pizza

Sid Sriram's Vennela Vennela Song From Aadi Saikumar’s Top Gear Is Out
ఆది సాయి కుమార్ టాప్ గేర్ నుంచి సిద్ శ్రీరామ్ మ్యాజికల్ మెలోడీ 'వెన్నెల వెన్నెల' సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >
Follow Us

25 November 2022
Hyderabad

Young and promising hero Aadi Saikumar is all set to enthrall us in Top Gear which is getting ready for its theatrical release. The film directed by K Shashikanth has already completed production formalities and post-production works are also happening at fast pace. As earlier, announced by the team, the movie will have a grand release worldwide on December 30th.

Promotions are in full swing for the movie and the team began the musical promotions on a superhit note by releasing the first single Vennela Vennela, composed mellifluously by Harshavardhan Rameshwar and crooned fascinatingly by the most happening singer Sid Sriram. The popular singer creates magic with his soulful vocals. ‘Saraswathi Putra’ Ramajogayya Sastry penned some beautiful lyrics for the song which is an instant hit. The song shows the beautiful chemistry of Aadi Saikumar and Riya Suman. They look adorable together on screen.

Billed to be a pucca action entertainer laced with thrilling elements, Aditya Movies & Entertainments is presenting the film. The movie is produced by K. V. Sridhar Reddy under the banner of Sri Dhanalakshmi Productions, while Giridhar Mamidipalli is the executive producer. Sai Sriram, who worked as a cinematographer for several superhit films, is working on the film.

Prawin Pudi, who has worked as an editor for many blockbusters like 'Julayi, Attarintiki Daaredi, S/O Satyamoorthy, Manam, Soggade Chinni Nayana', is the editor of this movie. Ramanjaneyulu is working as the Art Director.

Cast: Adi Saikumar, Riya Suman, Brahmaji, Satyam Rajesh, Mime Gopi, Narra, Shatru, Banerjee, Giridhar, Radio Mirchi Hemant etc.

Technicians:
Story, Screenplay, Direction: k Shashikanth
Presents: Aditya Movies & Entertainments
Producer: K. V. Sridhar Reddy
Banner: Sri Dhanalakshmi Productions
Executive Producer: Giridhar Mamidipalli
Cinematographer: Sai Sriram
Music: Harshavardhan Rameshwar
Editor: Prawin Pudi
Art: Ramanjaneyulu
Costume Designer: Manvi

ఆది సాయి కుమార్ టాప్ గేర్ నుంచి సిద్ శ్రీరామ్ మ్యాజికల్ మెలోడీ 'వెన్నెల వెన్నెల' సాంగ్ రిలీజ్

వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమా తో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి K శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. రెడ్ FM ఆఫీసులో ఆది సాయి కుమార్ సహా చిత్ర యూనిట్ అంతా కలిసి ఈ సాంగ్ విడుదల చేశారు.

ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'వెన్నెల వెన్నెల' పాటను నేడు (నవంబర్ 25) సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఈ పాటలో సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట మెలోడీయస్ గా సాగుతూనే యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సాంగ్ లోని సన్నివేశాలు, మ్యూజిక్ పాటకు ప్రాణం పోశాయి.

ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి అప్డేట్స్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసి సినిమాపై హైప్ పెంచేయగా.. తాజాగా విడుదల చేసిన ఈ వెన్నెల వెన్నెల సాంగ్ ఆసక్తి నెలకొల్పింది. ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుంది.

నటీనటులు
ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు

టెక్నీషియన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: K శశికాంత్
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: రామాంజనేయులు
కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి
బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్
ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved