pizza

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy’s First Single Jai Balayya On Nov 25th
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ 'వీరసింహారెడ్డి' ఫస్ట్ సింగిల్ జై బాలయ్య నవంబర్ 25న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

23 November 2022
Hyderabad

Natasimha Nandamuri Balakrishna’s mass action entertainer Veera Simha Reddy being helmed by Gopchand Malineni under Mythri Movie Makers is getting ready to offer Sankranthi feast. The film’s shoot is presently taking place in Hyderabad.

The makers are delighting fans by coming up with updates on a regular basis. The makers are all set to begin the musical promotions. The film’s first single Jai Balayya will be launched on November 25th.

Jai Balayya is a slogan chanted by Balakrishna fans on many occasions and there was a song with the slogan in Akhanda. S Thaman who scored the superhit song has scored yet another mass number Jai Balayya, this time for Veera Simha Reddy. It’s another bonanza for Nandamuri fans.

Balakrishna looks royal in the announcement poster in a white shirt and white pants with kanduva around his shoulders. Sporting shades, Balakrishna flashes a pleasant smile here. He is seen riding the tractor, while his supporters follow him. The song actually begins with the lines- Rajasam Nee Inti Peru.

Shruti Haasan is playing the leading lady in this project and Duniya Vijay, and Varalaxmi Sarathkumar are the ensemble cast. Rishi Punjabi is taking care of cinematography.

Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while acclaimed writer Sai Madhav Burra has provided dialogues. National Award-Winning Craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that has fights by Ram-Lakshman duo and Venkat.

Veera Simha Reddy is set for a grand release worldwide for Sankranthi, 2023.

Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.

Technical Crew:
Story, Screenplay & Direction: Gopichand Malineni
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Thaman S
DOP: Rishi Punjabi
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Fights: Ram-Lakshman, Venkat
CEO: Chiranjeevi (Cherry)

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ 'వీరసింహారెడ్డి' ఫస్ట్ సింగిల్ జై బాలయ్య నవంబర్ 25న విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీరసింహారెడ్డి. గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది.

మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ లతో అభిమానులకు ఆనందపరుస్తున్నారు. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి అంతా సిద్ధం చేశారు. 'వీరసింహారెడ్డి' ఫస్ట్ సింగిల్ జై బాలయ్య నవంబర్ 25న లాంచ్ కానుంది. ఈ సందర్భంగా ''రాజసం నీ ఇంటి పేరు' అని పేర్కొంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ లుక్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ట్రాక్టర్ నడుపుతూ రాయల్ గా కనిపించారు బాలకృష్ణ.

చాలా సందర్భాల్లో బాలకృష్ణ అభిమానులు నినాదం 'జై బాలయ్య'. ఇదే నినాదంతో అఖండ లో పాట కూడా వచ్చింది. సూపర్‌హిట్ పాటను స్కోర్ చేసిన ఎస్ థమన్ ఈసారి వీరసింహారెడ్డి కోసం మరో మాస్ నంబర్ జై బాలయ్య ను స్కోర్ చేశారు. నందమూరి అభిమానులకు ఇది మరో బొనాంజా.

ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved