Your Ticket to Hell Arrives as Toxic Makers Unveil Rocking Star Yash’s Transformed 2nd Look from the Film
‘టాక్సిక్’ మేకర్స్ నుంచి ‘టికెట్ టు హెల్’ – రాకింగ్ స్టార్ యష్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన రెండో లుక్ విడుదల
The makers of Toxic: A Fairy Tale For Grown Ups have once again detonated the internet — this time by handing audiences their very own Ticket to Hell. The striking new poster unveils Rocking Star Yash in an avatar no one saw coming, with a sharper descent into the film’s volatile world. The clean-shaven look poster introduces Ticket — also played by Yash in the film — marking his second look from the movie and setting the stage for what appears to be a gripping double-role narrative.
His bearded look as Raya was revealed earlier, and it was all the rage, dominating fan art, reels, and theory threads. Arriving like a curveball, this clean-shaven look is set to repeat history. The superstar's transformation in the earlier revealed teaser has already taken social media by storm, turning anticipation for the film into a full-blown worldwide fever.
The response to the teaser has been electric and explosive, with the asset trending on YouTube in 9 countries, along with India, underlining the film’s massive global pull. But beyond the numbers, what’s truly remarkable is the scale of discussion it has sparked. Fans are dissecting the 1 minute 56 second teaser frame by frame — debating timelines, speculating whether the narrative unfolds across different eras, and crafting elaborate theories about how the two characters might intersect. In just under two minutes, Toxic has given audiences endless material to decode, discuss, and deep-dive into — turning a teaser drop into a full-fledged cinematic conversation.
In the Tamil belt, it has captured the imagination of millions across Sri Lanka, Singapore, and Malaysia. Across the Hindi belt, it is dominating Oman, Saudi Arabia, Kuwait, Bangladesh, and Bahrain. Back home, the buzz is just as powerful, with the teaser trending across multiple Indian states, cementing Toxic as a true pan-Indian and worldwide phenomenon.
Letting go of his iconic beard — long tied to his larger-than-life image — Yash’s Ticket avatar surprised audiences. Sleek and intimidating, the clean-shaven look deepens intrigue around the two characters, as the teaser stormed to 197 million views in 24 hours, with fans flooding timelines with frame-by-frame breakdowns, decoding hidden details, and the film’s expansive world-building — particularly the final 20 seconds that left everyone stunned.
Written by Yash and Geetu Mohandas and directed by Geetu Mohandas, Toxic: A Fairytale for Grown-Ups has been shot simultaneously in Kannada and English, with dubbed versions releasing across Hindi, Telugu, Tamil, Malayalam, and more, positioning the film on a global stage. Produced by Venkat K. Narayana and Yash under KVN Productions and Monster Mind Creations, Toxic is set to hit theatres on March 19, 2026.
‘టాక్సిక్’ మేకర్స్ నుంచి ‘టికెట్ టు హెల్’ – రాకింగ్ స్టార్ యష్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన రెండో లుక్ విడుదల
‘టాక్సిక్: ఎ ఫెయిరీ’ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్ర నిర్మాతలు మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేశారు — ఈసారి ప్రేక్షకులకు ‘టికెట్ టు హెల్’ని అందించారు. తాజాగా విడుదలైన స్ట్రైకింగ్ పోస్టర్‌లో రాకింగ్ స్టార్ యష్ ఎవరూ ఊహించని కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ క్లీన్-షేవ్ లుక్ పోస్టర్‌లో యష్ పోషిస్తున్న మరో పాత్ర ‘టికెట్’ను పరిచయం చేశారు — ఇది చిత్రంలోని ఆయన రెండో లుక్. వీటిని బట్టి చూస్తుంటే గ్రిప్పింగ్ డబుల్ రోల్ తో అద్భుతమైన కథ సిద్ధమైనట్టు అర్థమవుతోంది.
ఇంతకుముందు విడుదలైన యష్ గడ్డం లుక్ ‘రాయా’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఫ్యాన్ ఆర్ట్, రీల్స్, థియరీ థ్రెడ్స్ లో ట్రెండ్ అయింది. ఇప్పుడు సడన్ గా రిలీజ్ అయిన ఈ క్లీన్-షేవ్ లుక్ కూడా అదే చరిత్రను మళ్లీ రిపీట్ చేయబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముందుగా విడుదలైన టీజర్‌లో యష్ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో తుఫాను సృష్టించి, సినిమాపై ఉన్న అంచనాలను ప్రపంచవ్యాప్తంగా పీక్స్‌కు తీసుకెళ్లింది.
టీజర్‌కు వచ్చిన స్పందన ఎలక్ట్రిక్‌గా, ఎక్స్‌ప్లోసివ్‌గా ఉంది. యూట్యూబ్‌లో భారతదేశంతో పాటు 9 దేశాల్లో ట్రెండ్ అవుతూ, ఈ సినిమాకు ఉన్న గ్లోబల్ రీచ్‌ను చాటిచెప్పింది. సంఖ్యలకే పరిమితం కాకుండా, టీజర్ చుట్టూ సాగుతున్న చర్చల స్థాయి మరింత విస్తృతంగా కనిపిస్తోంది. కేవలం 1 నిమిషం 56 సెకన్ల టీజర్‌ను అభిమానులు ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషిస్తున్నారు. కథ వివిధ కాలాల్లో సాగుతుందా? రెండు పాత్రలు ఎలా కలుస్తాయి? అనే అంశాలపై అనేక థియరీలను సృష్టిస్తున్నారు. రెండు నిమిషాల లోపే ‘టాక్సిక్’ ప్రేక్షకులకు అంతులేని చర్చలకు దారి తీసింది.
తమిళ బెల్ట్‌లో ఇది శ్రీలంక, సింగపూర్, మలేషియా దేశాల్లో మిలియన్ల మంది మనసులు గెలుచుకుంది. హిందీ బెల్ట్‌లో ఒమాన్, సౌదీ అరేబియా, కువైట్, బంగ్లాదేశ్, బహ్రెయిన్ దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మన దేశంలోనూ పలు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతూ, ‘టాక్సిక్’ను నిజమైన పాన్-ఇండియన్ మరియు గ్లోబల్ ఫెనామెనన్‌గా నిలబెట్టింది.
తన ఐకానిక్ గడ్డాన్ని వదిలేసి యష్ చేసిన ఈ ‘టికెట్’ అవతార్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. చూడ్డానికి నాజూగ్గా ఉన్నా మరోవైపు భయపెడుతున్న ఈ క్లీన్-షేవ్ లుక్ రెండు పాత్రల మధ్య ఉన్న మిస్టరీని మరింతగా పెంచింది. టీజర్ కేవలం 24 గంటల్లో 197 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా చివరి 20 సెకన్లు అందరినీ షాక్‌కు గురిచేసి, ఫ్యాన్స్ టైమ్‌లైన్‌లను ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషణలతో నింపేశాయి.
యష్, గీతూ మోహన్‌దాస్ సంయుక్తంగా రచించిన ఈ చిత్రాన్ని గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ సినిమాను కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఏక సమయంలో చిత్రీకరించగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళం తదితర భాషల్లో డబ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ మరియు యష్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.