Ś
pizza

Rama Rama song from Vishwambhara clocks 25 Million views
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర' బ్లాక్ బస్టర్ హిట్ రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

You are at idlebrain.com > news today >

12 May 2025
Hyderabad

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ తో ప్రారంభించారు.

"జై శ్రీ రామ్" అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారి చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో 25+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి అన్ని మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ కొనసాగుతూ బ్లాక్ బస్టర్ హిట్ గా అదరగొడుతోంది.

సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్, మ్యాసీవ్ సెట్.. ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. రానున్న రోజుల్లో ఈ సాంగ్ మరింత పెద్ద హిట్ కాబోతోంది.

తన బ్లాక్‌బస్టర్ ఫస్ట్ మూవీ బింబిసారతో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వశిష్ట, విశ్వంభర ని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. దీనిని ఆయన తన అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రీం ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. మ్యూజికల్ జీనియస్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డిఓపి: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved