pizza

The Paradise Media Mulakat
'ప్యారడైజ్' రిలీజ్ తర్వాత రెస్పాన్స్ ఒక తుఫాన్‌లా వచ్చింది. ఎవర్ని కలిసినా, ఎక్కడికి వెళ్లిన ఒకటే టాపిక్... అదే ‘ప్యారడైజ్’ గెలుపు. ప్రతి షోకి పాజిటివిటీ పెరుగుతుంది. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రేమని యాక్సెప్ట్ చేయాల్సిన టైం వచ్చింది: మీడియా ములాఖాత్ లో న్యాచురల్ స్టార్ నాని

You are at idlebrain.com > news today >

26 September 2026
Hyderabad

'ప్యారడైజ్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. నాని చాలా కష్టపడ్డాడు. జడలు వేసుకొని యాక్షన్ చేయడం మామూలు విషయం కాదు. నాని ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ బాక్సాఫీస్ తాండవం ‘ది ప్యారడైజ్’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మీడియా ములాఖాత్ నిర్వహించారు.

మీడియా ములాఖాత్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ... అందరికీ హృదయపూర్వక వందనాలు, ఆశీస్సులు. సుధాకర్ గారు ఎక్కడా కూడా డబ్బుకి వెనకాడకుండా ఈ సినిమా చేశారు. ఆ భగవంతుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. దర్శకుడిపై భారం వేసి, సినిమాను నిర్మించిన వాళ్లలో ఒకరిద్దరినే చూశా. మా గురువుగారు దాసరి గారు పై కూడా ఇలాగే నిర్మాతలు నమ్మకం పెట్టుకునేవారు. ఇప్పుడు శ్రీకాంత్‌పై సుధాకర్‌ చెరుకూరి అదే నమ్మకం ఉంచారు. సుధాకర్ లాంటి నిర్మాత సినిమా పరిశ్రమకు కావాలి. నిర్మాత ఆయన పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. దర్శకుడు శ్రీకాంత్ ఈ కథని నాకు చాలా ధైర్యంగా చెప్పాడు. చాలా సులువుగా అర్థమయ్యేలాగా అద్భుతంగా చెప్పాడు. నా సుదీర్ఘ సినీ కెరీర్‌లో 500లకు పైగా చిత్రాల్లో నటించాను కానీ, సికంజ మాలిక్‌లాంటి భయంకరమైన చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైం. నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడని అనుకోలేదు. నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్. మా గురువుగారు దాసరి నారాయణరావు గారు కూడా చాలా టేకులు తీసుకునేవారు. “నువ్వు చేసినవన్నీ బాగున్నాయి. కానీ ఇంకా అద్భుతంగా వస్తుందని” చెప్పేవారు. శ్రీకాంత్ తో పనిచేస్తున్నప్పుడు నాకు మా గురువుగారు గుర్తొచ్చారు. శ్రీకాంత్ ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్. పాత్రని ఆ పాత్రగానే చూశాడు. ఒక నటుడిగా తనలో ఉన్న టాలెంట్‌ని చూసి గర్వించాను. తను దర్శకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. తను దేశంలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు. సినిమా పరిశ్రమ అందరిదీ. ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్లని ముందుకు తీసుకెళుతుంది. శ్రీకాంత్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా చేశారు. నానిని నేను ఎంతో అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఒక నటుడిగా గౌరవిస్తున్నాను. ఈ సినిమాలో నాని పట్టిన కష్టం ఆ భగవంతుడికే తెలుసు. ప్రజలు ఆశీర్వదించారు. ‘ప్యారడైజ్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. నాని గొప్ప కళాకారుడు. ‘దసరా’లో ఒక రకంగా చేశాడు. ‘ప్యారడైజ్’లో అందుకు పూర్తి భిన్నంగా చేశాడు. జడలు వేసుకోవడం మామూలు విషయం కాదు. తనతో ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఆ జడలు పట్టుకున్నప్పుడు తనకు ఎంతో బాధ కలిగింది. అది నాకు తెలుసు. తను ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని మనసా వాచా కోరుకుంటున్నాను ఈ స్నేహం కలకాలం ఉండాలి. తను ప్రతి షాట్‌ని అద్భుతంగా చేశాడు. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్.

నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా విషయంలో అన్ని కొత్తగానే జరిగాయి. ఫిలిం మేకింగ్, లొకేషన్స్ లో సిచువేషన్, ట్రైలర్ లేకపోవడం, రిలీజ్ ముందు ఉండే సిచువేషన్.. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఒక కొత్త సినిమా చేస్తున్నాం, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాం అనుకున్నాం. కానీ ఇలా రెస్పాన్స్ కూడా ఇంత కొత్తగా ఉంటుందని అనుకోలేదు. ఇది నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. నేను ఎన్నో సినిమాలు చేశాను. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అయిన ఉదయం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. సాయంత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్‌గా మారిపోతుంది. ‘ప్యారడైజ్’ కి రివర్స్ లో జరిగింది. రిలీజ్ రోజున ప్రీమియర్స్‌కి ఒకలాగా మొదలైంది. ఆ తర్వాత ప్రతి షోకి పాజిటివిటీ పెరుగుతుంది, ఇంకా బెటర్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి రెస్పాన్స్‌ని నేను చూడలేదు. మేమందరం చాలా నిబద్ధతతో ఈ సినిమా చేశాం. మేమందరం బిగినింగ్‌లో వచ్చిన రకరకాల రెస్పాన్స్‌ని యాక్సెప్ట్ చేశాం. ఇప్పుడు ప్రేక్షకులు ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆ ఆదరణని,పెరుగుతున్న ప్రేమని యాక్సెప్ట్ చేయాల్సిన టైం వచ్చింది. అందరూ తమ సొంత సినిమాగా ఓన్ చేసుకుని చిన్నచిన్న మూమెంట్స్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ, వాటిని సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకులు వాళ్ల అభిప్రాయాన్ని చాలా నిజాయితీగా చెప్తారు. అలాంటి ప్రేక్షకులు ఉన్నంతవరకు తెలుగు సినిమా గొప్పగా ఉంటుంది. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘ప్యారడైజ్’ హీరో సినిమా కాదు. కేవలం హీరోనే ఎక్కువ కష్టపడ్డాడని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన వారితో సహా వాళ్లందరూ ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశాను. వర్షంలో రోజుల తరబడి సినిమాని నమ్మి పనిచేశారు. మీరందరూ కూడా ‘ప్యారడైజ్’ రియల్ హీరోస్. ప్రతి క్యారెక్టర్, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్, ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్.. అందరూ నిద్ర లేకుండా పనిచేశారు. మీ కష్టానికి హ్యాట్సాఫ్. అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తను ఇచ్చిన మ్యూజిక్ వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలందరూ థియేటర్స్‌కి తరలివచ్చారు. సాయి సినిమాకి చాలా టైం ఇచ్చాడు, కష్టపడ్డాడు. ఈ సినిమా షూట్ చేయడం అంత ఈజీ కాదు. అవినాష్ గారు చాలా అద్భుతమైన సెట్స్ చాలా కష్టపడి వేశారు. అలాగే ఎడిటర్ నవీన్ కూడా చాలా హార్డ్‌వర్క్ చేశాడు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సంపూ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచోడు. అలాగే సవారి గ్యాంగ్‌లో నటించిన వాళ్లందరూ అద్భుతంగా చేశారు. మా స్టంట్ కొరియోగ్రాఫర్స్, డాన్స్ కొరియోగ్రాఫర్స్ అందరూ అద్భుతంగా పనిచేశారు. కాసర్ల శ్యామ్ గారు ఈ సినిమాలో ఉన్న ఎమోషన్ అంతా క్యాచ్ చేసి తన లిరిక్స్‌లో వినిపించారు. శశి గారు, నవీన్ గారు, రవి గారు చెప్తున్న మాటలు వింటుంటే కడుపు నిండిపోతుంది. సుధాకర్ గారిని మేము చాలా ఇబ్బంది పెట్టాం. మా అందరినీ ఆయన ఎంతో బలంగా నమ్మారు. షూటింగ్ సమయంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. అన్నిటికీ ఆయన బలంగా నిలబడ్డారు. ఆయన ఫిల్మోగ్రఫీలో ‘ప్యారడైజ్’ చాలా స్పెషల్ సినిమాగా ఉంటుంది. దర్శి చేసిన శంకరన్న పాత్రకి ఎక్కడ చూసినా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. దర్శి టెర్రిఫిక్ పెర్ఫార్మర్. తనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. రాఘవ్, సోనాలి గారు.. అందరూ అద్భుతంగా తమ పాత్రల్లో నటించారు. అలాగే కయాదు లాంటి పాత్ర చేయడం చాలా కష్టం. తన ట్రాక్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. మోహన్ బాబు గారు మా అందరి ఫేవరెట్. నాకు చిన్నప్పటి నుంచి మోహన్ బాబు గారి సినిమాలు అంటే, ఆయన నటన అంటే చాలా ఇష్టం. ‘అసెంబ్లీ రౌడీ’, ‘పెదరాయుడు’ నా ఫేవరెట్ సినిమాలు. మోహన్ బాబు గారితో కలిసి పనిచేసిన తర్వాత ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో అర్థమైంది. ఆయన చాలా బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో కలిసి దగ్గరగా పనిచేస్తే అందరూ ఆయనతో ప్రేమలో పడిపోతారు. ఆయనతో ఈ అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను.ఈ సినిమాకి హీరో పైన ఉన్న హీరో ఆయనే. శ్రీకాంత్ ఒరిజినల్ పీస్. మాటల్లో చెప్పలేను.తన విషయంలో చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్.. ఇదంతా ఒక తుఫాన్‌లో జరిగింది. ఎవర్ని కలిసినా, ఎక్కడికి వెళ్లినా ఒకటే టాపిక్ ఉంది. అదే ‘ప్యారడైజ్’ గెలుపు. అందరికీ కంగ్రాట్యులేషన్స్. 2026లో ఎక్కువగా నాయిస్ చేసిన సినిమా ‘ప్యారడైజ్’. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. సినిమాని హిట్ చేసినందుకు అందరికీ థాంక్యూ. ముందుగా జూనియర్ ఆర్టిస్టులందరికీ థాంక్యూ. ఈ సినిమా కోసం బురదలో, వర్షంలో చాలా కష్టపడ్డారు. సమ్మక్క క్యారెక్టర్‌ని సోనాలి గారు కాకపోతే ఇంకెవరు చేసినా ఇంత బాగా వచ్చేది కాదు. ఆ పాత్రని అద్భుతంగా చేశారు. సంపూ బిర్యానీ క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా చేశారు. మా హీరోయిన్ కయాదుకు థాంక్యూ. అది చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. తను ఆ ఛాలెంజ్‌ని తీసుకుని చేసింది. ప్రియదర్శి శంకరన్న పాత్రని చాలా చక్కగా చేశాడు. తను ఆ పాత్ర కోసం తనే రీసెర్చ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు, టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అనిరుద్, సాయి నవీన్.. అందరూ బ్లడ్ పెట్టి పని చేశారు. అందరికీ థాంక్యూ. మోహన్ బాబు గారు నాకు ఎంతో చనువు ఇచ్చారు. మోహన్ బాబు గారు చాలా స్వచ్ఛంగా ఉంటారు. మోహన్ బాబు గారితో పని చేయడం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుగా భావిస్తాను. ఆయన నుంచి పర్సనల్‌గా చాలా విషయాలు నేర్చుకున్నాను. సుధాకర్ గారి ప్రొడక్షన్ హౌస్‌కి కోవిడ్ సమయంలో వచ్చాను. ఇంకా ఇక్కడే ఉండిపోయాను. నేను ఏం ఫీల్ అవుతానో ఆయనకి క్లియర్‌గా అర్థమవుతుంది. నన్ను భరించినందుకు ఆయనకి థాంక్యూ. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ ఫిలిం మేకింగ్ ప్రాసెస్‌లో నాని అన్నకి చాలా కోపం వచ్చిందని, తిట్టారని, శ్రీకాంత్ అరిచాడని, అలిగాడని ఎన్నో విషయాలు విన్నాను. ఇక్కడ ఒక విషయం క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. నాని అన్నది నాది ‘దసరా’, ‘ప్యారడైజ్’ సినిమాలకు సంబంధించిన అనుబంధం కాదు. మా ఎమోషన్‌ని సినిమాలతో ముడి పెట్టకూడదు. కచ్చితంగా ఆయన నన్ను భరించాలి. ఆయన నన్ను మోయాలి. మరో ఆప్షన్ లేదు. (నవ్వుతూ) మా ఇద్దరి అనుబంధం ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఈ సినిమాకి పని చేసి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. సినిమా ఓపెనింగ్ పోస్టర్ పడినప్పటి నుంచి మాకు ఎంతగానో హెల్ప్ చేస్తూ వచ్చారు. మా సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. అలాగే నాని గారికి, డైరెక్షన్ టీమ్‌కి, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. మా టీమ్ అందరూ ఈ రెండు సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. మా సినిమాని ఆదరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి ధన్యవాదాలు.

ప్రియదర్శి మాట్లాడుతూ.. ఒక నటుడిగా కొత్త పాత్రలు చేయాలి, కొత్తగా ఆవిష్కరించుకోవాలని నాకు పొట్టు పొట్టు ఆకలి ఉంది. అలాంటి సమయంలో శ్రీకాంత్ ఫోన్ చేశాడు. శంకరన్న పాత్ర చెప్పగానే నాకు చాలా భయమేసింది. భయం వేసినప్పుడే ఛాలెంజ్ విలువ తెలుస్తుంది. లాస్ట్ టైమ్ ‘కోర్టు’ సినిమాలో సూర్య తేజ పాత్రకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో.. ఆ తర్వాత ఇందులో శంకరన్న పాత్రకి కూడా అంతే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాల్లో నాని నాతో పాటు ఉన్నారు. నాని గారికి, శ్రీకాంత్ గారికి థాంక్యూ. మోహన్ బాబు గారు మా అందరికీ ఇన్‌స్పిరేషన్. ఆయన చేసిన సినిమాలో నేను చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంత సాహసమైన సినిమా చేసిన మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి థాంక్యూ. శంకరన్నకి ఎంత గట్స్ ఉన్నాయో.. సుధాకర్ గార్లో కూడా అంత గట్స్ ఉన్నాయి. శంకరన్న పాత్ర చేయడానికి చాలామంది నాకు సహకరించారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత మంచి టీమ్‌తో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు దాటి ఈరోజు సినిమా జనాల్లోకి చొచ్చుకు వెళ్లి అద్భుతంగా ఆడడం చాలా ఆనందంగా ఉంది. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ గారు నాలో ఉన్న నన్ను పరిచయం చేశారు. నాని గారితో, మోహన్ బాబు గారితో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది కాల్ చేసి చాలా కొత్తగా చేశానని చెప్తున్నారు. కొబ్బరిమట్ట తర్వాత ఆగిపోయిన ఫోన్ మళ్లీ ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాతే మోగింది. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రతి థియేటర్ ఊగిపోతుంది. ప్రతి ప్రేక్షకుడు మనస్ఫూర్తిగా సినిమాని ఆస్వాదిస్తున్నారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ మాట్లాడుతూ.. నాని గారి సినిమా చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా సరే అద్భుతంగా జనాల్లోకి వెళ్లింది. ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పాటలే వినిపించాయి. మేము ఎన్నో పెద్ద సినిమాలు చేశాము. ఆడియన్స్ తమకి ఇష్టమైన పాట వస్తే స్క్రీన్ దగ్గరికి వెళ్లి డాన్స్ చేయడం చూశాను. కానీ ‘ప్యారడైజ్’కి మాత్రం ప్రతి షోకి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఆడియన్స్ మనసులో ఈ సినిమా చూడాలని గట్టిగా నాటుకుపోయింది. అన్ని షోలు కూడా ఫుల్ అవుతున్నాయి. మేము ఏ అంచనాలతో సినిమాని అన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేసామో.. ఆ అంచనాల్ని అందుకున్నాము. దానికి తగ్గ రిజల్ట్ చూశాం. నిన్నటితో వినాయక నిమజ్జనం అయిపోయిందనుకుంటే.. ఈరోజుకీ థియేటర్లలో జరుగుతూనే ఉంది. అది ఈ సినిమా గొప్పతనం. ఒక సెలబ్రేషన్‌లాగా ఉంది.సినిమా చూసిన తర్వాత మేము సేఫ్ అని ఫిక్స్ అయిపోయాం. ఎంత చేస్తుందనేది మండే నుంచి అనలైజ్ అవుతుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మూడో రోజు 95% ఆక్యుపెన్సీ అని ఒక ఎగ్జిబిటర్ చెప్పారు. ఇది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి దీని రేంజ్ అర్థమవుతుంది. ఈ సినిమాకి ఇంత పెద్ద ఘనవిజయం చేకూర్చిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved