Hero Venkatesh set the stage ablaze at NATS 2025, energizing his fans with exciting announcements about his upcoming films. Sharing his full lineup, he sparked interest among cine lovers, and the video has since been making the rounds across social media.
While many already knew that Venkatesh would be part of the upcoming Chiranjeevi-Anil Ravipudi film, the actor had never confirmed it publicly—until now. On the NATS stage, he officially revealed, "Yes, I’m doing a cameo in Chiranjeevi garu’s film. As you may have guessed, the role is going to be quite fun!" This announcement thrilled both Chiru and Venky fans alike.
He added that after Sankranthiki Vachestunnam, he would once again team up with Anil Ravipudi for another project.
Venkatesh also confirmed a film with Trivikram Srinivas in the works and stated that Drushyam 3 is in the pipeline as well. Adding further intrigue, he teased, "Along with these, I’ll be doing a massive project with a friend of mine—he’s a big star in the Telugu industry." Naturally, fans are now buzzing with speculation about who this mystery star could be.
Looking at this lineup, it’s clear that Venkatesh is ramping up the pace in his career, much to the delight of his fans.
'చిరు' తో సందడి చేస్తానన్న వెంకీ..!
హీరో వెంకటేష్ 'NATS -2025' వేదికగా తన అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. రానున్న తన సినిమాల లైనప్ మొత్తం చెప్పి సినీ అభిమానులకు తన సినిమాలపై ఆసక్తి నెలకొనేలా చేశారు. ఈ వీడియో నిన్నటి నుండి సోషల్ మీడియా మొత్తం చుట్టేసింది. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్లో సినిమా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్ నటిస్తున్నారన్న విషయం చాలామందికి తెలిసినా హీరో వెంకటేష్ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. "చిరంజీవి సినిమాలో క్యామియో చేస్తున్నానని, ఈ పాత్ర కూడా మీరు ఊహించినట్టే చాలా ఫన్నీగా ఉంటుందని" హీరో వెంకటేష్ నాట్స్ వేదికపై ప్రకటించేయడంతో అటు చిరంజీవి మరియు ఇటు వెంకటేష్ అభిమానుల్లోనూ జోష్ ని నింపింది. 'సంక్రాంతికి వస్తున్నాం' తరువాత మళ్ళీ అనిల్ రావిపూడితో సందడి చేయబోతున్నానన్నారు.
ఈ సినిమాతో పాటూ త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నానన్నారు. మీనాతో దృశ్యం 3 ఉండబోతుందన్నారు. "వీటితో పాటూ ఒక భారీ ప్రాజెక్టులో నా స్నేహితుడితో చేయబోతున్నా, ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్" అని హీరో వెంకీ చెప్పడంతో ఎవరా పెద్ద హీరో అన్న ఆసక్తి అభిమానులకు కలిగించేశారాయన. ఈ లైనప్ చూస్తుంటే తన సినిమాల వేగాన్ని పెంచినట్టే కనిపిస్తున్నారు హీరో వెంకటేష్.