pizza

Official Announcement on Lyca Productions’ Next directed by Jason Sanjay Vijay 
అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో దర్శకుడిగా పరిచయం అవుతోన్నకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్

You are at idlebrain.com > news today >
Follow Us

28 August 2023
Hyderabad

The diversified accomplishments in production, distribution, and distribution by Lyca Productions, with their unique content-driven and big-budget star projects, have captivated the viewers with ample entertainment. The production house has lined up an incredible league of projects with big names and young talents, scheduled at different stages of production. From the biggest blockbusters to the heart-warming entertainers, Lyca Productions assures non-stop entertainment to the audiences for the forthcoming years. One should not miss A Subaskaran's unique mastery of promoting young and new filmmakers who have achieved their ambitious aspirations of becoming successful filmmakers. Now the production house is elated to officially announce its new project, directed by debutant Jason Sanjay Vijay. 

Confirming the news, Producer A Subaskaran, Lyca Productions, says, “Lyca Productions has always strived with utmost faith on young and fresh minds, who we believe, are the game changers of any film industry. We are happy to announce that Mr. Jason Sanjay Vijay will direct our next project, which has a unique story premise and an engrossing experience. Jason has a perfect academic background in BA (Hons) Screenwriting in London followed by a Film Production Diploma at Toronto Film School. When he narrated the script, we were totally satisfied as it gave us a cinematic feel. It’s great to see that he has specialized in screenwriting and direction, but has understood the complete production, which we believe is an essential quality that every filmmaker should master. We are looking forward to a wonderful experience working with Jason Sanjay Vijay. The film will have emerging stars in its cast, and we are in talks with top-league technicians from the industry to be a part of this project.”

Director Jason Sanjay Vijay says, "It's an honor to get the opportunity to direct my first film for a prestigious production house like Lyca Productions. It has been a hub of encouraging talents and has created a stream of new filmmakers. I am glad that they liked my script, and have given me complete creative freedom to materialize it. We are now in talks with the emerging stars of the industry and some happening technicians. I thank Subaskaran sir for this opportunity, which gives me immense excitement and huge responsibility coalescing together. I also take this opportunity to thank Mr Tamil kumaran who had been of a very great support to visualise my dreams of being a director “.

Mr. Jason Sanjay Vijay pursued a Film Production Diploma at Toronto Film School (2018-2020) followed by a BA (Hons) in Screenwriting in London (2 Years Fast Track Course) during the timeline 2020-2022.

అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో దర్శకుడిగా పరిచయం అవుతోన్నకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన భారీ బడ్జెట్ చిత్రాలు, హృదయాలను ఆకట్టుకునే యూనిక్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తూ నిర్మాణ సంస్థగా, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. స్టార్ హీరోలు, దర్శకులతో పాటు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వరుస సినిమాలను రూపొందిస్తోంది లైకా. డిఫరెంట్ సినిమాలను అందించాలనుకునే యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయటంలో లైకా ప్రొడక్షన్ సుభాస్కరన్ ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ ''సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ నమ్ముతుంటుంది. మా బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషంగా ఉంది. తను చెప్పిన యూనిట్ పాయింట్ నచ్చింది. అలాగే సంజయ్ లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో బి.ఎ. (హానర్స్)ను పూర్తి చేశారు. అలాగే టోరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను కంప్లీట్ చేశారు. తను మా టీమ్ కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించింది. తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ లో స్పెషలైజేషన్ కోర్సులను చేయటం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ఫిల్మ్ మేకర్ కి ఇది ఉండాల్సిన లక్షణం. జాసన్ సంజయ్ విజయ్ తో కలిసి వర్క్ చేయటం ఓ వండర్ ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు'' అన్నారు.

డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ ''లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం. దాన్ని రూపొందించే క్రమంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు వారు తెలియజేయటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి థాంక్స్. ఇది నాకెంతో ఎగ్జయిట్ మెంట్ తో పాటు పెద్ద బాధ్యత. ఇదే సందర్భంలో నాకెంతో సపోర్ట్ అందించిన తమిళ్ కుమరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అన్నారు.

జాసన్ సంజయ్ విజయ్ టోరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి ప్రొడక్షన్ డిప్లొమా (2018 -2020)ను కంప్లీట్ చేశారు. అలాగే లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో (రెండేళ్లు ఫాస్ట్ ట్రాకింగ్ కోర్స్) బి.ఎ. హానర్స్ (2020-2022)ను కంప్లీట్ చేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved