pizza

Ashwin Babu Creates Hype with a Thrilling Vachinavaadu Gautham Teaser
థ్రిల్లింగ్ టీజర్ తో హైప్ క్రియేట్ చేసిన అశ్విన్ బాబు

You are at idlebrain.com > news today >

16 May 2025
Hyderabad

Tollywood’s young hero Ashwin Babu is steadily moving forward in his own style by choosing unique storylines. His latest film, “Vachinavadu Gautam,” has already generated massive expectations with the recently released teaser. The film is being produced on a grand scale by T. Ganapathi Reddy under the Aruna Sri Entertainments banner, and directed by Mamidala M.R. Krishna.

The teaser kicks off with a powerful voice-over by Manoj Manchu, delivering the impactful line:

“When righteousness loses its way… when no other form arrives… Gautam comes.”

This dialogue sets a gripping action tone right from the start, and the teaser hooks the audience from the very first frame.

Ashwin Babu’s portrayal of Gautam appears powerful, intense, and mysterious. His body language and action timing are thrilling the viewers. The teaser showcases action sequences that feel fresh, while the emotional intensity hints at the depth of the story.

Director Mamidala M.R. Krishna seems intent on presenting this not as a routine action entertainer, but as a film with a unique concept — a vision clearly evident from the teaser. Cinematographer M.N. Baal Reddy elevates the visuals, blending action and thrill seamlessly.

Gowra Hari’s background score adds an intense layer to the teaser. The technical standards reflect high production values.

“Vachinavadu Gautam” isn’t just an action thriller — it’s a full package of mystery, emotion, and action.

With its upcoming release, the film has already promised — through the teaser — to offer Tollywood audiences a new cinematic experience.

థ్రిల్లింగ్ టీజర్ తో హైప్ క్రియేట్ చేసిన అశ్విన్ బాబు

టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’. తాజాగా విడుదలైన చిత్రం టీజర్‌తోనే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టి. గణపతి రెడ్డి భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకుడు.

"ధర్మం దారి తప్పినప్పుడు... ఏ అవతారం రానప్పుడు... వచ్చినవాడు గౌతమ్" అంటూ మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ డైలాగ్ తో టీజర్ మొదలైయింది. ఈ డైలాగ్‌తో టీజర్ ఓ యాక్ష్ మూడ్‌ను సెట్ చేస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచే టీజర్ కట్టిపడేస్తుంది.

గౌతమ్ పాత్రలో అశ్విన్ బాబు కనిపించిన తీరు పవర్‌ఫుల్, ఇంటెన్స్, మిస్టీరియస్ గా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్‌, యాక్షన్ టైమింగ్ అన్నీ ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తదనాన్ని పంచుతుండగా, ఎమోషనల్ ఇంటెన్సిటీ కథలో ఉన్న డెప్త్‌ను తెలియజేస్తుంది.

దర్శకుడు మామిడాల ఎం.ఆర్. కృష్ణ ఈ చిత్రాన్ని ఓ రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కాకుండా, కొత్త కాన్సెప్ట్‌తో తెరపై తీసుకురావాలని టీజర్ నుంచే అనిపిస్తున్నారు. టీజర్ విజువల్స్‌ని మించిపోయేలా ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ యాక్షన్ థ్రిల్‌ని కలిపి చూపిస్తుంది.

గౌర హరి అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ఇంటెన్స్ ని ఇచ్చింది. టెక్నికల్ స్టాండర్డ్స్ చూస్తేనే సినిమా నిర్మాణ విలువలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో స్పష్టమవుతోంది.

‘వచ్చినవాడు గౌతమ్’ సినిమా కేవలం యాక్షన్‌ థ్రిల్లర్ మాత్రమే కాదు, మిస్టరీ, ఎమోషన్, యాక్షన్..ఆల్ ఇన్ వన్ ప్యాకేజీ.

త్వరలో విడుదలకాబోతున్న ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌కి తీసుకెళ్తుందని ఇప్పటికే టీజర్ ద్వారా హామీ ఇచ్చింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved