VENKATESH - TRIVIKRAM | THE MOST MAGICAL COMBO TAKES ITS FIRST STEP TOWARDS AN ENTHRALLING JOURNEY
సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది
The two most celebrated names of Telugu cinema Venkatesh and Trivikram Srinivas have officially joined forces. The much awaited project was launched today with a traditional pooja ceremony and it’s a beginning of what guarantees to be a memorable outing for audiences.
This collaboration has been the talk of the industry for a while and for good reason. Watching Venkatesh step into a character shaped by Trivikram’s unique storytelling arc is an exciting prospect for cinephiles. Known for his impeccable command over family entertainers that brings emotional depth, Trivikram is expected to bring yet another engaging and universally appealing film to the big screens..
Produced by S. Radha Krishna (Chinababu) under the prestigious Haarika & Hassine Creations banner. Film will go on floors soon.
Camera switch on by Suresh Babu added a special moment to the launch event.
With a combination as rare and magical as this, expectations are already sky high. Fans and film lovers alike will be eager to see what unfolds when Venkatesh’s Mark in Trivikram’s signature storytelling on the silver screen.
సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చిత్రం కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు ప్రసిద్ధులు ఎట్టకేలకు కొత్త సినిమా కోసం చేతులు కలిపారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. దీంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచే చిత్రానికి తొలి అడుగు పడింది.
సినీ వర్గాలతో పాటు, ప్రేక్షకులలో కూడా వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో సినిమా పట్ల ఎంతో ఆసక్తి ఉంది. త్రివిక్రమ్ యొక్క ప్రత్యేకమైన కథా శైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేష్ ను చూడటం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో త్రివిక్రమ్ పేరుగాంచారు. ఇప్పుడు త్రివిక్రమ్ మరో ఆకర్షణీయమైన, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.
సుప్రసిద్ధ హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇది అరుదైన, మాయాజాల కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. త్రివిక్రమ్ శైలి కథలో వెంకటేష్ ను వెండితెరపై చూడటానికి అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.