`
pizza

Virupaksha Nachavule song out
సుప్రీమ్‌హీరో సాయిధరమ్ తేజ్ మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష నుంచి నచ్చావులే నచ్చావులే లిరికల్ సాంగ్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

25 March 2022
Hyderabad

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని, ఉత్కంఠను కలిగించింది. తాజాగా ఈ చిత్రం నుంచి నచ్చావులే.. నచ్చావులే అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ సాహిత్యం సమాకూర్చగా, కార్తీక్ ఆలపించారు. 1990లో జరిగే కథలో ఓ ప్రాంతంలో ప్రజలు విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపడానికి కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ ఏం చేశారనేది అసలు కథ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా థ్రిల్లింగ్‌గా వుంటుందని చెబుతుంది చిత్రబృందం. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి జీనియస్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.
--

నటీనటులు:

సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్
స్క్రీన్ ప్లే: సుకుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌
సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీనాగేంద్ర తంగ‌ల‌
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: స‌తీష్ బి.కె.ఆర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అశోక్ బండ్రెడ్డి
పి.ఆర్‌.ఓ: వంశీ కాకా, మ‌డూరి మ‌ధు

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved