pizza

"Even the censor board that was initially scared to watch 'Virgin Boys' later appreciated it." – Producer Raja Darapuneni
"Cinema is not my life." – Actress Mitraaw Sharma
'వర్జిన్ బాయ్స్' చూడటానికి భయపడిన సెన్సార్ వాళ్ళే తరువాత మెచ్చుకున్నారు. - నిర్మాత రాజా దారపునేని
సినిమా ఒక్కటే నా జీవితం కాదు. .. హీరోయిన్ మిత్రా శర్మ

You are at idlebrain.com > news today >

08 July 2025
Hyderabad

As part of the promotions for Virgin Boys, producer Raja Darapuneni and actress Mitraaw Sharma gave an interview to Idlebrain. Both answered several interesting questions regarding the film.

Producer Raja clarified that Virgin Boys is not an adult film. He said the film isn’t targeted only at youth but is made to appeal to audiences of all age groups. He also mentioned that he has started gaining a fan base and that the giveaways such as money rain and iPhones were his way of giving back, not just a promotional gimmick. The idea was inspired after watching Kubera, he said, and he believes in the joy of giving rather than taking. Contrary to assumptions, he clarified that the money isn’t just thrown around randomly—it’s distributed respectfully.

He also revealed that a sequel titled Virgin Girls is on the way. Raja noted that initially, the censor board was hesitant to even watch Virgin Boys and asked if the title could be changed. However, after watching the film, they appreciated it.

Actress Mitraaw Sharma shared that she came to Hyderabad in 2014 and has no parents. She said she worked as a child artist for channels like Star, Zee, and Colors during her time in Mumbai. According to her, cinema is just one part of her life, not her whole world.

Since 2016, she has been involved in a housekeeping services business, which faced many hurdles in its early stages. She recalled how some refused to rent office space to women and how she used to stand at the Film Nagar junction to send daily wage workers to offices. She takes pride in overcoming all those struggles.

Mitraaw said she has a desire to do something for the differently-abled and believes that what God has given her should be shared in service to others. "I’m solo—how much can I eat alone? How many clothes can I wear? I can’t wear four pairs of shoes or ten dresses at once, right?" she said, explaining her drive to help those around her.

She concluded that she liked the story of Virgin Boys and chose to do the film from her heart. She added that her next film is already in the works, and this time, she herself will be the producer.

'వర్జిన్ బాయ్స్' చూడటానికి భయపడిన సెన్సార్ వాళ్ళే తరువాత మెచ్చుకున్నారు. - నిర్మాత రాజా దారపునేని
సినిమా ఒక్కటే నా జీవితం కాదు. .. హీరోయిన్ మిత్రా శర్మ

'వర్జిన్ బాయ్స్' ప్రమోషన్లో భాగంగా ఆ చిత్ర నిర్మాత రాజా దారపునేని, హీరోయిన్ మిత్ర శర్మ ఐడిల్ బ్రెయిన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర ప్రశ్నలకు అంతే ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు నిర్మాత రాజా. తమ 'వర్జిన్ బాయ్స్' సినిమా బూతు సినిమా కాదని, ఈ సినిమా కేవలం యువతను దృష్టిలో ఉంచుకునే తీయలేదని, అన్ని వర్గాల వాళ్లకూ ఈ సినిమా నచ్చుతుందన్నారు. ఈ సినిమాతో తనకు కూడా అభిమానులు వచ్చేసారని, ఆ అభిమానానికి సంతోషించే రిటర్న్ గిఫ్టులు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే మనీ రెయిన్, ఐఫోన్లు బహుమతులుగా ఇవ్వడం లాంటివి చేస్తున్నానన్నారు. అంతేతప్ప సినిమా కోసం ఆకర్షించే పనిలో భాగంగా అవన్నీ చేయలేదన్నారు. 'కుబేర' చూసిన తరువాతనే తనకా ఆలోచన వచ్చిందని, లాక్కోవడం కంటే ఇవ్వడం లోనే చాలా సంతోషముంటుందన్నారు. అందరూ అనుకుంటున్నట్లు కాగితాల రూపంలో రాకుండా నోట్ల కట్టలొచ్చి పడతాయన్నారు. ఆ డబ్బులు ఇచ్చే విధానం కూడా గౌరవ రీతిలోనే ఉంటుందన్నారు. వర్జిన్ బాయ్స్ తరువాత తదుపరి సినిమా 'వర్జిన్ గర్ల్స్' ఉండబోతుందన్నారు. సెన్సార్ వాళ్ళు మొదట 'వర్జిన్ బాయ్స్' చూడటానికి భయపడిపోయారన్నారు. టైటిల్ మార్చడానికి అవుతుందా అని అడిగిన వాళ్ళే సినిమాను చూసిన తరువాత తమను మెచ్చుకున్నారన్నారు.

హీరోయిన్ మిత్రా శర్మ మాట్లాడుతూ.... 2014 లో హైదరాబాద్ కు వచ్చానని, తనకు తల్లి తండ్రులు లేరని, ముంబాయిలో ఉన్నపుడు స్టార్, జీ, కలర్స్ చానెళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అనుభవం తనకుందన్నారు. సినిమా అన్నది జీవితంలో తనకొక భాగం మాత్రమేనని, సినిమాయే తనకు జీవితం కాదన్నారు. 2016 నుండే హౌస్ కీపింగ్ సర్వీస్ బిజినెస్ లో ఉన్నానన్నారు. ఆ బిజినెస్ మొదలుపెట్టే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. ఆ క్రమంలో అమ్మాయిలకు ఆఫీసులులివ్వమని చాలా మంది తిరస్కరించిన రోజులను కూడా చూశానన్నారు. ఫిల్మ్ నగర్ జంక్షన్ లో నిలబడి, డైలీ లేబర్ ను అక్కడి నుండి ఆఫీసులకు పంపించేవాళ్లమన్నారు. అవన్నీ దాటుకొనే ఇక్కడిదాకా వచ్చానని చెప్పుకుంటూ వచ్చారు. వికలాంగులకు ఏదైనా చేయాలన్నతపన తనకుందని, భగవంతుడు తనకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి సేవ రూపంలో ఇవ్వాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. "తను సోలో అని, తనొక్కరినే ఎంత తినగలనని, ఎన్ని బట్టలు వేసుకోగలనని, ఒకేసారి నాలుగు షూలు, పది డ్రెస్సులు వేసుకోలేను కదా" అంటూ అందుకే చుట్టూ ఉన్న వారికి ఏదైనా చేయాలన్న ఆలోచన తనదన్నారు. వర్జిన్ బాయ్స్ కథ తన మనసుకు నచ్చే ఈ సినిమా చేశానన్నారు. దీని తరువాత ఇంకో సినిమాను చేయబోతున్నామని, ఆ సినిమాకు తనే నిర్మాతనన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved