Promotions for the film Uppukappurambu are in full swing ahead of its release on Amazon Prime on the 4th of this month. As part of the campaign, Suhas, Keerthy Suresh, director Sashi, and producer Radhika sat down for an interview with Idlebrain Jeevi. They answered several interesting questions about the film and their experiences.
Keerthy Suresh shared that she plays the role of a village Sarpanch in this film and that this is her first time acting in a satirical comedy genre. She said she loved the script and the uniqueness of the story. When Mahanati was brought up in conversation, Keerthy said it was through that film that she properly learned Telugu. She dubbed for 11 days for Mahanati, but for Uppukappurambu, she completed her dubbing in just five days. Except for Nenu Sailaja, she revealed she has dubbed for all her Telugu films herself. She also noted that her films dubbed in Hindi have been getting a lot of viewership on OTT platforms.
When asked by Jeevi about why he chose a de-glam role like this while he’s still rising as a romantic hero, Suhas replied that the content felt very fresh and different to him. He said he had never come across a story like this before and wanted to showcase variety in the roles he plays. He added that while his role is serious, it generates comedy naturally.
Director Sashi, who previously made Ninnila Ninnila in Telugu, said this film explores various shades of human behavior. Producer Radhika explained that due to the post-COVID challenges faced by theaters, they decided to take a cautious approach and opted for a direct OTT release in multiple languages to reach a wider audience. She added that every producer dreams of releasing their film in theaters, but practical decisions must be made.
Keerthy also noted that director Sashi is the son of legendary Malayalam filmmaker IV Sasi, who even directed Rajinikanth in a film. She shared that her mother had also worked with IV Sasi, adding a personal connection to the project.
'మహానటి' తోనే తెలుగు బాగా నేర్చుకున్నా- కీర్తి సురేష్
'ఉప్పుకప్పురంబు' సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల నాలుగో తేదీన విడుదల కానుంది. అందులో భాగంగా ఐడిల్ బ్రెయిన్ జీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో హీరోయిన్లు సుహాస్, కీర్తి సురేష్, దర్శకుడు శశి, నిర్మాత రాధికలు పాల్గొన్నారు. జీవి అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చింది చిత్ర యూనిట్. కీర్తి సురేష్ మాట్లాడుతూ ఈ సినిమాలో సర్పంచ్ పాత్రలో నటిస్తున్నానని, ఇలాంటి సెటైరికల్ కామెడీ జోనర్ లో మొదటిసారిగా నటిస్తున్నాని, తనకీ కథ చాలా బాగా నచ్చిందన్నారు. మాటల మధ్యలో మహానటి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ సినిమా ద్వారానే తెలుగు బాగా నేర్చుకున్నానన్నారు. ఆ సినిమాకు 11 రోజుల పాటూ డబ్బింగ్ చెప్పానన్నారు. కానీ ఉప్పుకప్పురంబు సినిమాకు కేవలం అయిదు రోజులోనే తన డబ్బింగ్ పూర్తిచేశానని, నేను శైలజ సినిమాకు తప్ప మిగిలిన తన అన్ని సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పానన్నారామె. హిందీలో తన సినిమాలను OTT లో ఎక్కువగా చూస్తున్నారన్నారు కీర్తి సురేష్.
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టైంలో ఒకవైపు రొమాంటిక్ హీరో పాత్రలు చేస్తూ ఇటువంటి డీ గ్లామర్ పాత్రలో కనిపించడానికి కారణం ఏంటన్న జీవి ప్రశ్నకు సమాధానంగా తనకీ కంటెంట్ చాలా కొత్తగా అనిపించిందని, ఇలాంటి విభిన్నమైన కథను ముందెన్నడూ వినలేదని, తను చేసే పాత్రల్లో తేడాలు చూపించాలన్న ఉద్దేశ్యమే అని చెప్పారు హీరో సుహాస్. ఇందులో తన పాత్ర సీరియస్ గా ఉండి కామెడీ పండిస్తుందన్నారు.
దర్శకుడు అని మాట్లాడుతూ తన మొదటి సినిమా 'నిన్నిలా నిన్నిలా' తెలుగులోనే చేశానన్నారు. ఈ సినిమాలో మనుషుల విభిన్న కోణాలను చూపించామన్నారు. కోవిడ్ తరువాత ధియేటర్ల పరిస్థితి బాగోలేకపోవడంతో, ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుందని, అంతేకాకుండా ఎక్కువ మందికి చేరాలన్న ఉద్దేశ్యంతో వివిధ భాషల్లో ఈ సినిమాను డైరెక్ట్ గా OTT లో రిలీజ్ చేస్తున్నామన్నారు నిర్మాత రాధిక. ఏ నిర్మాతకైనా తన సినిమాను థియేటర్ తెరకు తీసుకువెళ్లాలనే ఆశపడతారన్నారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ ఈ సినిమా దర్శకుడు అని శశి ప్రముఖ మలయాళీ దర్శకుడు IV శశి గారి కుమారుడని, IV శశి రజిని కాంత్ గారి సినిమాకు కూడా దర్శకత్వం చేశారని, తన తల్లి కూడా IV శశి గారితో వర్క్ చేశారని చెప్పుకుంటూ వచ్చారు.