Viswam teaser launched
'విశ్వం' శ్రీనువైట్ల గారి మార్క్ లో చాలా ఎంటర్‌టైనింగ్ గా వుంటుంది. డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్
గోపీచంద్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ 'విశ్వం' హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ విడుదల, అక్టోబర్ 11న థియేట్రికల్ రిలీజ్
డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్ తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వం'. ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్ నరేష్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైయింది. గోపీచంద్, కావ్యా థాపర్ పాత్రల పరిచయం, వారి క్యారెక్టర్స్ లో కామెడీ స్పార్క్ ఆకట్టుకున్నాయి. టీజర్ లో ప్రముఖ నటీనటులతో కామెడిక్ సీన్స్ హిలేరియస్ గా వున్నాయి, టీజర్ చివరి భాగంలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి.
ఎంటర్‌టైన్‌మెంట్,యాక్షన్‌ని ఎఫెక్టివ్‌గా బ్యాలెన్స్ చేస్తూ హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ ని ప్రజెంట్ చేశారు శ్రీను వైట్ల. డైలాగ్‌లు, కామెడీ, యాక్షన్ బ్లెండ్ మంచి కమర్షియల్ ఔటింగ్ ని ప్రామిస్ చేస్తున్నాయి.
గోపీచంద్ అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు. తన ఇంటెన్సిటీతో కామెడీని బ్లెండ్ చేసే పాత్రలో మెరిశారు. కావ్య థాపర్ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, నరేష్, వెన్నెల కిషోర్, మిగతా నటులు వినోదాన్ని అందించారు.
కెవి గుహన్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది, చైతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మరింత డెప్త్ ని జోడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి.
శ్రీనువైట్ల బ్లాక్‌బస్టర్స్‌కు పని చేసిన గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. అమర్‌రెడ్డి కుడుముల ఎడిటర్, కిరణ్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. "విశ్వం" అక్టోబర్ 11న దసరాకి విడుదల కానుంది, పండగ సీజన్‌లో ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుండబోతోంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారికి థాంక్ యూ. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా అయ్యేది కాదు. శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. వన్ ఇయర్ బ్యాక్ ఆయన్ని ఓ పార్టీలో కలవడం, సినిమా చేద్దామని అనుకోవడం, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. శ్రీను వైట్ల గారు కంఫర్ట్ బుల్, హీరో డైరెక్టర్. హీరోని ఎలా చూపించాలనే కంప్లీట్ క్లారిటీ వున్న డైరెక్టర్. ఈ జర్నీ చాల ఎంజాయ్ చేశాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. సినిమా చాలా బావొచ్చింది. ఒక మంచి ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాను. శ్రీను గారు అందులో మాస్టర్. ఇంత పెద్ద స్కేల్ లో ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేంలో నవ్వు వస్తునే వుంటుంది. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కావ్య చాలా బాగా చేసింది. చేతన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గోపి మోహన్ నా లక్ష్యం, లౌక్యం తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పని చేశారు. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందనే నమ్మకం వుంది' అన్నారు
డైరెక్టర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటారో మారుతున్న టైమ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఒక ఫ్రెష్ థీమ్, చాలా లేయర్స్ తో ప్రాపర్ బ్లెండ్ తో చేసిన కమర్షియల్ సినిమా ఇది. వేణు దోనేపూడి గారితో సినిమా స్టార్ట్ అయ్యింది. తర్వాత విశ్వగారు స్ట్రాంగ్ సపోర్ట్ గా వచ్చారు. వారికి థాంక్ యూ. అవుట్ పుట్ చూసి అందరూ హ్యాపీగా వున్నారు. నాకు సపోర్ట్ గోపి గారికి థాంక్ యూ. కావ్య థాపర్ ఎనర్జిటిక్ గా చేసింది. చాలా పెద్ద స్కేల్ వున్న ఫిలిం ఇది. నా గత సినిమాలకి మించి ఇందులో హిలేరియస్ కామెడీ వుంటుంది. దసరాకి ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేశాలా వుంటుంది. చేతన్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. గుహన్ అద్భుతమైన కెమరా వర్క్ ఇచ్చాడు. ఇటలీ రొమ్ మిలాన్ సర్జినియా గోవా హిమాచల్ ప్రదేశ్ .. ఇలా చాలా ప్లేసస్ లో షూట్ చేశాం. గుహన్ సపోర్ట్ తో ఈజీగా చేయగలిగాను. అందరికీ పేరుపేరునా థాంక్ యూ' అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. యుఎస్ లో శ్రీవైట్ల గారి సినిమాల నుంచే స్టార్ట్ చేశాను. వెంకీ నుంచి ఇప్పటివరకూ ఆయన సినిమాలు ఫాలో అవుతున్నాం. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా వుంది. గోపి గారితో ఇది మా రెండో సినిమా. తప్పకుండా అందరినీ లరిస్తుంది' అన్నారు.
నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. ఈ విజయదశమికి విజయడంఖా మోగించడానికి వస్తున్నాం. శ్రీను వైట్ల గారు గోల్డెన్ హాండ్స్. ఆయన దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ లాంచ్ కావడం ఆనందంగా వుంది. విశ్వప్రసాద్ గారితో కలసి ఈ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీగా వుంది. గోపీచంద్ గారికి థాంక్. ఖచ్చితంగా బిగ్ హిట్ కొట్టబోతున్నాం' అన్నారు.
హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు థాంక్. గోపిచంద్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా చాలా జాయ్ ఫుల్ జర్నీ. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను శ్రీను వైట్ల గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఇంత పెద్ద భాద్యత ఇచ్చినందుకు థాంక్ యూ. నిర్మాతలకు ధన్యవాదాలు. నన్ను బిలివ్ చేసిన గోపీచంద్ గారికి థాంక్ యూ. పాటలు రాబోతున్నాయి. ఆడియన్స్ నచ్చుతాయి. ఆడియన్స్ కి చాలా మంచి ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది'అన్నారు.