05 October 2024
Hyderabad
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గోపీచంద్, కావ్యథాపర్ పై విడుదలైన రొమాంటిక్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. దసరా కానుకగా విశ్వం సినిమా అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు.
గోపీచంద్ తో విశ్వం ఎలా మొదలైంది?
గోపీచంద్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నాం. అందుకే ఆయన్ను ద్రుష్టిలో పెట్టుకుని కథ రెడీ చేసి వినిపించాను. తను సాటిస్ ఫై అయి షూట్ కు వెళదాం అన్నారు. నా శైలిలోకి రావాలంటే 8నెలలు పడుతుందని టైం తీసుకున్నా. అంతా బాగా వచ్చాక అభిరుచిగల నిర్మాత దోనేపూడి చక్రపాణి తోపాటు విశ్వప్రసాద్ గారు జాయిన్ అయ్యాక సినిమాకు మరింత బలం చేకూరింది. అందుకే యాక్షన్ హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్ చేయాలని డెప్త్ లోకి వెళ్ళి ఈ సినిమా చేశాను.
గోపీచంద్ యాక్షన్ మార్క్ వుంటుందా, మీ తరహా ఎంటర్ టైన్ వుంటుందా?
యాక్షన్ తోపాటు హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ మూవీగా వుంటుంది.
పాప చుట్టూ కథ తిరుగుతుందా?
ఇందులో పాప పాత్ర కీలకంగా వుంటుంది.
చిత్రీకరణ పరంగా మీరు పేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా వున్నాయా ?
విశ్వం చిత్రమే చాలా పెద్ద స్పాన్ వున్న కథ. అందుకే మార్కెట్ పరంగా ఛాలెంజ్ గా తీసుకుని దానికి అనుగుణంగా డిజైన్ చేశాను. అందుకు నిర్మాతల సపోర్ట్ బాగుంది. నేను విశ్వంను ఎలా ఊహించుకున్నానో అలా తీయగలిగాను.
విశ్వం టైటిల్ గురించి చెప్పండి?
ఏదో టైటిల్ పెట్టాలని కాకుండా కథ ప్రకారమే పెట్టాం. విశ్వంలో చాలా సీక్రెట్స్ వుంటాయి. అలాగే ఈ విశ్వంలో కూడా చాలా విషయాలుంటాయి.
కోవిడ్ తర్వాత దర్శకులు ఆడియన్స్ టేస్ట్ రీత్యా చాలా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరెలా అప్ డేట్ అయ్యారు?
గ్యాప్ వచ్చినా నేను ఎక్కడున్నా సినిమాలు చూస్తూ వస్తున్న మార్పులు గమనిస్తూనే వుంటాను. వీటితోపాటు నా శైలిలో ఎంటర్ టైన్ మెంట్ ఎలా చెప్పాలో ఎక్కువ స్ట్రగుల్ అయ్యాను. ప్రోపర్ గా సెట్ అయిందని హీరో, నిర్మాత ఫీలయ్యారు. అదే ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు.
గ్యాప్ తీసుకోవడం సెట్ చేసుకోడానికి కారణమా?
నేను గేప్ తీసుకున్నా నా శైలి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే వుంది. ఏదో చోట నా కంటెంట్ వస్తూనే వుంది. థీమ్ లు రీపీట్ అవుతున్నాయని అంటున్నారు. దాన్ని క్రాక్ చేయాలంటే టైం పడుతుంది. ప్రెష్ థీమ్ తో రావాలని కొంత టైం తీసుకున్నా.
విశ్వంలో మెయిన్ థీమ్ ఏమిటి? ప్రేక్ష కులు సహజత్వాన్ని కోరుకుంటున్నారు గదా?
పదేళ్ళ నాడు హీరో తెలివితేటలతో ఏదైనా సాధించగలగడం అనే కథలు వచ్చాయి. ఈ సినిమా అలా వుండదు. బర్నింగ్ ఇష్యూ తీసుకుని దాన్ని ఎంటర్ టైన్ మెంట్ లో ఎలా చెప్పొచ్చో చేశాను. మేకింగ్ వైజ్ గా వినూత్నంగా వుంటుంది. నాకూ, గోపీకు చాలా ఫ్రెష్ సినిమా అవుతుంది.
గోపీచంద్ పాత్ర ఎలావుంటుంది?
గోపీ పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. గ్లింప్స్ లో అటెన్షన్ కోసం అలా చూపించాం.
సంగీత దర్శకుడిగా చైతన్య భరద్వాజ్ ను తీసుకోవడానికి కారణం?
తను గతంలో ఓ పాట చేయమంటే బాగా చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకు ఇతను కరెక్టేనా అని చాలామంది అన్నారు. కానీ ఆయన ప్రతిభ నాకు తెలిసు. అందుకే రెండు సన్నివేశాలు చెప్పి ట్యూన్ చేయమన్నా. చేసి తీసుకువచ్చాక బాగా నచ్చాయి. సాంగ్స్ తోపాటు ఈ కథకు రీ-రికార్డింగ్ ఎక్స్ ట్రాడినరీ గా చేయడం అనేది గొప్ప. సినిమా రిథమ్ ను పట్టుకుని చేయడం సీనియర్స్ కే సాధ్యం అది చైతన్యలో వుంది.
యాక్షన్ సీన్స్ ఎక్కడెక్కడ తీశారు?
రోమ్, మనాలి, గోవాలో చేశాం. రెగ్యులర్ ఫైట్స్ కాదు. సహజంగా వుంటాయి. ప్రతి యాక్షన్ హీరోయిజంలా వుంటుంది. కథ ప్రకారమే ఫైట్స్ వుంటాయి. ఎక్కడా అతికిచ్చినట్లు వుండదు.
వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ లా విశ్వంలో వున్నట్లుంది?
నేను ఇందులోనూ ట్రైన్ ఎపిసోడ్ కథకు అవసరం అని పెట్టాను. ముందు ఇలా అనుకున్నప్పుడు వెంకీతో కంపేర్ చేస్తారనిపించింది. కానీ దానికి దీనికి చాలా తేడా వుంటుంది. విశ్వంలో హిలేరియస్ గా వుంటుంది. ట్రైన్ లో అండర్ కరెంట్ డేంజర్ కూడా వుంది. 30 నిముషాల పాటు వెన్నెల కిశోర్, గణేష్, నరేష్, కవిత, చమక్ చంద్ర, షకలక శంకర్ వీరందరితో టైన్ జర్నీ చాలా బాగుంటుంది.
గోపీ మోహన్ గురించి?
ఈ సినిమాలో హెల్ప్ కోసం తీసుకున్నా. గోపీకి నా మైండ్ సెట్ బాగా తెలుసు. నన్ను అర్థంచేసుకుంటాడు. ఏదైనా ఐడియా చెబితే ఊహించుకోగలడు. అలాగే భాను, నందు అనే రచయితలను కూడా కొత్తగా తీసుకున్నాను. చాలా ప్రేమతో వారంతా పనిచేశారు.
ఓటీటీ వల్ల ఆడియన్స్ ఆలోచనలు మారుతున్నాయి. మరి మీ సినిమా వారికి చేరుతుందా?
ఏదైనా కంటెంట్ స్ట్రాంగ్ గా వుంటేనే థియేటర్ కు రాగలరు. ఆడియన్స్ కూడా వెంకీ తరహా మిస్ అవుతున్నారని అంటున్నారు. అందుకే కేర్ తీసుకుని ఈ సినిమా చేశాను.
కామెడీ టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ వచ్చేసింది. మరి సినిమా చేసేటప్పుడు మీకు కష్టంగా అనిపించలేదా?
ఇప్పుడు ప్రేక్షకులు సందర్భానుసారంగా రాసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో కంటెంట్ తీసుకోకూడదు. మనమే సన్నివేశాలు క్రియేట్ చేయాలి. కథలోనే కామెడీ వుండడం ఒకరకంగా టఫ్ అయినా కష్టపడి చేశాం.
ప్రస్తుతం ఓటీటీ ఇంపాక్ట్ చాలా వుంది దానిపై మీరేమంటారు?
కథ బాగుంటే ఖచ్చితంగా థియేటర్ వరకు వస్తారు. కంటెంట్ నమ్మి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది. నేను ఫ్రెష్ థీమ్ తీసుకుని వినోదంగా చేశాను.
విశ్వం గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే ఏమి చెబుతారు?
ఎమోషనల్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. విశ్వం అనే పాత్ర జర్నీ ఇది. ఆయన జ్రర్నీలో ఎలాంటి వ్యక్తులు కలిశారు. చాలా విషయాలు ఇందులో వుంటాయి. రేపు తెరపై చూస్తే మీకే అర్థమవుతుంది.
మీ సినిమాల్లో బ్రహ్మానందం, ఎం.ఎం. నారాయణ లాంటి వారితో సెటైరిక్ గా వుండేవి. మరి ఈ సినిమాలో అలా వుంటాయా?
నా శైలి సెటైర్. ఢీ నుంచే మన సినిమాలో అటువంటి ప్లే స్టార్ట్ అయింది. అందుకే వెంకీ చిత్రం రిరిలీజ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. విశ్వంలో హీరోయిజం, విలన్ పాత్రలు రియలిస్ట్ గా వుంటాయి. వారికి తోడు వెన్నెల కిశోర్, నరేష్, గణేష్, ప్రుధ్వీ వంటి పాత్రలు హైలైట్ గా వుంటాయి.
మిమ్మల్ని ఫాలో అయి చాలామంది అలా చేస్తున్నారు? ఇప్పుడు మొనాటిగా మారినట్లు గమనించారా?
అవును. అందుకే నా శైలిలో చేయాలని చేశాను.
రీరిలీజ్ లకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు కారణం?
ఇక్కడ ఒక్కటే అర్థం చేసుకోవాలి. చాలామంది థియేటర్ ఎంజాయ్ మెంట్ మిస్ అవుతున్నారు. వీటివల్ల ఆ లోటు తీరింది.
గతంలో దర్శకుడు ప్లాప్ ఇచ్చినా మరో బ్లాక్ బస్టర్ కొడతారనే పోకడ వుంది. నేడు అలా లేదు. హిట్ కొడితేనే అవకాశం. దీన్ని మీరెలా చూస్తారు?
ఎప్పుడైనా ప్లాప్ ఇస్తే, బ్లాక్ బస్టర్ హిట్ కూడా దర్శకులు ఇస్తారు. కాకపోతే అప్పట్లో జనాలు బయట అనుకునేవారు. నేడు సోషల్ మీడియా పెరిగింది. ఇదివరకు ఇది లేదు. అందుకే అప్పట్లో అనుకునే వారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వేదిక చేసుకున్నారు. ఎవరైనా బెటర్ సినిమా చేయాలని అనుకుంటారు.
మారుతున్నసాంకేతికతతో మీరు అప్ డేట్ అయ్యారా?
టెక్నికల్ గా నేను ఎప్పుడూ అప్ డేట్ అవుతూనే వుంటాను. కంటెంట్ చేతిలోకి వచ్చాక కొత్త టెక్నాలజీ ప్రకారం అప్ డేట్ లోనే చేయాలనే కసితో చేస్తాం. అవన్నీ మీరు ఈ సినిమాలో చూస్తారు. ప్రత్యేకంగా ఈ సినిమాలో విజువల్స్ చాలా వండర్ గా వుంటాయి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీలవుతారు. అంతేకాక కథ ప్రకారం సాగే యాక్షన్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. అందుకే రవివర్మ ఫైట్ మాస్టర్ తో చేశాం. అవి వినూత్నంగా ఫ్రేక్షకుడు ఫీలవుతాడు.
నిన్న రిలీజ్ చేసిన సాంగ్ పాపులర్ అయ్యాయి. ఎక్కడ చేశారు?
గోపీ, కావ్య పై రొమాంటిక్ సాంగ్ చేశాం. సర్జీనియా ఐలాండ్ లో ఎవరూ చేయని లొకేషన్ లో చేశాం. మంచి ట్రీట్ లా వుంటుంది.
హీరోయిన్ పాత్ర ఎలా వుంటుంది?
కావ్య థాపర్ పాత్ర చాలా ఎంటర్ టైన్ లో సాగుతుంది. కథకు అనుగుణంగానే పాత్ర వుంటుంది.
పాన్ ఇండియా కోసం తీశారా?
నేను కేవలం తెలుగు ఆడియన్ కోసం తీశాను. పాన్ ఇండియా వెళితే మంచిదే. ఈ సినిమాకు అభిరుచి గల నిర్మాతలు దోనేపూడి చక్రపాణి, విశ్వప్రసాద్ వుండడం వల్లే సినిమా బాగా వచ్చింది. వారు నేను అడిగిన దానికి పూర్తి సపోర్ట్ ఇచ్చారు. చాలా హ్యాపీ గా ఔట్ పుట్ రావడానికి కారకులు అయ్యారు. సినిమా చూశాక మీకు అదే ఫీలింగ్ కలుగుతుంది.
ఢీ సీక్వెల్ ఎప్పుడు?
శ్రీహరిగారిని రీప్లేస్ మెంట్ చేయడం కష్టం.
|