|

5 January 2019
Hyderabad
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `వినయ విధేయ రామ`. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా అనౌన్స్ మెంట్ రోజూ నుండి భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ....
స్టార్ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - `మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో `వినయవిధేయరామ` సినిమాను ప్రకటించినప్పటి నుండి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మెగాభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. మాస్ ఆడియెన్స్‌ను, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను, మెగాభిమానులను మెప్పించేలా సినిమాను బోయపాటిగారు తెరకెక్కించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో సినిమాను విడుదల చేస్తున్నాం`` అన్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రిషి పంజాబి, అర్థర్ ఎ.విలన్స్ సినిమాటోగ్రఫీ అందించారు.
|
|
|
|
|