pizza

“Dekhlenge Saala” song from ‘Ustaad Bhagat Singh’ Has Created History - Breaking records with over 29.6 million views in just 24 hours!
24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో సంచలనం సృష్టించిన ‘దేఖ్‌లేంగే సాలా’

You are at idlebrain.com > news today >

14 December 2025
Hyderabad

The Dekhlenge Saala song from Ustaad Bhagat Singh has created history, breaking records with over 29.6 million views in just 24 hours! The song has become an instant hit, going viral on social media and captivating audiences worldwide.

DSP's catchy composition and the team's hard work have paid off, earning widespread acclaim. Dinesh Master's choreography, tailored perfectly for Pawan Kalyan, has received huge applause. Bhaskarabhatla's motivational and commercial blend of lyrics has proved to be a massive success.

The efforts of Cult Captain Harish Shankar have resulted in a visual treat for fans, convincing Pawan Kalyan to dance and delivering a massive feast. The song's success is also attributed to the tireless efforts of Art Director Anand Sai, Costume Designer Neeta Lulla, and Cinematographer Ravi Varman, who have collectively created a vibrant and visually stunning experience.

The team behind Dekhlenge Saala has truly delivered an unforgettable experience, and we congratulate them on this phenomenal success!

Sung by Vishal Dadlani, Haripriya Lyrics Baskarabatla Music by Rockstar Devi Sri Prasad Choreography by Dinesh Master

24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో సంచలనం సృష్టించిన ‘దేఖ్‌లేంగే సాలా’

'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలై శ్రోతలను ఉర్రుతలూగిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించి, తక్షణ హిట్ గా నిలిచింది.

దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉండి, సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే, పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్ సమకూర్చిన నృత్యరీతులు కూడా భారీ ప్రశంసలను అందుకుంటున్నాయి. ఇక ప్రేరణాత్మకమైన, వాణిజ్యపరమైన అంశాల కలయికలో భాస్కరభట్ల రాసిన సాహిత్యం పాట విజయంలో కీలక పాత్ర పోషించింది.

‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవర్ స్టార్ అభిమానులకు హరీష్ శంకర్ విందు:
‘దేఖ్‌లేంగే సాలా’ పాట ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంగీతం విషయంలో ఆయనకు మంచి అభిరుచి ఉంది. హరీష్ శంకర్ గత చిత్రాలలోని పాటలు వింటే ఆ విషయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా 'గబ్బర్ సింగ్' చిత్రంలోని పాటలు ఎంతటి ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటికీ ఆ పాటలు మారుమోగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఆ తరహా పాటలలో, ఆ తరహా నృత్యంతో చూడాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. వారి కోరికను నెరవేర్చడానికి ‘దేఖ్‌లేంగే సాలా’ పాటకు శ్రీకారం చుట్టారు హరీష్ శంకర్. ఆయన కృషి ఫలితంగానే ఈ పాట అభిమానులకు విందు భోజనంలా మారి, ఇంతటి ఆదరణ పొందుతోంది.

ఈ పాట విజయానికి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ల అవిశ్రాంత కృషి కూడా కారణమని చెప్పవచ్చు. వీరందరూ సమిష్టిగా పనిచేసి ఒక ఉత్సాహభరితమైన మరియు దృశ్యపరంగా అద్భుతమైన అనుభవాన్ని సృష్టించారు.

‘దేఖ్‌లేంగే సాలా’ వెనుక ఉన్న బృందం నిజంగా మరపురాని అనుభవాన్ని అందించింది. ఈ అద్భుతమైన విజయం పట్ల అన్ని వర్గాల నుంచి వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

పాట వివరాలు:
గానం: విశాల్ దద్లానీ, హరిప్రియ
సాహిత్యం: భాస్కరభట్ల
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కొరియోగ్రఫీ: దినేష్ మాస్టర్

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా తదితరులు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సి. చంద్రమోహన్
కూర్పు: కార్తీక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రావిపాటి చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నబకాంత, పృథ్వీ

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved