pizza

Venkatesh birthday poster from Sankranthi Vastunnam
దిల్ రాజు ప్రెజెంట్స్ 'సంక్రాంతికి వస్తున్నాం' నుంచి విక్టరీ వెంకటేష్ స్టైలిష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

12 December 2024
Hyderabad

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'తో అలరించబోతున్నారు. ఇది వారి సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హ్యాట్రిక్ మూవీ. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

రేపు (డిసెంబర్ 13) విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వెంకటేష్ డైనమిక్ అండ్ స్టైలిష్ అవతార్ లో కనిపించిన ఈ బ్రాండ్ న్యూ పోస్టర్ అదిరిపోయింది.

వెంకటేష్ బర్త్ డే సందర్భంగా రేపు 'సంక్రాంతికి వస్తున్నాం' సెకండ్ సింగిల్ ప్రోమోని అభిమానులకు కానుకగా ఇవ్వబోతోంది టీం.

ఈ చిత్రం ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ ట్రైయాంగిల్ క్రైమ్ కథలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved