pizza

Vishnu Vinyasam Teaser launched
'విష్ణు విన్యాసం' మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా. 28న ఫ్యామిలీతో కలసి థియేటర్స్ కి వెళ్ళండి. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు

You are at idlebrain.com > news today >

18 February 2026
Hyderabad

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ 'విష్ణు విన్యాసం'తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పుడు హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ లాంచ్ చేశారు.

విష్ణు పాత్రకు జాతకాలంటే పిచ్చి, అతని తండ్రి మాత్రం డబ్బునే దేవుడిలా భావిస్తాడు. చిన్న నిర్ణయం తీసుకునే ముందు కూడా వాస్తు చూసే అతని అలవాటు కథలో హాస్యాన్ని తీసుకొస్తుంది. ఈ గందరగోళ మధ్యలో అతను ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయి అతనికంటే అనూహ్యంగా ప్రవర్తిస్తుంది. ఒక క్షణం ప్రేమగా ఉంటే, మరో క్షణం తనకో అబ్బాయిని వెతకమని అడుగుతుంది. ఈ డైనమిక్‌తో ఒక కొత్త తరహా, క్విర్కీ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది.

టీజర్ ప్రారంభం “Use Headphones” అనే వార్నింగ్‌తో, ఒక సరదా ఎమోజీతో మొదలవుతూ వినోదభరితమైన ప్రయాణానికి ఆహ్వానిస్తుంది. ప్రపోజల్, కిస్ సీన్లు యూత్‌ఫుల్ హ్యూమర్‌తో ఆకట్టుకుంటాయి. కథనాన్ని వినూత్నంగా, అత్యంత ఫన్నీగా ప్రెజెంటర్ చేశారు దర్శకుడు యదునాథ్ మారుతి రావు.

కామెడీలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించారు శ్రీ విష్ణు. ఆయన టైమింగ్, రియాక్షన్స్ ప్రేక్షకులకు నవ్వులు పంచాయి. నయన సారిక పాత్రలోని ఆఫ్‌బీట్ ఛార్మ్ కామెడీని మరింత పెంచుతుంది. వారి కెమిస్ట్రీ సరదా అల్లరి, యూనిక్ డైలాగ్స్ తో మెప్పిస్తుంది.

సపోర్టింగ్ కాస్ట్ లో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి నటులు ఉండటంతో నవ్వుల వర్షం ఖాయం.

సాయి శ్రీరామ్ అందించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి, సంగీత దర్శకుడు రధన్ తన ఎనర్జిటిక్ స్కోర్‌తో సినిమా ఫన్ టోన్‌ను మరింత ఎలివేట్ చేశారు. ఆర్ట్ డైరెక్షన్‌ను ఏ. రామాంజనేయులు, ఎదిత్ర కార్తికేయన్ రోహిణి. నిర్మాణ విలువలు జానర్‌కు తగ్గట్టుగా బలంగా కనిపిస్తున్నాయి.

క్విర్కీ టోన్, లైట్‌హార్ట్‌డ్ వైబ్, శ్రీ విష్ణు స్పెషల్ చార్మ్ తో “విష్ణు విన్యాసం” ఒక ఫ్రెష్ ఎంటర్‌టైనర్‌గా అలరించనుంది. విడుదలైన టీజర్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మీడియా మిత్రులకు. ఆడియన్స్ అందరికీ థాంక్యూ. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా 28న రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ యంగ్ బ్యాచ్ కి పిచ్చిపిచ్చిగా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్ అంత ఫ్యామిలీస్ కి విపరీతంగా నచ్చుతుంది. చివరి 15 నిమిషాలు కుర్రాళ్ళకి ఫ్యామిలీకి అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా. తప్పకుండా మీరందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. చాలా మంచి డైలాగులు ఉంటాయి. డైరెక్టర్ మారుతి రావు గారు ఒంగోలు నేపధ్యంలో తీసుకున్నారు. చాలా కొత్త పదాలు ఇందులో ఉంటాయి. ఇప్పటివరకు చూసిన అందరూ కూడా డైలాగ్స్ కి విపరీతంగా నవ్వుతున్నారు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాతలకి థాంక్యూ సో మచ్. అలాగే టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నయన్ సారిక చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాలో నటించిన అందరూ చక్కగా పెర్ఫార్మ్ చేశారు. 28న అందరూ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ కి వెళ్ళండి. మీ అందరికీ నచ్చుతుంది.

హీరోయిన్ నయన సారిక మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా టీజర్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉందో సినిమా కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది .అందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. డైరెక్టర్ మారుతి గారు నెక్స్ట్ లెవెల్ లో సినిమా తీశారు. ఆయన రైటింగ్ అద్భుతం. కచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. శ్రీ విష్ణు గారి సిచువేషన్ కామెడీ అదిరిపోతుంది. ఇది మామూలుగా ఉండే లవ్ స్టోరీ కాదు. చాలా మలుపులు ఉన్నాయి ఫిబ్రవరి 28న మీరంతా చాలా ఎంజాయ్ చేస్తారు.

డైరెక్టర్ యదునాథ్ మారుతీ రావు మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ. టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. విష్ణు గారు నుంచి ఏవైతే ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఇందులో ఉంటాయి. ఆయన 28న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమాని చూస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మాట్లాడుతూ.. ఈ కథ వినగానే నాకు చాలా నచ్చింది. చాలా రోజులుగా ఒక మంచి వైబ్ తో ఉన్న సినిమా చేయాలనుకుంటున్నాను. విష్ణు గారి సినిమా రూపంలో వచ్చింది. అందరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మా రైటర్స్, సింగర్స్ కి ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ప్రొడ్యూసర్ సుమంత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఉదయాన్నే సినిమా చూశాను. అదే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. విష్ణు గారి దగ్గర నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. అందరూ ఫ్యామిలీతో రండి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. 28న మా విష్ణు చేసే విన్యాసం మీరందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

తారాగణం: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
సమర్పణ: హేమ & షాలిని
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
DOP: సాయి శ్రీరామ్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved