
26 May 2023
Hyderabad
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: 10వ తరగతిలో పేపరు లీకేజీలు - గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ
నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ “యూనివర్సిటీ” రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 9న రిలీజ్ అవుతోంది అన్నారు.
నటీనటులు - ఆర్. నారాయణ మూర్తి మరియు నూతన తారాగణం.
పాటలు - గద్దర్ - నిస్సార్ - మోటపలుకులు రమేష్ - వేల్పుల నారాయణ.
గాయకులు - గద్దర్ - జల్డంకి సుధాకర్ - సాయిచరణ్ - గోస్కుల రమేష్ - పల్లె నరసింహం
ఎడిటింగ్ - మాలిక్
కెమెరా - బాబూరావు దాస్
కథ-స్క్రీన్ ప్లే - మాటలు - సంగీతం - దర్శకత్వం - నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి