pizza

Macho Star Gopichand, Sreenu Vaitla, TG Vishwa Prasad, People Media Factory, Chitralayam Studios’ #Gopichand32 Titled Viswam, The First Strike Offers Mass Feast
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ #Gopichand32 టైటిల్ విశ్వం- ఫస్ట్ స్ట్రైక్ మాస్ ఫీస్ట్

You are at idlebrain.com > news today >

11 April 2024
Hyderabad

Macho Star Gopichand and director Sreenu Vaitla offer a mass feast on the eve of Eid, by releasing the first strike video. The high-voltage action entertainer #Gopichand32 produced by TG Vishwa Prasad under People Media Factory and Venu Donepudi’s Chitralayam Studios is titled powerfully Viswam.

The first strike video opens with wedding celebrations with the bride and groom entering the venue, a group of musicians playing different instruments, the priest chanting mantras, and chefs readying delicious food. Gopichand makes an entry carrying a huge guitar case on his shoulder and walking towards the wedding venue. It’s not a guitar, but a machine gun. Shockingly, he starts shooting the bride and groom, and all the guests at the wedding. Finally, he enjoys the food over there and says, “Daane Daane Pe Likha, Khane Wale Ka Naam… Ispe Likha Mere Naam… (The name of the person eating is written on every grain… My name is written on it…).

It’s really surprising to see Gopichand who looked ultra-stylish, sporting a light beard and with dark glasses on, in such a negative-shaded character. The way he uttered the dialogue designates the grey facet of the character.

Sreenu Vaitla is back and with a bang. The first strike looks extremely stylish and promising. He presented Gopichand in an astoundingly different character. KV Guhan’s master craftsmanship is visible in each frame. Chaitan Bharadwaj’s score speaks volumes about how rich the film is technically. The magnificent production design offers an eye feast. Overall, the first strike offered a mass feast.

Gopi Mohan who was associated with various blockbusters of Sreenu Vaitla has written the screenplay. Amar Reddy Kudumula is the editor, while Kiran Manne is the art director. The film’s heroine and other details will be revealed soon.

Cast: 'Macho Star' Gopichand

Technical Crew:
Director: Sreenu Vaitla
Presents: Donepudi Chakrapani
Producer: TG Vishwa Prasad & Venu Donepudi
Co-Producer: Vivek Kuchibotla
Creative Producer: Krithi Prasad
Banner: People Media Factory, Chitralayam Studios
DOP: K V Guhan
Music: Chaitan Bharadwaj
Writers: Gopi Mohan, Bhanu-Nandu, Praveen Verma
Editor: Amar Reddy Kudumula
Art Director: Kiran Kumar Manne
Fight Master: Ravi Verma,Dinesh Subbarayan
Executive Producer: Kolli Sujith Kumar, Aditya Chembolu
Co-Director: Kongarapi Rambabu, Loknath
Direction Team: Sri Harsha, Ranjith, Veera
Production Executive: Pujyam Sri Rama Chandra Murthy
Production Managers: T Vinay, D Balakrishna
Designer: Ananth kancharla (Padmasri Ads)

మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ #Gopichand32 టైటిల్ విశ్వం- ఫస్ట్ స్ట్రైక్ మాస్ ఫీస్ట్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఈద్ సందర్భంగా ఫస్ట్ స్ట్రైక్ వీడియోను విడుదల చేయడం ద్వారా మాస్ ఫీస్ట్ ని అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వ ప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్‌ పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్32కి 'విశ్వం' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.

వధూవరులు పెళ్లి మండపంలోకి రావడం, సంగీత విద్వాంసుల బృందం వివిధ వాయిద్యాలను వాయిస్తూ, పూజారి మంత్రాలు పఠించడం , రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్న చెఫ్‌లు.. ఇలా వివాహ వేడుకలతో ఫస్ట్ స్ట్రైక్ వీడియో ప్రారంభమవుతుంది. గోపీచంద్ పెద్ద గిటార్ కేస్‌ని భుజంపై వేసుకుని పెళ్లి వేదిక వైపు నడుస్తూ ఎంట్రీ ఇచ్చారు. అది గిటార్ కాదు, మెషిన్ గన్. ఆశ్చర్యకరంగా, అతను వధూవరులను, వివాహానికి వచ్చిన అతిథులందరినీ కాల్చడం ప్రారంభిస్తారు. చివరగా, అతను అక్కడ ఫుడ్ ని ఆస్వాదిస్తూ, “దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్... ఇస్పే లిఖా మేరే నామ్..' అని చెప్పడం చాలా పవర్ ఫుల్ గా వుంది.

లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకునిస్టైలిష్‌గా కనిపించిన గోపీచంద్‌ని నెగెటివ్‌ షేడ్‌లో చూడటం నిజంగా సర్ప్రైజింగ్ గా ఉంది. అతను డైలాగ్ పలికిన విధానం క్యారెక్టర్ గ్రే షేడ్ ని సూచిస్తుంది.

శ్రీను వైట్ల ఫస్ట్ స్ట్రైక్ ని మాస్ ఫీస్ట్ గా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇది చాలా స్టైలిష్‌గా, ప్రామెసింగ్ గా కనిపిస్తుంది. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపించారు. కేవీ గుహన్‌ నైపుణ్యం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. చైతన్ భరద్వాజ్ స్కోర్ సినిమా సాంకేతికంగా ఎంత రిచ్ గా ఉందో తెలియజేస్తుంది. అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ కన్నుల విందును అందిస్తుంది. మొత్తంమీద, ఫస్ట్ స్ట్రైక్ మాస్ ఫీస్ట్ ని అందించింది.

శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. అమర్‌రెడ్డి కుడుముల ఎడిటర్‌గా, కిరణ్‌ మన్నె ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడి తెలియజేస్తారు మేకర్స్.

నటీనటులు: 'మాచో స్టార్' గోపీచంద్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శ్రీను వైట్ల
సమర్పణ: దోనేపూడి చక్రపాణి
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
డీవోపీ: కే వి గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
రైటర్స్: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్ మాస్టర్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లి సుజిత్ కుమార్, ఆదిత్య చెంబోలు
కో-డైరెక్టర్: కొంగరపి రాంబాబు, లోకనాథ్
డైరెక్టర్ టీం: శ్రీ హర్ష, రంజిత్, వీర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పూజ్యం శ్రీరామ చంద్ర మూర్తి
ప్రొడక్షన్ మేనేజర్స్: టి వినయ్, డి బాలకృష్ణ
డిజైనర్: అనంత్ కంచర్ల (పద్మశ్రీ యాడ్స్)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved