pizza

Viraaji will impress the audience as a good movie: Producer Mahendra Nath Kondla
ఒక మంచి చిత్రంగా 'విరాజి' ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల

You are at idlebrain.com > news today >

25 July 2024
Hyderabad

Varun Sandesh is gearing up for his next film on August 2nd. His new project is titled Viraaji. Produced by Mahendra Nath Kondla under the M3 Media banner in association with Maha Movies, Viraaji marks the directorial debut of Adhyanth Harsha.

In his interaction with the media today, Producer Mahendra Nath spoke about the film:

Excerpts:

- Viraaji is the second film produced by our company. We previously did the movie 'Sabari' with Varalaxshmi Sarathkumar; the film was released on a pan-India level. Now, we have produced Viraaji with Varun Sandesh as the hero. Since the announcement of the film's title, Viraaji has been getting a good response.

- Varun Sandesh's look and the trailer are becoming popular with the audience. Our friend Sukumar introduced us to Director Adhyanth Harsha. The way he narrated the story impressed me, and every scene was impressive. Moreover, on set, he directed it equally well.

- Varun Sandesh's last movie, Nindha, received a good response. We believe this will be an advantage for our Viraaji movie. Initially, we considered two or three options for the hero character, but I wanted a lead man who would not only act but also support me throughout the film. As a new producer, I felt it would be better to have a hero who could provide such support. Varun Sandesh, having a US background, has a dialogue delivery style that suits Viraaji well.

- We have worked on a social aspect. We produced the movie Viraaji with commercial elements. It features other artists like Raghu Karumanchi and Pramodini. However, since the hero is the main crowd-puller, we are promoting the movie with his photo. Varun's get-up will also be new, and you have to see why in the theater.

- On the 2nd of this month, we announced the August 2nd release. We have set aside a month for promotions. Meanwhile, some movies have announced that they will release on August 2nd. Movies keep coming out every week, but we believe that if there is quality content in our movie, it will definitely become popular. That's why we are not postponing our release date.

- Viraaji has good content. It is believed that everyone who has seen the movie will say it is good. It is impossible to predict the range of its success. Mythri Movie Distributors are releasing it in Nizam. They saw the movie and said it was good. They asked who the director was. Positive feedback was also received from censor board members. The movie is 100 minutes long and has been given a UA certificate. Viraaji will be released in 100 theaters.

- In our banner, we are currently making a good love story, a youthful entertainer, with Big Boss Amardeep and actress Surekha Vani's daughter Supritha. The shoot is 50 percent complete. We aim to release it by the end of the year.

ఒక మంచి చిత్రంగా 'విరాజి' ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల

- మా సంస్థలో నిర్మించిన రెండో చిత్రం విరాజి. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా చేశాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాం. ఇప్పుడు వరుణ్ సందేశ్ హీరోగా విరాజి నిర్మించాం. సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

- వరుణ్ సందేశ్ లుక్ తో పాటు ట్రైలర్ కు ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. మా స్నేహితుడు సుకుమార్ ద్వారా దర్శకుడు ఆద్యంత్ హర్ష పరిచయం అయ్యారు. ఆయన కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఆకట్టుకునేలా చెప్పాడు. చెప్పడమే కాదు సెట్ లో కూడా అంతే బాగా తెరకెక్కించాడు.

- వరుణ్ సందేశ్ గత సినిమా నింద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అది మా విరాజి సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నాం. ముందు హీరో క్యారెక్టర్ కు ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. అయితే నాకు హీరోగా నటించి వెళ్లిపోయే వారు మాత్రమే కాకుండా నాకు సినిమా మొత్తం సపోర్ట్ చేసే హీరో కావాలని అనుకున్నాను.

- ఎందుకంటే నేను కొత్త నిర్మాతను. నాకు అలా సపోర్ట్ చేసే హీరో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. వరుణ్ సందేశ్ యూఎస్ నేపథ్యం ఉన్ పర్సన్. అతని డైలాగ్ డెలివరీ విధానం విరాజికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.

- మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో విరాజి సినిమాను నిర్మించాం. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదినీ వంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. అయితే హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతని ఫొటోతోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనేది థియేటర్ లో చూడాలి.

- ఈ నెల 2వ తేదీన మేము ఆగస్టు 2 రిలీజ్ అని అనౌన్స్ చేశాం. నెల రోజులు ప్రమోషన్స్ కు పెట్టుకున్నాం. ఇంతలో కొన్ని సినిమాలు ఆగస్టు 2న రిలీజ్ అని ప్రకటించాయి. ప్రతివారం సినిమాలు వస్తూనే ఉంటాయి. మన సినిమాలో కంటెంట్ ఉంటే తప్పకుండా ఆదరణ పొందుతుంది అని మేము బిలీవ్ చేస్తున్నాం. అందుకే మా డేట్ ను పోస్ట్ పోన్ చేయడం లేదు.

- విరాజిలో మంచి కంటెంట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంటుందని అంటారనే నమ్మకం ఉంది. ఏ రేంజ్ సక్సెస్ అనేది ఇప్పుడే చెప్పలేం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్లు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. వాళ్లు సినిమా చూసి బాగుందని చెప్పారు. డైరెక్టర్ ఎవరు అని అడిగారు. సెన్సార్ వాళ్ల నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. 100 మినిట్స్ మూవీ. యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 100 థియేటర్స్ పైనే మా విరాజి సినిమా రిలీజ్ కు వస్తోంది.

- మా సంస్థలో ప్రస్తుతం బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా ఓ మంచి లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాం. అది 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఏడాది చివరలో రిలీజ్ అనుకుంటున్నాం. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved