pizza

Veera Simha Reddy in Anantapur
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ 'వీరసింహారెడ్డి' అనంతపురం షూటింగ్ షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం

You are at idlebrain.com > news today >
Follow Us

8 November 2022
Hyderabad

The filming of Nandamuri Balakrishna-starrer Veera Simha Reddy is in the final leg. Starting from tomorrow, the film will be shot in different parts of Anantapur, where the film is set, for five days. According to the makers, the film will be shot at Penna Ahobilam Lakshmi Narasimha Swamy temple tomorrow followed by shooting in Amidala, Raketla and Uravakonda on Thursday and Friday. The Anantapur leg will conclude on Sunday with Penukonda Fort hosting the shoot over the weekend. With the makers announcing the scheduled itinerary, expect a sea of crowd descending to the venue and chanting Jai Balayya slogans.

A commercial action drama with a lot of emotions and a touch of humour, Veera Simha Reddy is set in faction backdrop, primarily focusing on the solid rivalry between the hero and the villain (played by Kannada heavyweight Duniya Vijay).

To open in cinema halls later this Sankranti, the film, written and directed by Gopichand Malineni, features Varalaxmi Sarathkumar, Naveen Chandra, Lal, Murali Sharma and Easwari Rao in supporting roles, while Shruti Haasan and Honey Rose are paired opposite Balayya, who is playing dual roles of a father and a son. Produced by Mythri Movie Makers, the film is a Thaman musical.

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ 'వీరసింహారెడ్డి' అనంతపురం షూటింగ్ షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ, గోప్‌చంద్ మలినేని ల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved