pizza

"Art Can Wait – India Comes First": Ulaganayagan Kamal Haasan's 'Thug Life' Audio Launch Event Postponed
ఆర్ట్ కెన్ వెయిట్-ఇండియా కమ్స్ ఫస్ట్: ఉలగనాయగన్ కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ఆడియో లాంచ్ ఈవెంట్ వాయిదా

You are at idlebrain.com > news today >

09 May 2025
Hyderabad

Ulaganayagan Kamal Haasan and visionary director Mani Ratnam’s most-awaited pan-India film Thug Life is gearing up for release with a massive star cast. The team initially planned a grand audio launch event on May 16, ahead of the movie's release on June 5.

However, due to the current situation at the nation’s borders, the team has decided to postpone the event. Kamal Haasan released a statement saying, "Art can wait – India comes first."

He stated:

"In view of the developments at our nation's borders and the current tense situation, we have decided to postpone the audio launch event of 'Thug Life', which was scheduled for May 16."

"At a time when our soldiers are courageously standing at the frontlines to protect our nation, we believe this is not the right moment for celebration. We believe this is a time for solidarity. We will announce a new date for the event at an appropriate time soon."

"At this moment, we must think about our soldiers who are vigilantly safeguarding our country. As citizens, we must respond with restraint and unity," Kamal Haasan expressed.

ఆర్ట్ కెన్ వెయిట్-ఇండియా కమ్స్ ఫస్ట్: ఉలగనాయగన్ కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ఆడియో లాంచ్ ఈవెంట్ వాయిదా

ఉలగనాయగన్ కమల్ హాసన్, విజనరీ డైరెక్టర్ మణిరత్నం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'థగ్ లైఫ్'. భారీ తారాగణంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా సిద్ధమవుతోంది. జూన్ 5న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మే 16న భారీస్థాయిలో ఆడియో లాంచ్ ఈవెంట్ ని నిర్వహించాలని టీమ్‌ భావించింది.

అయితే, ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో ఈ వేడుక వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు కమల్‌హాసన్‌ 'ఆర్ట్ కెన్ వెయిట్-ఇండియా కమ్స్ ఫస్ట్' అంటూ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు.

'మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మే 16న నిర్వహించాల్సిన థగ్ లైఫ్ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాము.

మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండి పోరాడుతున్న వేళ ఇది వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయమని నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో సముచితమైన సమయంలో ప్రకటిస్తాం.

ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి' అని కమల్ హాసన్ తెలియజేశారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved