pizza
Powerful & Entertaining Trailer of Ustaad Bhagat Singh Unveiled
You are at idlebrain.com > news today >
Follow Us

14 March 2026
San Francisco

Amidst sky-high expectations, the makers of Ustaad Bhagat Singh have released its much-awaited trailer, and it promises a complete entertainer packed with power, action, and fun.

Pawan Kalyan looks in top form and delivers his trademark charisma throughout the trailer. From punchy dialogues to high-voltage action blocks and entertaining moments, every element lands effectively, taking the hype around the film to the next level.

Director Harish Shankar once again proves his strength in crafting mass entertainers and presenting Pawan Kalyan in the way fans love to see him on the big screen.

The trailer cut is sharp, engaging, and perfectly sets the tone for what promises to be a full-fledged feast for fans and movie lovers in theatres. With the excitement building rapidly, Ustaad Bhagat Singh is gearing up to deliver a memorable cinematic experience on the big screen.

Ustaad Bhagat Singh is prestigiously being produced by Naveen Yerneni and Y.Ravi Shankar under Mythri Movie Makers and is slated for a grand release on March 19th.

Cast: Pawan Kalyan, Sreeleela, RaashiiKhanna, Parthiban & Others

Technical Crew:

Written-Directed by: Harish Shankar.S
Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili
Music: Devi Sri Prasad
Background Score: Thaman S
Screenplay: K Dasharath, Ramesh Reddy
Additional writing: Praveen Varma and Chandramohan.
Editing: Karthika Srinivas Production Designer: Anand Sai CEO: Cherry
Executive Producers: R Chandrasekhar, Dinesh Narasimhan
Creative Producer: Harish Pai
Fights : Ram Laxman, Nabakanth, Prudhvi

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి పవర్‌ఫుల్ & ఎంటర్‌టైనింగ్ ట్రైలర్ విడుదల

'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. పవర్, యాక్షన్, వినోదంతో నిండిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ను ట్రైలర్ వాగ్దానం చేస్తోంది.

ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్‌లో కనిపిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్ అంతటా తన ట్రేడ్‌మార్క్ కరిష్మాను ప్రదర్శించారు. పంచ్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వినోదభరితమైన క్షణాలు.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.

దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. వెండితెరపై అభిమానులు చూడాలనుకునే విధంగా పవన్ కళ్యాణ్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో తన సత్తా నిరూపించుకున్నారు.

ట్రైలర్ కట్ చాలా షార్ప్‌గా, ఆకర్షణీయంగా ఉంది. థియేటర్లలో అభిమానులు, సినీ ప్రియులకు ఈ చిత్రం పూర్తి స్థాయి వినోద విందును అందించబోతుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. రోజు రోజుకీ సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం వెండితెరపై గుర్తుండిపోయే సినీ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి మార్చి 19వ తేదీన 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో అడుగుపెట్టనుంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved