pizza

Rocking Star Yash and Tara Sutaria Reveal a New Layer of Raya and Rebecca's Story in Toxic's Madhosh
రాకింగ్ స్టార్ యష్, తారా సుతారియా 'టాక్సిక్' ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ 'మనసాగదే' రిలీజ్

You are at idlebrain.com > news today >

21 July 2026
Hyderabad

Following the phenomenal success of Tabaahi, Monster Mind Creations, KVN Productions and Zee Music Company present the film's second song, with Yash and Tara Sutaria taking center stage.

Following the record-breaking response to Tabaahi, Toxic: A Fairy Tale for Grown-Ups returns with Madhosh, the film's second song that unveils a new shade of love. While Tabaahi celebrated the intoxicating rush of passion, Madhosh turns inward, embracing quieter emotions—tenderness, yearning and everything left unsaid. Expanding the emotional landscape of Toxic, the song reminds us that every love story is layered, with each chapter revealing a different shade of love.

Featuring Rocking Star Yash alongside Tara Sutaria, Madhosh presents Raya and Rebecca's relationship through a completely different lens. Their chemistry carries a playful ease, yet underneath it lies emotional conflict and unspoken longing. Raya remains the same man audiences met in Tabaahi, but the way he loves Rebecca reveals a softer, more carefree side of him, while hinting at the chaos he continues to carry within.

Composed by the acclaimed trio of Tanishk Bagchi, Arslan Nizami, and Faheem Abdullah, the romantic anthem is brought to life by the soulful vocals of Siddharth Basrur, who lends his voice across all five language versions. Released as a true pan-Indian offering, the song is titled Madhosh (Hindi), Manamohaka (Kannada), Manasaagadhe (Telugu), Thadumaarudheyyy (Tamil), and MadhuMohini (Malayalam). The lyrics have been crafted by celebrated writers Pramod Maravanthe (Kannada), Arslan Nizami and Syed Murad Gilani (Hindi), RamaJogaiah Sastry (Telugu), Vignesh Shivan (Tamil), and Rajeev Govindan (Malayalam). Starring Yash, Nayanthara, Kiara Advani, Tara Sutaria, Rukmini Vasanth, and Huma Qureshi, Toxic: A Fairy Tale for Grown-Ups brings together a powerhouse ensemble cast.

Speaking about the track, composer Tanishk Bagchi said,"Madhosh is incredibly close to our hearts since Arslan, Faheem and I have come together once again, and it's even more special because it's for a film as massive as Toxic. We also had the pleasure of collaborating with the immensely talented Siddharth Basrur, who brought so much depth to the song. The track beautifully captures the emotional journey of Raya and Rebecca’s characters, expressing love, longing, and the playful nuances of romance. We hope audiences connect with its heartfelt emotions as much as we enjoyed creating it."

Speaking about the track, playback singer Siddharth Basrur said,”Madhosh isn't just about heartbreak, it's about everything that's left unsaid between two people. There's longing and vulnerability running through the song, and I wanted the vocals to reflect that honesty rather than just the pain. It's emotional, but it also has a certain intensity that keeps building, which is what makes it such a special track for me."

Written by Yash and Geetu Mohandas and directed by Geetu Mohandas, Toxic: A Fairy Tale for Grown-Ups is shot in Kannada and English, with dubbed versions across Hindi, Tamil, Telugu, Malayalam, and several other languages. Produced by KVN Productions and Monster Mind Creations, the film is set to release in theatres on August 26, 2026

రాకింగ్ స్టార్ యష్, తారా సుతారియా 'టాక్సిక్' ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ 'మనసాగదే' రిలీజ్

రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' నుంచి విడుదలైన తొలి పాట 'తబాహీ' రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ మేకర్స్ రెండో పాట 'మనసాగదే' (తెలుగు వెర్షన్)ను విడుదల చేశారు. మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ కలిసి ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి.

'తబాహీ' ప్రేమలోని ఉప్పొంగే ఉద్వేగాలను చూపిస్తే, 'మనసాగదే' మాత్రం ప్రేమలోని మరో కొత్త కోణాన్ని ప్రజెంట్ చేసింది. మనసులో దాచుకున్న భావాలు, తీరని తపన, మౌనంగా మిగిలిపోయిన ప్రేమను ఈ పాట ఎంతో అందంగా పలికిస్తుంది. ప్రతి ప్రేమకథలో ఎన్నో భావోద్వేగాల పొరలు ఉంటాయని, ప్రతి దశ ప్రేమకు కొత్త అర్థాన్ని ఇస్తుందని ఈ పాట చెబుతోంది.

ఈ పాటలో యష్, తారా సుతారియా రాయా, రెబెకా పాత్రల మధ్య బంధాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించారు. వీరిద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ, ఎమోషన్స్ కట్టిపడేసింది. 'తబాహీ' లో కనిపించిన రాయా పాత్ర ఈసారి మనసులో నడుస్తున్న సంఘర్షణను కూడా సూచిస్తుంది.

తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి సిద్ధార్థ్ బస్రూర్ తన వోకల్స్ టప్ ప్రాణం పోశారు. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట తెలుగు వెర్షన్‌కు 'మనసాగదే' టైటిల్‌ తో రిలీజ్ చేశారు.

తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. హిందీలో 'మధోష్', కన్నడలో 'మనమోహక', తమిళంలో 'తడుమారుధేయ్', మలయాళంలో 'మధుమోహిని' పేర్లతో ఈ పాట విడుదలైంది.

ఈ చిత్రంలో యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ పాట గురించి సంగీత దర్శకుడు తనిష్క్ బాగ్చి మాట్లాడుతూ, "'మధోష్'' మా ముగ్గురికీ ఎంతో ప్రత్యేకమైన పాట. అర్స్లాన్, ఫహీమ్, నేను మరోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. 'టాక్సిక్'లాంటి భారీ చిత్రానికి సంగీతం అందించడం మరింత సంతోషంగా అనిపించింది. సిద్ధార్థ్ బస్రూర్ ఈ పాటకు తన గాత్రంతో అద్భుతమైన భావోద్వేగాన్ని తీసుకొచ్చారు. రాయా, రెబెకా పాత్రల ప్రేమ, తపన, రొమాన్స్‌లోని అందమైన భావాలను ఈ పాట అందంగా చూపించింది. ప్రేక్షకులు ఇందులో భావోద్వేగాలకు కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాం" అన్నారు.

ప్లేబ్యాక్ సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ మాట్లాడుతూ.. "'మధోష్' ఇద్దరి మధ్య చెప్పలేకపోయిన భావాల గురించి చెప్పే పాట. ఇందులో ప్రేమ, తపన అన్నీ కలిసి ఉంటాయి. ఆ నిజాయితీ నా వాయిస్ లో వినిపించాలని ప్రయత్నించాను. పాటలో భావోద్వేగాలతో పాటు క్రమంగా పెరిగే ఇంటన్సిటీ వుంటుంది. అదే ఈ పాటను నాకు మరింత ప్రత్యేకంగా మార్చింది"

యష్, గీతు మోహన్‌దాస్ కలిసి కథను అందించగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు భాషల్లో డబ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
ohsukumari-prereleaseevent s