కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగులోనూ యూనానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన 'వాలా 2' తెలుగులో ఈ నెల 24న థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ యూనానిమస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నిర్వహించారు. ఈ వేడుకకు సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్, హీరో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
సక్సెస్ మీట్ లో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘వాలా2 ’ టీమ్ అందరికీ అభినందనలు. ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్‌తో పికప్ అయింది. షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఇలాగే అన్ని షోలు ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులకు చాలా మంచి మనసుంది. అన్ని సినిమాలు చూస్తారు, ప్రోత్సహిస్తారు. మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు. మంచి సినిమాను అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సాహు గారు ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. మీ అందరి సపోర్ట్ తో తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నిఖిల్ త్వరలో ‘స్వయంభూ’తో వస్తున్నారు. ఆయనకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్.
నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నేను ఈ సినిమా థియేటర్‌లో చూసాను. ప్రతి క్యారెక్టర్‌ను చూసి చాలా ఎంజాయ్ చేశాను. థియేటర్‌కు వెళ్లినప్పుడు.. మెల్లగా థియేటర్ మొత్తం హౌస్‌ఫుల్ అయింది. ఇది పెద్ద సక్సెస్. ఒక ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడం అంత ఈజీ కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. నేను కడుపుబ్బ నవ్వుకున్నాను. కొన్ని కామెడీ బ్లాక్స్ అదిరిపోయాయి. ప్రతి క్యారెక్టర్ చాలా సహజంగా కనిపించింది. హ్యాపీడేస్ మలయాళంలో మంచి ఆదరణ పొందింది. అక్కడకి వెళ్ళినపుడు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది మంచి జకాలేజ్ స్టొరీ. వాలా కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి ఆదరణ పొందడం ఆనందంగా వుంది. మలయాళంలో పెద్ద హిట్. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నాను. తెలుగు డబ్బింగ్ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ సావిన్ గారు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. సాహు గారపాటి గారు వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆయన విజయాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధిస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి. తేజ్ బ్రదర్ ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సంబరాల ఏటిగట్టు పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ సావిన్ ఎస్.ఏ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఇంతగా ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. సాహు గారపాటి గారి వల్లే ఇది సాధ్యమైంది. అందరూ థియేటర్‌లో చూసి ఈ సినిమాను మరింత మందికి చేరవేయాలని కోరుకుంటున్నాను.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మా సినిమాను ఇంతగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న అందరికీ ధన్యవాదాలు. రామ్ చరణ్ గారు, రామ్ పోతినేని గారు, నాగ చైతన్య గారు, ఆర్జీవీ గారు సోషల్ మీడియాలో ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. నిఖిల్ గారు సినిమా చూసి ఈ వేడుకకు రావడం, సాయి దుర్గ తేజ్ గారు హాజరవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతోంది. మలయాళంలో గొప్ప విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా ప్రతి షోకు ఆదరణ పెరుగుతోంది. ఈ విజయాన్ని అందించిన అందరికీ మరోసారి ధన్యవాదాలు.
యాక్టర్ హషీర్ మాట్లాడుతూ:అందరికీ నమస్కారం. సాహు గారికి, నిఖిల్ గారికి, సాయి గారికి ధన్యవాదాలు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.
అలన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. సాయి గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు ఎంతో మంచి స్పందన ఇచ్చారు. ఇక్కడ మా సినిమా సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.
మరియా మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
వినాయకన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ వేడుకకు విచ్చేసిన నిఖిల్ గారికి, సాయి గారికి ధన్యవాదాలు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
దేవరాజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. తెలుగులో ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోసారి అందరికీ కృతజ్ఞతలు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.