pizza

Tyson Naidu birthday poster
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి స్పెషల్ బర్త్ డే యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

3 January 2026
Hyderabad

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈరోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తుపాకీని పట్టుకొని, శత్రువుల వైపు గురిపెట్టి నిల్చున్న ఈ పోస్టర్ అదిరిపోయింది. అతని ఇంటెన్స్సిటీ, మజల్డ్ ఫిజిక్, నెక్స్ట్ లెవల్ యాక్షన్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్టర్ సాగర్ కె చంద్ర.

టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ముఖేష్ జ్ఞానేష్/అనిత్ డీవోపీ వ్యవహరిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ సినిమా యాక్షన్ కోరియోగ్రఫీ చేస్తున్నారు.

తారాగణం: శ్రీనివాస్ బెల్లంకొండ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సాగర్ కె చంద్ర
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: హరీష్ కట్టా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ముఖేష్ జ్ఞానేష్/అనిత్
ఆర్ట్: అవినాష్ కొల్లా
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved