట్టుగా ఉంటుంది. ‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఈ మూవీకి చాలా అవార్డులు వస్తాయి. సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీత దర్శకుడు. తన మ్యూజిక్‌తో సురేష్ బొబ్బిలి సినిమాకు ప్రాణం పోస్తాడు. రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశాడు. రెండో మూవీని కూడా సందీప్‌కే చేసి పెట్టు. కొత్త నిర్మాతలు ఇలాంటి మంచి చిత్రాలు తీసినప్పుడు అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఇది మీడియాకు నచ్చిన చిత్రం.. మీడియాకు నచ్చిందంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని అర్థం’ అని అన్నారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘సైరాట్ మూవీ మేకింగ్‌ను డాక్యుమెంటేషన్ చేశారు. ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మేకింగ్‌ని కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోండని చెప్పాను. చిన్న రూంలోనే సినిమా పనులన్నీ చేసేశారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని మీడియా చాలా సపోర్ట్ చేసింది. ఈ చిత్రం కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. రోహన్ అయితే మా కోసం ఇన్ స్టాలో ఎక్కువగా ప్రమోట్ చేశాడు. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు. మౌత్ టాక్, మౌత్ పబ్లిసిటీతోనే నా సినిమాలు ఆడుతుంటాయి. ఇప్పుడిప్పుడే మా సినిమా పికప్ అవుతోంది. మా చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘మీడియా లేకపోతే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ స్థాయికి వచ్చేది కాదు. ఒక్క నెగెటివ్ రివ్యూ, కామెంట్ లేకుండా అందరూ ప్రశంసిస్తున్నారు. మీడియానే మా మూవీని ముందుకు తీసుకెళ్తోంది. తిరువీర్ అన్న, సందీప్ అన్న కోసం ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఒంటెద్దు బండిలా తిరువీర్ అన్న ఈ చిత్రాన్ని ముందుకు తీసుకు వచ్చారు. ఇలాంటి కథలు థియేటర్లో ఆడవా? అని అనుకున్నాను. కానీ ఆడియెన్స్ మాత్రం మా సినిమాను పెద్ద సక్సెస్ చేశారు. ఇది సక్సెస్ అవ్వడంతో సహజత్వంతో కూడిన ఇలాంటి కథల్ని చేసేందుకు అందరూ ముందుకు వస్తారు. ఈ చిత్రంతో సందీప్ గారు అన్ని క్రాఫ్ట్‌ల మీద నాలెడ్జ్ పెంచుకున్నారు. శేఖర్ కెమెరా వర్క్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. అశ్విన్ సౌండ్ డిజైన్ బాగుందని మెచ్చుకుంటున్నారు. సనారే అయితే వెంటనే లిరిక్స్ ఇస్తుండేవారు. నరేష్ గారి ఎడిటింగ్ మా సినిమాకు చాలా హెల్ప్ అయింది. సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది. టీం అంతా వంద శాతం ఇష్టపడి, కష్టపడి పని చేయడం వల్లే ఈ స్థాయి విజయం దక్కింది. మళ్లీ ఇదే కాంబోతో, ఇదే టీంతో మరో సినిమాను చేయాలని కోరుకుంటున్నాను. తనకు వచ్చిన అవకాశాన్ని తన శిష్యుడికి ఇచ్చిన నా గురువు గారు గురు కిరణ్‌కి థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లు చూసి మీడియా వాళ్లు గంట సేపు మాట్లాడారు. మీడియా వల్లే మా మూవీ ఆడియెన్స్ వరకు రీచ్ అయింది. టీఎఫ్‌జేఏకి నా వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను నిలబెట్టిన మీడియాకు థాంక్స్. ఈ మూవీనే నన్ను నిర్మాతగా మార్చింది. ఇదంతా కూడా రాహుల్ వల్లే జరిగింది. మంచి చిత్రాన్ని నిర్మించావని నా సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులంతా మెచ్చుకుంటున్నారు. ఈ మూవీని వెన్నంటే ఉండి సపోర్ట్ చేసిన తిరువీర్ అన్నకి థాంక్స్. ఆడియెన్స్ మా సినిమా చూసి మంచి లాభాల్ని అందిస్తే మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తాను’ అని అన్నారు.
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన డైరెక్షన్ టీంకు థాంక్స్. మా కోసం వచ్చిన బీవీఎస్ రవి సర్‌కు థాంక్స్. ప్రతీ సీన్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీని చూడని వాళ్లంతా చూడండి’ అని అన్నారు.
నటి యామిని మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మాకోసం వచ్చిన బీవీఎస్ రవి సర్‌కి థాంక్స్. ఆడిషన్స్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతానా? లేదా? అని టెన్షన్ పడ్డాను. సినిమా చాలా బాగా వచ్చింది. మీడియా కూడా మంచి రివ్యూలు ఇచ్చింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా చూడని వాళ్లంతా కూడా మా మూవీని చూడండి’ అని అన్నారు.
నటుడు నరేంద్ర రవి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ అందరికీ మా చిత్రం నచ్చింది. నాకు శ్రీకాకుళం యాస తెలీదు. కానీ రాహుల్ అన్న మాత్రం దగ్గరుండి నాకు ఈ యాసను నేర్పించారు. సినిమా మీద ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించడం లేదు. తిరువీర్ అన్న ఈ మూవీని భుజానికి ఎత్తుకుని ముందుకు నడిపించారు. ‘జార్జిరెడ్డి’ చూసిన తరువాత తిరువీర్ అన్నకి ఫ్యాన్ అయిపోయాను. రాహుల్ అన్న నన్ను యాక్టర్‌గా నిలబెట్టారు. సురేష్ అన్న మ్యూజిక్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. మా చిత్రాన్ని చూడనివారు త్వరగా చూడండి. అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్. గత ఐదేళ్ల కోసం నేను ఓ మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. నా పాటలు బాగుంటున్నాయి.. కానీ సినిమాలు ఆడటం లేదు అని అంతా అంటుండేవారు. కానీ ఇప్పుడు మాత్రం నాకు మంచి గుర్తింపుతో పాటు, మంచి సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ కోసమే నేను ఇన్నేళ్లు కష్టపడుతూ వచ్చాను. పడుతూ లేస్తూ అథ:పాతాళానికి వెళ్లినా కూడా ఇలా సక్సెస్ సాధించాను. ఈ మూవీని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని మీడియాని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మాస్టర్ రోహన్ మాట్లాడుతూ .. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కోసం ట్వీట్ వేసిన విజయ్ దేవరకొండ అన్నకు థాంక్స్. మేం ఈ మూవీ కోసం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాహుల్ అన్నకి థాంక్స్. నాకు సపోర్ట్‌గా నిలిచిన తిరువీర్ సర్‌కు థాంక్స్. మా మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
ఎడిటర్ నరేష్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. మా నిర్మాతలు సందీప్, పద్మినీ గారు గత వారం నుంచి ఒత్తిడిలో ఉన్నారు. కానీ ఈ మూవీ బయటకు వచ్చిన తరువాత వారి మొహంలో నవ్వులు కనిపిస్తున్నాయి. ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసే చిత్రాల్ని వారు మరిన్ని నిర్మిస్తారని ఆశిస్తున్నాను. పెట్టే డబ్బులకు సరిపడేలా సినిమా అందరినీ నవ్విస్తుంది. తిరువీర్ గారు ఎప్పుడూ ఇలాంటి డిఫరెంట్ స్టోరీలనే ఎంచుకుంటూ ఉంటారు. రాహుల్ కథ, తిరువీర్ సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది. ఇంకా ఈ మూవీని చూడని వారంతా చూడండి’ అని అన్నారు.
సౌండ్ డిజైనర్ అశ్విన్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీకి పని చేసే అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నటుడు జోగా రావు మాట్లాడుతూ .. ‘తెలుగు భాష ఎంత గొప్పగా ఉంటుందో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కూడా అంతే గొప్పగా ఉంటుంది. రాహుల్ ఈ మూవీని చాలా గొప్పగా తీశారు. మా మూవీని ఆదరిస్తున్న మీడియా, ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
లిరిసిస్ట్ సనారే మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి అన్ని పాటలు నేనే రాశాను. నన్ను నమ్మి సురేష్ అన్న నాకు అవకాశం ఇప్పించారు. నన్ను నమ్మిన చిత్ర యూనిట్‌కు థాంక్స్. తిరువీర్ గారు, సందీప్ గారు వంటి మంచి వ్యక్తులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
తారాగణం : తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్, నరేంద్ర, యామిని తదితరులు
సాంకేతిక సిబ్బంది
బ్యానర్ : 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్
నిర్మాతలు : సందీప్ అగరం & అశ్మితా రెడ్డి బసాని
రచయిత & దర్శకుడు: రాహుల్ శ్రీనివాస్
సహ నిర్మాత: కల్పనారావు
సంగీతం: సురేష్ బొబిల్లి
DOP: K సోమ శేఖర్
ఎడిటర్: నరేష్ అడుప
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రజ్ఞయ్ కొణిగారి
ప్రొడక్షన్ డిజైనర్: ఫణి తేజ మూసి
"నాకేమో జర సిగ్గు.. అమ్మాయితో డాన్స్ చేయాలంటే.."
'దేవర' స్టెప్పు వేయమన్నప్పుడు,
నేను అటూ ఇటూ తిరుగుతుంటే.. "యాక్టర్ అంటే అన్నీ చేయాలి" అని ఎంకరేజ్ చేశారు తిరువీర్..