The objection that didn’t arise for other taglines came up for my 'The Vijay Devarakonda.' - Vijay Devarakonda
ఇతర ట్యాగ్ లైన్లకు రాని అభ్యంతరం నా 'ద విజయ్ దేవరకొండ' కు వచ్చింది. - విజయ్ దేవరకొండ
As part of Kingdom promotions, Vijay Devarakonda gave an interview to the renowned The Hollywood India Reporter. He shared that the film’s director, Gautham Tinnanuri, approached him with two stories, both of which he liked. However, one of the stories felt somewhat similar to another film being prepared at the time, and he felt that proceeding with it would go against his principles, as it could harm someone else’s project. For this reason, he gave the green light to the Kingdom story. He praised Gautham’s work ethic, calling it remarkable, and mentioned that Gautham only knows cricket and cinema. Reflecting on his early career, Vijay said he faced numerous challenges, such as uncertainties about whether his films would release, whether audiences would like them, or whether he would get another opportunity. He attributed overcoming those struggles to divine blessings and said that now, he wants to take on roles that resonate with his heart and leave a lasting impression on audiences.
He recalled that at the age of five, when his parents enrolled him in a boarding school, he learned how to face life independently. He noted that victories and defeats are a natural part of life, but he is not someone who stops out of fear of failure. He believes that failure teaches more lessons than success.
He expressed helplessness that nowadays, anything he says is twisted into propaganda by some, with people interpreting everything through the lens of financial gain. He feels unable to express opinions freely, which is why he has stopped giving interviews. He pointed out that while other actors use taglines before their names without issue, objections arose when he added 'The' before his name. He said he finds more joy in being recognized for the characters he plays in films than for his own name. He acknowledged that while the Telugu industry may not always be supportive, there are some who help their peers, citing Junior NTR as an example, who readily provided voice dubbing for his film without hesitation. He expressed his desire for every technician working on his films to gain recognition and for audiences to speak highly of them. Both personally and professionally, he prefers maintaining a positive outlook. He noted that his role in Arjun Reddy still remains etched in the audience’s memory.
ఇతర ట్యాగ్ లైన్లకు రాని అభ్యంతరం నా 'ద విజయ్ దేవరకొండ' కు వచ్చింది. - విజయ్ దేవరకొండ
కింగ్డమ్ ప్రమోషన్లో భాగంగా ప్రముఖ 'ది హాలీవుడ్ ఇండియా రీపోర్టర్' కు ఇంటర్వ్యూ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన దగ్గరకు రెండు కథలతో వచ్చాడని, ఆ రెండు కథలు తనకు బాగా నచ్చాయని, కానీ ఒక కథ అప్పుడు సిద్ధం అవుతున్న ఇంకో సినిమా కథకు కాస్త దగ్గరగా ఉన్నట్టు అనిపించడంతో, అలా చేసి ఇంకొకరి సినిమాకు నష్టం చేయడమన్నది తన నైజానికి వ్యతిరేకమని, అందుకనే కింగ్డమ్ కథకు పచ్చ జెండా ఊపానన్నారు. గౌతమ్ పనితీరు అద్భుతమన్నారు. అతనికి క్రికెట్ మరియు సినిమా మాత్రమే తెలుసన్నారు. తన కెరీర్ ఆరంభంలో "తన సినిమా రిలీజ్ అవుతుందా లేదా, రిలీజ్ అయినా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా, తరువాత మరో సినిమా అవకాశం వస్తుందా లేదా" లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. భగవంతుడి ఆశీస్సులతో ఆ కష్టాలను దాటి వచ్చానని, అందుకే ప్రస్తుతం తన మనసుకి నచ్చిన పాత్రలను, ప్రజల్లో గుర్తుండిపోయే లాంటి పాత్రలనే చేయాలనుకుంటున్నానన్నారు.
తనకు అయిదేళ్ల వయసున్నప్పుడు, తల్లితండ్రులు తనను బోర్డింగ్ స్కూల్లో లో చేర్పించినప్పుడే ఒంటరిగా జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయాన్ని నేర్చుకున్నానన్నారు. గెలుపోటములు అన్నవి జీవితంలో జరుగుతూనే ఉంటాయన్నారు. అలా అని ఓటమికి భయపడి ఆగిపోయే వ్యక్తిని కాదన్నారు. విజయం కంటే ఓటమే ఎక్కువ పాఠాలు నేర్పుతుందన్నారు.
ప్రస్తుతం ఏం మాట్లాడినా, అది కొందరికి లక్ష్యంగా చేసుకొనే ప్రాపగాండా అవుతుందని, తమకు అనుగుణంగా మలుచుకుంటూ, అన్నింటా ఆర్ధిక లాభాపేక్షనే కనిపిస్తుందన్నారు. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతున్నామన్నారు. అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా ఆపేశానన్నారు. మిగిలిన చాలామంది నటులు తమ పేర్లకు ముందు పెట్టుకున్న ట్యాగ్ లైన్లకు లేని అభ్యంతరం నా పేరుకి ముందు 'The' అని చేర్చినప్పుడు వచ్చిందన్నారు. తన పేరు కంటే సినిమాలో తన పాత్ర పేరు ద్వారా వచ్చే గుర్తింపులో చాలా సంతోషముంటుందన్నారు. తెలుగు పరిశ్రమలో ఎక్కువగా కాకపోయినా తోటి నటులకు సాయపడే మనుషులు కూడా కొంతమంది ఉన్నారని, దానికి ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాకు అడిగిన వెంటనే కాదనకుండా డబ్బింగ్ చెప్పారన్నారు. తన సినిమాల్లో పనిచేసే ప్రతి టెక్నీషియన్ కూడా గుర్తింపు సాధించడం, వాళ్ళ గురించి ప్రేక్షుకులు గొప్పగా చెప్పుకోవడం తనకిష్టం అన్నారు. వ్యక్తిగతంగా అయినా, వృత్తిపరంగా అయినా తన పట్ల పాజిటివ్ దృక్పథం కలిగేలా ఉండటం తనకు నచ్చుతుందన్నారు. 'అర్జున్ రెడ్డి' లో తన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల్లో గుర్తిండిపోయే ఉందన్నారు.