pizza

Renu Desai As Hemalatha Lavanam In Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao
రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ పాన్ ఇండియన్ చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'లో హేమలత లవణంగా రేణు దేశాయ్

You are at idlebrain.com > news today >
Follow Us

29 September 2022
Hyderabad

Mass Maharaja Ravi Teja and director Vamsee’s Tiger Nageswara Rao produced by Abhishek Agarwal is one of the craziest Pan India movies. Tej Narayan Agarwal presents the movie being made on an uncompromised budget. Tiger Nageswara Rao is a biopic on the notorious thief and is set in the 70s in the village named Stuartpuram.

The makers today came up with a small glimpse to introduce Renu Desai’s character. Renu Desai is playing a very important and powerful character called Hemavathi Lavanam. It’s a real-life character and Hemalatha Lavanam was an Indian social worker, and writer, who protested against untouchability and the imbalance in the social system. Renu Desai, in the video, makes a powerful entry, as she walks on the road along with two other female activists who appear in white sarees. GV Prakash Kumar’s BGM uplifts the character.

Nupur Sanon and Gayathri Bharadwaj are playing the leading ladies opposite Ravi Teja in the movie made in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.

Nupur Sanon and Gayathri Bharadwaj are playing the leading ladies opposite Ravi Teja in the movie made in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.

Cast: Ravi Teja, Nupur Sanon, Gayathri Bharadwaj, Renu Desai and others

Writer, Director: Vamsee
Producer: Abhishek Agarwal
Banner: Abhishek Agarwal Arts
Presenter: Tej Narayan Agarwal
Co-Producer: Mayank Singhaniya
Dialogues: Srikanth Vissa
Music Director: GV Prakash Kumar
DOP: R Madhie
Production Designer: Avinash Kolla

రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ పాన్ ఇండియన్ చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'లో హేమలత లవణంగా రేణు దేశాయ్

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. రాజీ లేని భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు1970 స్టువర్ట్‌పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్ గా రూపొందుతోంది.

ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ రోజు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమవతి లవణం అనే చాలా ముఖ్యమైన, పవర్ ఫుల్ పాత్రను పోషిస్తోంది. ఇది నిజ జీవిత పాత్ర. హేమలత లవణం భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు.

వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. జివి ప్రకాష్ కుమార్ బిజిఎమ్ పాత్రను మరింత ఎలివేట్ చేసింది.

ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నారు.

ఆర్‌ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాటలు అందిస్తున్నారు.

తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్ తదితరులు

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డివోపీ: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved