pizza

Trivikram congratulates Pulagam Chinnarayana for penning 'Janapada Brahma' B. Vittalacharya’s authentic history
జానపద బ్రహ్మ విఠలాచార్య చరిత్రను అక్షరబద్ధం చేసిన పులగం చిన్నారాయణకు కంగ్రాట్స్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

You are at idlebrain.com > news today >
Follow Us

1 October 2023
Hyderabad

'Janapada Brahma' B. Vittalacharya’s folklore films are known to one and all. Telugu movie lovers hold the yesteryear filmmaker in high esteem, thanks to his tireless work that has been admired by people down the generations. Senior journalist and writer Pulagam Chinnarayana, a passionate film lover himself, has written a book named 'Jai Vittalacharya' to introduce the legend's style and cinematic treatment to the new generation. The book encapsulates Vittalacharya's journey comprehensively and meticulously. Zeelan Basha Shaikh has published this book under the auspices of Movie Volume Media. The book launch event was held today in the presence of star director and 'Matala Mantrikudu' Trivikram Srinivas today. The first copy was received by Ravi Padi, the senior civil servant and bureaucrat with the Indian Railways.

Speaking on the occasion, Trivikram Srinivas appreciated Pulagam Chinnarayana, whom he has known for years. "I have read his earlier books as well. Vittalacharya is the Father of Telugu Mass Cinema and the Father of Folklore Cinema. Before the VFX era, he was a great technologist who made adventurous and ambitious films in his heyday. Neither his immense success ratio, nor the reach of his movies, nor his popularity is known to the present generation. Most of today's generation doesn't know him except because of YouTube or the satellite channels that broadcast old movies. I wholeheartedly appreciate the efforts by Chinnarayana to bring out his life and works. Congratulations to him, Ravi and publisher Zeelan Basha Shaikh. Bringing such books is not a profitable business. It shows their love for the cinema. As a person who loves books, I hope that such efforts will increase a book-reading culture among people. In Telugu writing, recording history is not widespread. The history of Telugu cinema is an area that has not been explored thoroughly so far. Pulagam Chinnarayana should write more books. He has that energy and interest. So, I sincerely want to write books like this," the director-writer said.

Pulagam Chinnarayana said, "I wrote this book as fast as Vittalacharya used to make movies. Superstar Krishna garu, Kaikala Satyanarayana garu, Jamuna garu, Vani Sri garu, Rajasree garu, Jaya Malini garu, and Narasimha Raju garu, among other titans, have been introduced for this book. Also, I talked to the family members of Vittalacharya and learned about him personally. I have prepared this book with behind-the-scenes features of 39 movies directed by the iconic filmmaker. Besides, several interesting anecdotes and pieces of info have been documented for the first time ever. I am very happy that this book launch program has been held in the presence of Trivikram, who is very fond of movies and Telugu literature."

Ravi Padi said, "The cover page of this book is made with the final painting of Eshwar garu, the senior Publicity Designer and a recipient of the Raghupathi Venkaiah Award. I am happy to receive the first copy of this book at the hands of Trivikram. Pulagam Chinnarayana researched extensively in writing this tome. He is writing the history of Telugu cinema and wants to bring out more books."

Movie Volume Media's Zeelan Basha Shaikh said, "Being in journalism, I am proud to step up to publish this book. Superstar Krishna unveiled the cover page of this book. It is a memory I will always cherish. Thanks to Trivikram for being here today for the launch."

జానపద బ్రహ్మ విఠలాచార్య చరిత్రను అక్షరబద్ధం చేసిన పులగం చిన్నారాయణకు కంగ్రాట్స్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తీశారాయన. విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించి... 'జై విఠలాచార్య' పుస్తకాన్ని తీసుకొచ్చారు. 'మూవీ వాల్యూమ్ మీడియా' ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు.  

'జై విఠలాచార్య' పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ''పులగం చిన్నారాయణ నాకు బాగా పరిచయం. ఆయన రాసిన ఇంతకు ముందు పుస్తకాలు కూడా నేను చదివా. ఇప్పుడు విఠలాచార్య గారిపై పుస్తకం రాశారు. విఠలాచార్య అంటే ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమా, ఫాదర్ ఆఫ్ జానపదాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వీఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ వంటి వాటికి అన్నిటి కంటే ముందు... తెలుగు సినిమా మొదలైన రోజుల్లో చాలా అడ్వెంచరస్ గా సినిమా తీసిన గొప్ప సాంకేతిక నిపుణుడిగా ఆయనను చూస్తాను. ఆయన సక్సెస్ రేషియో గానీ, ఆయన తాలూకూ రీచ్ గానీ, ఆయన పాపులారిటీ గానీ ఇప్పుడున్న తరానికి, ప్రస్తుతం చాలా మందికి తెలియదు. యూట్యూబ్ లేదా పాత సినిమాలు ప్రసారం చేసే ఛానళ్లలో చూడటం తప్ప ఆయన గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన జీవితం, ప్రస్థానాన్ని జనం ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పులగం చిన్నారాయణ గారికి, రవి గారికి, పబ్లిషర్ జిలానీ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఇటువంటి పుస్తకాలు తీసుకు రావడం లాభసాటి వ్యాపారం కాదు. సినిమాపై వాళ్ళకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. పుస్తకాలు అంటే అభిమానించే వ్యక్తిగా ఇటువంటి ప్రయత్నాలు బావుండాలని, ప్రజల్లో పుస్తక పఠనం బాగా పెరగాలని కోరుకుంటున్నా. చరిత్రను రికార్డ్ చేయడం అనేది తెలుగులో తక్కువ. తెలుగు సినిమా చరిత్ర చాలా తక్కువగా అందుబాటులో ఉంది. పులగం చిన్నారాయణ గారు ఇంకా ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలి. ఆయనకు ఆ శక్తి, ఆసక్తి... రెండూ ఉన్నాయి కాబట్టి పుస్తకాలు ఇలాగే రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ''విఠలాచార్య గారు సినిమాలు తీసినంత వేగంగా యి పుస్తకం రాశాను. సూపర్ స్టార్ కృష్ణ గారు, కైకాల సత్యనారాయణ గారు, జమున గారు, వాణీశ్రీ గారు, రాజశ్రీ గారు, జయమాలిని గారు, నరసింహ రాజు గారు ... ఇలా ఎందరో అతిరథ మహారథులతో ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూలు చేశా. అలాగే, విఠలాచార్య గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను. తెలుగులో విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన 39 సినిమాల తెరవెనుక విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇప్పటి వరకు ఎక్కడ లేని సమాచారంతో ఈ పుస్తకం రెడీ చేశా. సినిమాలు, సాహిత్యంపై విపరీతమైన అనురక్తి ఉన్న త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.   

సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి మాట్లాడుతూ ''సీనియర్ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత ఈశ్వర్ గారి ఆఖరి పెయింటింగ్ తో ఈ పుస్తకం కవర్ పేజీ రూపొందింది. త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకం తొలి ప్రతిని అందుకోవడం సంతోషంగా ఉంది. పులగం చిన్నారాయణ గారు ఎంతో పరిశోధన చేసి... ఎంతో మందిని కలిసి విఠలాచార్య గారిపై పుస్తకం తీసుకు వచ్చారు. తెలుగు సినిమా చరిత్రను అక్షరబద్ధం చేస్తున్న ఆయన మరిన్ని పుస్తకాలు తీసుకు రావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. 

షేక్ జీలాన్ బాషా మాట్లాడుతూ ''జర్నలిజంలో ఉన్న నేను ఈ పుస్తకంతో పబ్లిషర్ గా అడుగు పెడుతున్నందుకు గర్వంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ పుస్తకం కవర్ పేజీ ఆవిష్కరించారు. అదొక మరపురాని అనుభూతి. ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్ గారికి థాంక్స్'' అని చెప్పారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved