`
pizza

Thalapathy Vijay, Vamshi Paidipally, Dil Raju’s Varisu/Vaarasudu Theatrical Trailer Unveiled
దళపతి విజయ్- వంశీ పైడిపల్లి- దిల్ రాజు- 'వారసుడు' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

4 January 2023
Hyderabad

Thalapathy Vijay has done a perfect family entertainer after a long time and the movie Varisu/Vaarasudu directed by Vamshi Paidipally and produced on a massive scale by Dil Raju, Shirish, Param V Potluri and Pearl V Potluri under the banners of Sri Venkateswara Creations and PVP Cinema is scheduled for Pongal release.

The makers today unveiled the theatrical trailer of the movie that reveals the plot of the film. It tells the story of a joint family headed by father Sarathkumar who has three sons. But he doesn't mention anything about his third son, played by Vijay. The conflict derives when a business rival of Sarathkumar played by Prakash Raj wants to take down the entire family. As the family gets devastated, the protagonist has to use his mind and muscle to bring harmony back to the family. As the trailer suggests, the film is a wholesome entertainer laced with elements of family sentiments, action, masala, and love. Rashmika Mandanna appeared as Vijay’s love interest.

Vijay’s screen presence is remarkable and he looked stylish all through. He gave his hundred percent with superfluous energy and sharp dialogue delivery. Rashmika Mandanna is good as the leading lady. The screen looked complete and colorful with the presence of many noted actors. Jayasudha played Vijay’s mother, while Srikanth and Shaam appeared as his brothers.

Director Vamshi Paidipally who is proficient in churning out family entertainers has made Varisu/Vaarasudu as a perfect festival movie for Sankranthi. The writing part is exceptional, wherein he made the narrative more engaging with his stylish and flawless taking. He presented Vijay in a first-of-its-kind role. There are some powerful dialogues in the trailer. “Power is not in the seat sir, the man who comes and sits in that seat wields the power. My power is one of a kind," uttered by Vijay is one among them.

He also got the best output from his technicians- music director S Thaman, cinematographer Karthick Palani, and editor KL Praveen. The production standards are very high. The trailer has set the bar too high on the movie.

Vamshi Paidipally along with Hari and Ashishor Solomon wrote the story. Harshith Reddy and Sri Hanshitha are the co-producers of the film. Sunil Babu & Vaishnavi Reddy are the production designers.

Cast: Vijay, Rashmika Mandanna, Prabhu, Sarath Kumar, Prakash Raj, Jayasudha, Srikanth, Shaam, Yogi Babu, Sangeetha and Samyuktha

Technical Crew:
Director: Vamshi Paidipally
Story, Screenplay: Vamshi Paidipally, Hari, Ashishor Solomon
Producers: Dil Raju, Shirish, Param V Potluri & Pearl V Potluri
Banner: Sri Venkateswara Creations, PVP Cinema
Co-Producers: Sri Harshith Reddy, Sri Hanshitha
Music Director: S Thaman
DOP: Karthick Palani
Editing: KL Praveen
Dialogues & Additional Screenplay: Vivek
Production Designers: Sunil Babu & Vaishnavi Reddy
Ex-Producers: B Sreedhar Rao & R Udayakumar
Make-Up: Nagaraju
Costumes: Deepali Noor
Publicity Designs: Gopi Prasanna
VFX: Yugandhar
Digital Media: Nani

దళపతి విజయ్- వంశీ పైడిపల్లి- దిల్ రాజు- 'వారసుడు' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

వారసుడు నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'వారసుడు' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వారసుడు' థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ''ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా.. వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదు కదా'' అని జయసుధ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ .. ఆద్యంతం ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనుభూతిని ఇచ్చింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో పండక్కి విందు భోజనం లాంటి సినిమా వారసుడు అనే నమ్మకానన్ని ఇచ్చింది ట్రైలర్.

విజయ్ ఎంట్రీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. తలైవ, రంజితమే పాటలలో విజయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అవుట్ స్టాండింగా గా వున్నాయి. విజయ్ యాక్షన్, డైలాగ్స్, ఎమోషన్స్ ఎక్స్ టార్డినరీగా వున్నాయి. విజయ్- రష్మిక ల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. విజయ్ కి తండ్రిగా శరత్ కుమార్, తల్లిగా జయసుధ, బ్రదర్స్ గా శ్రీకాంత్, కిక్ శ్యామ్ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ లో శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, షామ్ పాత్రలు ఆసక్తి కరంగా వున్నాయి. ప్రకాష్ రాజ్ పాత్ర రూపంలో విజయ్ కుటుంబానికి ఒక పెద్ద సవాల్ ఎదురౌతుంది. ఆ సవాల్ ని ఎదుర్కొని కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనేదిచాలా క్యూరియాసిటీగా చూపించారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో నిష్ణాతుడైన దర్శకుడు వంశీ పైడిపల్లి సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీగా 'వారసుడు'ని రూపొందించారు. అద్భుతమైన రైటింగ్, తన స్టైలిష్, ఫెర్పెక్ట్ టేకింగ్‌తో కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచారు వంశీ పైడిపల్లి. విజయ్‌ని గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేశారు.

''పవర్ సీట్లో వుండదు సర్.. అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో వుంటుంది. మన పవర్ ఆ రకం'' .

''గ్రౌండ్ లో ఎంతమంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు. కానీ ఆడియన్స్ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా.. ఆట నాయకుడిని''

''ప్రేమో, భయమో నాకు ఇచ్చేటప్పుడు కొంచెం అలోచించి ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా దానికి ట్రిపుల్ గా తిరిగిచ్చేస్తాను'' లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ట్రైలర్ లో అద్భుతంగా పేలాయి.

ట్రైలర్ కు ఎస్ థమన్ ఎక్స్ టార్డినరీ నేపధ్య సంగీతం అందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, డ్యాన్స్ నెంబర్స్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ప్రతి మూడ్ ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. కార్తీక్ పళని కెమరాపని తనం మరో అదనపు ఆకర్షణ. విజువల్స్ అన్నీ రిచ్ గా వున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. సినిమాని అత్యున్నతంగా తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. మొత్తానికి ట్రైలర్ తో వారసుడు పై అంచనాలు మరింత భారీగా పెరిగాయి.

తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్
మేకప్: నాగరాజు
కాస్ట్యూమ్స్: దీపాలి నూర్
పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న
వీఎఫ్ఎక్స్: యుగంధర్
డిజిటల్ మీడియా: నాని

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved