pizza

Megastar Chiranjeevi, Mass Maharaja Ravi Tej, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Releasing Worldwide Grandly On January 13, 2023
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

7 December 2022
Hyderabad

Megastar Chiranjeevi and director Bobby Kolli (KS Ravindra)’s crazy mega mass action entertainer Waltair Veerayya is all set to offer poonakaalu to fans and masses in theatres. The film’s shoot is in the last stages and the production works are presently underway in Hyderabad. It is known that the movie will be coming for Sankranthi. It will be releasing grandly worldwide on January 13, 2023, as officially announced by the makers.

Chiranjeevi delivered many blockbusters for Sankranthi and another blockbuster is loading to offer Mass Party in Theatres for the festival. The release date poster presents Chiranjeevi in a vintage mass avatar in a lungi and vibrant shirt with a headband on. He is seen riding a boat in the ocean on a rainy day. This poster alone has the substance to give poonakaalu.

The musical promotions of the movie started on a blockbuster note with Boss Party turning out to be the Party Song Of The Year. Boss Party is a full-on masala number in true DSP style and Chiranjeevi’s dances are a treat to watch. Urvashi Rautela shook her leg opposite Chiranjeevi.

Mass Maharaja Ravi Teja is playing a mighty role in the film. Shruti Haasan is the leading lady opposite Chiranjeevi in the film billed to be a mass-action entertainer laced with all the commercial ingredients. The film is produced on a grand scale by Naveen Yerneni and Y Ravi Shankar of Mythri Movie Makers, while GK Mohan is the co-producer.

Arthur A Wilson cranks the camera, whereas Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.

While the story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned the screenplay. The writing department also includes Hari Mohana Krishna and Vineeth Potluri.

Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan and others.

Technical Crew:
Story, Dialogues, Direction: KS Ravindra (Bobby Kolli)
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Devi Sri Prasad
DOP: Arthur A Wilson
Editor: Niranjan Devaramane
Production Designer: AS Prakash
Co-Producers: GK Mohan, Praveen M
Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri
CEO: Cherry
Costume Designer: Sushmita Konidela

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే. 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

చిరంజీవి సంక్రాంతికి చాలా బ్లాక్‌బస్టర్‌ లను అందించారు. పండుగకు థియేటర్లలో మాస్ పార్టీని అందించడానికి మరొక బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది. విడుదల తేదీ పోస్టర్‌ లో చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్‌ లో లుంగీ, వైబ్రెంట్ షర్ట్‌, హెడ్‌ బ్యాండ్‌ తో కనిపించారు. చేతిలో బల్లెం లాంటి ఆయుధం పట్టుకొని వర్షంలో సముద్రంలో పడవ నడుపుతూ పవర్ ఫుల్ గా కనిపించారు చిరంజీవి. ఈ పోస్టర్ యే పూనకాలు తెప్పించేలా వుంది.

ఫస్ట్ సింగల్ బాస్ పార్టీ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌ గా మారడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌ లో ప్రారంభమయ్యాయి. బాస్ పార్టీ డీఎస్పీ స్టైల్‌ లో పూర్తి మసాలా నంబర్. చిరంజీవి డ్యాన్స్‌లు చూడటానికి ట్రీట్‌ గా వున్నాయి. ఊర్వశి రౌతేలా చిరంజీవి సరసన అలరించింది.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved