Vishnu Manchu Pours ₹100 Crore Into Microdramas After Kannappa’s Triumph
‘కన్నప్ప’ బ్లాక్ బస్టర్ తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు
Telugu cinema circles are abuzz yet again. Actor–producer Vishnu Manchu, fresh off the stellar critical reception for his performance in Kannappa, is making waves with his next big move: a ₹100 crore investment into Microdramas.
Industry insiders reveal that Vishnu has backed the ambitious project with his own capital while also raising equity, signaling a major leap into the future of entertainment.
So, what are Microdramas? They are short, cinematic episodes (3–7 minutes each) designed for mobile-first audiences — tightly written, visually rich, and emotionally gripping stories that pack the punch of a film into just a few minutes. Unlike casual reels, these micro-stories come with full-scale production, professional direction, and high storytelling value.
With Kannappa cementing Vishnu’s credibility as a performer and producer, insiders say this new venture cements his vision as a game-changing entrepreneur in Indian entertainment.
Industry source who knows this development note: “Vishnu has gone from delivering one of the most talked-about performances of the year to betting big on how the next generation will consume stories. This could be a double milestone moment — a critical win and a business masterstroke.”
Reports also suggest that Vishnu is simultaneously lining up announcements for his next big projects, keeping both fans and the industry guessing.
‘కన్నప్ప’ బ్లాక్ బస్టర్ తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు
డివైన్ బ్లాక్ బస్టర్ ‘కన్నప్ప’ తరువాత విష్ణు మంచు చేయబోయే ప్రాజెక్టులు, సినిమాలపై అందరి దృష్టి పడింది. ‘కన్నప్ప’లో అద్భుతమైన నటనను కనబర్చిన విష్ణు మంచు మీద ఆడియెన్స్ ఎంతలా ప్రశంసలు కురిపించారో అందరికీ తెలిసిందే. ఇక విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం.
ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతోన్నారు. మైక్రోడ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతోన్నారు. మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్‌లో యూజర్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, ఎఫెక్టివ్ స్టోరీ, నెరేషన్‌తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట.
ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్-ఛేంజింగ్‌గా మారుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ పరిణామం గురించి తెలిసిన పరిశ్రమ వర్గాలు.. ‘ఈ ఏడాది ‘కన్నప్ప’తో అత్యంత చర్చనీయాంశంగా విష్ణు నిలిచారు. తరువాతి తరం కథలను ఎలా చెబుతుంది? అసలు ఎలాంటి కథలు తెరపైకి వస్తాయి? అని చర్చించుకునే స్థాయికి చేరుకున్నారు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా విష్ణు అందరిని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ మైక్రో డ్రామాలతో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు’ అని అనుకుంటున్నాయి. ఇవే కాకుండా మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం.