pizza

“Ticket Konni – iPhone Gelavali!” – ‘Virgin Boys’ Trailer Launched Grandly, Set for July 11th Release
'టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు' అంటూ "వర్జిన్ బాయ్స్" ట్రైలర్ లాంచ్ - జూలై 11న థియేటర్లలో విడుదల

You are at idlebrain.com > news today >

05 July 2025
Hyderabad

The upcoming youthful entertainer ‘Virgin Boys’ is all set to hit theatres on July 11, under the banner of Raj Guru Films, produced by Raja Darapuneni and directed by Dayanand Gaddam, who also penned the story. Featuring a dynamic cast that includes Mitra Sharma, Geethanand, Srihan, Ronith, Jennifer Emmanuel, and Anshula in key roles, the film promises fun, friendship, and meaningful messaging.

The trailer of Virgin Boys was officially launched today,, in the presence of the film’s team and media. During the event, the makers revealed an exciting promotional offer — 11 audience members who purchase tickets will win brand-new iPhones! Adding to the excitement, selected theatres will feature a “Money Rain” experience, where real cash will shower down on the audience, and they get to keep it!

Actor Ronith said, “Director Dayanand and I are college friends, and it’s been our dream to make a film together. I thank the entire team for this opportunity. I believe Virgin Boys will breathe new life into small films. I hope everyone supports and blesses us by watching it in theatres on July 11.”

Actor Srihan added, “This film will surely entertain the youth. I thank the director and our producer for believing in me and encouraging me. I also want to urge young people to stay away from drugs and act responsibly. If you witness such issues, report them to the authorities.”

Producer Raja Darapuneni shared, “The title Virgin Boys perfectly suits the film. Our teaser and songs have already gone viral. Even without having big stars, we’ve received great support. We are coming to theatres on July 11 with many surprises.”

Director Dayanand said, “The film is inspired by real incidents from our college days. These kinds of stories are rare and highly relatable. I am blessed to have such a dedicated team. Smaran Sai’s music is a big bonus. The scenes between Geethanand and Mitra Sharma came out beautifully. This is a must-watch film for everyone on July 11.”

Actor Geethanand commented, “This movie will transport audiences into a fresh, entertaining world. I’ve worked on many projects with my brother before, and this cast & crew have given their all. This film will leave the youth inspired — true happiness doesn’t lie in intoxication, but in achieving something meaningful.”

Actress Mitra Sharma said, “I’m thrilled to have played a unique character in this film. Director Dayanand’s vision and our entire team’s hard work made this possible. Ronith and Srihan have given fantastic performances. This film holds a special place in my heart, and I’ll forever cherish working with such a supportive cast and crew.”

Cast:

Geethanand, Mitra Sharma, Srihan, Ronith, Jennifer Emmanuel, Anshula, Sujeeth Kumar, Bablu, Abhilash

Crew:
Director: Dayanand Gaddam
Producer: Raja Darapuneni
Banner: Raj Guru Films
Music: Smaran Sai
Editor: Marthand K. Venkatesh
DOP: Venkat Prasad
Lyrics: Poornachari
Singer: Aditya RK


'టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు' అంటూ "వర్జిన్ బాయ్స్" ట్రైలర్ లాంచ్ - జూలై 11న థియేటర్లలో విడుదల

రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈరోజు మీడియా సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం తెలిపింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురిసి ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపారు.

ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నేను దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందం అంతటికి నా ధన్యవాదాలు. అందరూ మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను. జులై 11వ తేదీన అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.

నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ... "వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకునికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాపై ఎంతో ఖర్చు పెట్టి నన్ను ఎంకరేజ్ చేసిన నిర్మాతకు నా ప్రత్యేక ధన్యవాదాలు. యువతను మెప్పించే చిత్రం వర్జిన్ బాయ్స్. అలాగే మత్తు పదార్థాలకు ఎవరు బానిసలు కాకండి. ఎవరైనా అటువంటి చర్యలు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సహకరించాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ... "వర్కింగ్ బాయ్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన మీడియా వారికి, అతిథులకు ధన్యవాదాలు. ఈ చిత్రానికి వర్తిన్ బాయ్స్ అనే టైటిల్ ఖచ్చితంగా సూట్ అయ్యే టైటిల్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఒక పాట ఎంతో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో పెద్దవారు ఎవరూ లేరు. అయినా ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఎన్నో సర్ప్రైజ్ లతో ఈ సినిమాతో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము" అన్నారు.

దర్శకుడు దయానంద మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నా థ్యాంక్స్. మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. చిత్రానికి చాలా మంచి బృందం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. స్మరణ్ సాయి సంగీతం ఈ చిత్రానికి బోనస్ గా నిలుస్తుంది. మా అన్నయ్య గీతానంద్ తో నాకు ఇది రెండవ చిత్రం. అలాగే గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చింది. జూలై 11వ తేదీన ప్రేక్షకులంతా చూడవలసిన సినిమా వర్జిన్ బాయ్స్" అన్నారు.

నటుడు గీతానంద్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలను ఇష్టపడుతున్నాను. ఈ సినిమా ప్రేక్షకులని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇప్పటికే నా తమ్ముడితో కలిసి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఒక సినిమా చేశాను. ఎంతో మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఈ చిత్రానికి పనిచేశారు. ఎంతో కష్టపడి ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని పూర్తి చేసాము. శ్రీహన్ వల్ల సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకు తర్వాత అందరికీ మంచి అవకాశాలు వస్తాయి. మిత్ర శర్మ ఈ సినిమాలో అద్భుతంగా పెర్ఫాం చేశారు. తన రోల్ సాధారణమైనది కాదు. అటువంటి రోల్ చేయాలంటే ఎంతో మెచ్యూరిటీ ఉండాలి. ఈ సినిమా యూత్ కు బయోపిక్ లాంటిది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాలలో ఉండదు. మనం ఏదైనా సాధించినప్పుడు వస్తుంది. ఈ సినిమా చూశాక ఎంత సంతృప్తితో బయటకు వెళ్తారు. జూలై 11వ తేదీన ఈ సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి" అన్నారు.

నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ముందుగా ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే ఎంతో మందితో కలిసి నాకు నటించే అవకాశం ఈ సినిమాతో రావడం సంతోషంగా అనిపించింది. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. చిత్రంలో ఇతని క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది. మనం కలిసి మరో చిత్రానికి పనిచేయాలని కోరుకుంటున్నాను. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. సినిమా చూసిన తర్వాత శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా నటించాడు. అతనితో కలిసి నటించడం ఎంతో సంతోషకరంగా అనిపించింది. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను మీ అందరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మా నిర్మాత రాజా గారు ఎంతో సహనం గలవారు. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మేము చేసిన కొన్ని మంచి పనులను చూసి ఆయన గొప్పగా చెప్పుకుని మురిసిపోతూ ఉంటారు. నిస్వార్థమైన వ్యక్తి. అలాగే ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ ముగించారు.

ఆర్టిస్టులు : గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్

డైరెక్టర్: దయానంద్
ప్రొడ్యూసర్ : రాజా దరపునేని
బ్యానర్ : రాజ్ గురు ఫిలిమ్స్
మ్యూజిక్ డైరెక్టర్: స్మరణ్ సాయి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
డీఓపి : వెంకట ప్రసాద్
లిరిక్స్- పూర్ణ చారి
సింగర్ - ఆదిత్య ఆర్ కె
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ - డిజిటల్ దుకాణం


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved