`
pizza

Virupaksha teaser: Atmospheric and thrilling
ప్ర‌శ్న ఎక్క‌డ మొద‌లైందో స‌మాధానం అక్క‌డే వెత‌కాలంటున్న సాయిధరమ్ తేజ్.. ఆసక్తిని పెంచుతోన్న మిస్టీక్ థ్రిల్ల‌ర్ ‘విరూపాక్ష’ టీజర్

You are at idlebrain.com > news today >
Follow Us

2nd March 2023
Hyderabad

The teaser of Sai Tej’s new film, Virupaksha, was released on Thursday. “This time, The Fight is against the unknown,” Tej wrote, dropping the teaser link on Twitter. A joint production venture between BVSN Prasad and Sukumar, the film is director Karthik Dandu’s second effort after Bham Bholenath. Sukumar has penned the screenplay.

Running over 1 minute 20 seconds, the teaser begins with a quaint little village in a forest area facing a never before incident, something that is causing unnatural deaths in the village. Running helter-skelter, the panic-stricken villagers, headed by Sai Chand, look to find a solution. Into this scenario enters Sai Tej, getting a get intro on a jeep. Now, it’s his battle with the unknown and he is keen to get to the bottom of it by understanding its source. It’s obvious that it takes a lot of him as he goes through a gamut of emotions. The teaser, while also introducing the characters of Brahmaji, Sunil and Rajeev Kanakala, is peppered with evil elements, black magic etc. The cinematography and background score increases its impact overall, promising a riveting mystic thriller.

Based on the superstitious beliefs of the late 70s, the film, to open in cinemas on April 21, sees Samyuktha Menon opposite Sai Tej, while Kantara composer B Ajaneesh Loknath is making his Telugu debut.

ప్ర‌శ్న ఎక్క‌డ మొద‌లైందో స‌మాధానం అక్క‌డే వెత‌కాలంటున్న సాయిధరమ్ తేజ్.. ఆసక్తిని పెంచుతోన్న మిస్టీక్ థ్రిల్ల‌ర్ ‘విరూపాక్ష’ టీజర్

‘చ‌రిత్ర‌లో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం ఇదే మొద‌టిసారి’ అని సాయిచంద్ ఓ విష‌యాన్ని గురించి ప్ర‌స్తావించాడు. అదే స‌మ‌యంలో ఓ జీపు అడ‌వి మార్గం గుండా ప్ర‌యాణించి ఓ భ‌వంతి ముందు ఆగుతుంది.

అదే స‌మ‌యంలో దీనికి ప‌రిష్కారం ఉందా? లేదా? అని ఓ వ్య‌క్తి సాయి చంద్‌ని ప్ర‌శ్నించ‌గా దీని నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి మ‌న‌కు ఒకే ఒక మార్గం ఉందని సాయిచంద్ మార్గాని చెబుతాడు. వెంట‌నే ఆ వ్య‌క్తి అస‌లేం జ‌రుగుతుందిక్క‌డ అని అడుగుతాడు. వెంట‌నే సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర‌ను మ‌న‌కు చూపిస్తారు. అస‌లు సాయిధ‌ర‌మ్ తేజ్‌కి..సాయిచంద్ చెబుతున్న స‌మస్య‌కు ప‌రిష్కారం ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘విరూపాక్ష‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష‌’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో విరూపాక్ష చిత్రాన్ని ఏప్రిల్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గురువారం విరూపాక్ష సినిమా టీజ‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేశారు. విరూపాక్ష టీజ‌ర్ గ‌మ‌నిస్తుంటే 1990లో జ‌రిగే క‌థ‌లో ఓ ప్రాంతంలోని ప్ర‌జ‌లు విచిత్ర‌మైన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. ప్ర‌శ్న ఎక్క‌డ మొద‌లైందో స‌మాధానం అక్క‌డే వెత‌కాల‌ని, ఏదో పుస‌క్తాన్ని హీరో చ‌దువుతుండ‌టం, ప్ర‌మాదాన్ని దాట‌డానికే నా ప్రయాణం అని హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్ప‌టం స‌న్నివేశాలు ... ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌టానికి మన క‌థానాయ‌కుడు సాయిధ‌రమ్ తేజ్ ఏం చేశార‌నేదే అస‌లు క‌థ అని విరూపాక్ష సినిమా అని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్, అజ‌నీష్ లోక్‌నాథ్ బీజీఎం సినిమాపై ఆస‌క్తిని రెట్టింపు చేస్తున్నాయి. టీజ‌ర్ చివ‌ర‌లో ఓ అమ్మాయి అలా గాలిలో ఎగురుతూ క‌న‌ప‌డుతున్న స‌న్నివేశంలో ఆడియెన్స్‌లో తెలియ‌ని ఓ భ‌యాన్ని క‌లిగిస్తోంది.

సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించ‌టం విశేషం.

నటీనటులు:
సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్
స్క్రీన్ ప్లే: సుకుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌
సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీనాగేంద్ర తంగ‌ల‌
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: స‌తీష్ బి.కె.ఆర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అశోక్ బండ్రెడ్డి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved