pizza

Mass Ka Das Vishwak Sen, Sreedhar Ganta, Sudhakar Cherukuri, SLV Cinemas Production No 8, #VS13 Launched Grandly, Regular Shoot From September
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, శ్రీధర్ గంటా, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ ప్రొడక్షన్ నెం 8, #VS13 గ్రాండ్ గా లాంచ్, సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

You are at idlebrain.com > news today >

15 August 2024
Hyderabad

Mass Ka Das Vishwak Sen's 13th movie #VS13, to be produced by Sudhakar Cherukuri of SLV Cinemas as Production No. 8 from the banner, was announced recently through a pre-look poster that presented him as a ferocious cop. Written and directed by debutant Sreedhar Ganta, #VS13 will show Vishwak Sen in the role of an honest IPS Officer. The film is billed to be a distinctive political action drama set against a village backdrop.

Today, the movie was launched in a grand manner in the presence of the film's unit and also a few special guests. Producers Naga Vamsi and Sahu Garapati handed over the script to the makers. Director Vassishta sounded the clopboard, while Srikanth Odela switched on the camera for the muhurtham shot. As announced by the makers, the regular shoot of the movie commences from September. Kannada beauty Sampada who is the leading lady in the movie also graced the occasion.

Every Action Fires A Reaction is the tagline of the movie that will feature well-known actors and top-class technicians working on it. Cinematography will be handled by Kishore Kumar of Thangalan fame, while the music will be composed by Ajaneesh Loknath, known for his work on Kantara.

Cast: Vishwak Sen, Sampada

Technical Crew:
Writer, Director: Sreedhar Ganta
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas
DOP: Kishore Kumar
Music: Ajaneesh Loknath

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, శ్రీధర్ గంటా, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ ప్రొడక్షన్ నెం 8, #VS13 గ్రాండ్ గా లాంచ్, సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 13వ మూవీ #VS13, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 8గా ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. విశ్వక్ ని ఫెరోషియస్ పోలీసుగా ప్రజెంట్ చేసిన ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న #VS13లో విశ్వక్ సేన్ హానెస్ట్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పోలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది.

ఈరోజు చిత్ర యూనిట్‌తో పాటు మరికొందరు ప్రత్యేక అతిధుల సమక్షంలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు వశిష్ట క్లాప్‌ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. మేకర్స్ అనౌన్స్ చేసిన ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ బ్యూటీ సంపద కూడా ఈ వేడుకకు హాజరైంది.

ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి టాప్-క్లాస్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తంగలన్ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చనున్నారు.

నటీనటులు: విశ్వక్ సేన్, సంపద

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీధర్ గంటా
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
డీవోపీ: కిషోర్ కుమార్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved